Sunday, January 19, 2025

Creating liberating content

తాజా వార్తలుదుర్గమ్మ సేవ‌లో కేంద్ర రక్షణ మంత్రి సతీష్ రెడ్డి

దుర్గమ్మ సేవ‌లో కేంద్ర రక్షణ మంత్రి సతీష్ రెడ్డి

విజయవాడ:ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్అండ్‌డి మాజీ కార్యదర్శి, డిఆర్​డిఓ చైర్మన్, కేంద్ర రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం అమ్మవారి దర్శనానికి వచ్చిన సతీష్ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసిన అనంతరం సతీష్ రెడ్డికి వేద ఆశీర్వ‌చ‌న‌లు చేసి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎస్ రామారావు సతీష్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఎన్ రమేష్, వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య, ఆలయ అధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article