కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్న సీఎం సమస్యలపై స్థానికుల నుంచి వినతిపత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు చేశారు. అదే విధంగా ‘జననాయకుడు’ పోర్టల్ సైతం ప్రారంభించారు. కుప్పం నుంచే సమస్యలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసేలా ఏర్పాట్లు చేశారు.
నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి యత్నించారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.కుప్పం నియోజకవర్గం ఎప్పుడూ టీడీపీనే గెలిపించిందని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో ఇంతవరకు వేరే పార్టీ గుర్తు గెలవలేదని అన్నారు.’జననాయకుడు’ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చామని, పార్టీ కార్యకర్తలు, నాయకులు తెచ్చిన సమస్యలన్నీ రికార్డవుతాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉందన్న సీఎం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. ప్రజలకు చాలా హామీలిచ్చి ఓట్లు వేపించారు. కార్యకర్తల కష్టాన్ని వృధా కానివ్వనని ఆయన గట్టిగా హామీ ఇచ్చారు. తెదేపా పార్టీ కోసం పనిచేసిన వారు బయపడకండి.. మీ భవిషత్తుపై భరోసా నాది అని చంద్రబాబు అన్నారు. నేడు టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే కచ్చితంగా కార్యకర్తల త్యాగమే, వారి త్యాగాలను వృధా కానివ్వమని మరోసారి చెప్పారు. నాకు అన్నిటికన్నా కార్యకర్తలే ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. వారి ద్వారా వచ్చిన వినతులు నేరుగా తనకు తెలిసేలా జన నాయకుడు కార్యక్రమం రూపొందించామని, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చూసేలా చూస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు తప్పకుండా పరిస్కారం చూపిస్తాం. పార్టీకి సంబంధిత సమస్యలు, ప్రభుత్వ సంబంధిత సమస్యలు సమానంగా పరిష్కరిస్తామన్నారు.చాలా వరకు కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులే ఇస్తున్నారని కొంచెం సమయం ఇవ్వాలి, తప్పకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. చాలా వరకు ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించేందుకు అన్ని విధాలా పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి తానే స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని చెప్పారు. నా సొంత నియోజకవర్గం పర్యటనకు వచ్చినపుడు తనకు సమస్య అని ఫిర్యాదు అందకుండా చేయాలనే విధంగా ఈ జన నాయకుడు ద్వారా చేయాలన్నదే నా లక్ష్యమని అన్నారు. రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన వ్యవస్థ విధ్వంసం నుండి బయట పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు.ప్రతి ఒక్క నాయకుడు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలు తీర్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా తయారయ్యింధన్నారు. సమస్యలపై అధ్యయనం చేసి పరిస్కారం చూపే విధంగా చూస్తున్నామన్నారు. మీడియాపై రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసులను సమీక్షించి వారిపై పెట్టిన కేసులు మాఫీ చేసేందుకు ప్రత్యేక జీఓ తెస్తామన్నారు. గత పాలనలో ప్రతిఒక్కరూ బాధితులే.. పార్టీలతో సంబంధం లేకుండా సామాన్య వ్యక్తులు, అధికారులు, మీడియాపై కూడా అనేక కేసులు నమోదు చేసారు. ఆ కేసులపై క్షుణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.
54pv98