Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలువైభవో పేతంగా చక్రధారుడి చక్రస్నానం..!

వైభవో పేతంగా చక్రధారుడి చక్రస్నానం..!

ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు..
చంద్రగిరి :శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారిబ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.అంతకుముందు ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం ఉద‌యం 9.45 గంట‌ల‌కు చ‌క్ర‌స్నానం ఘ‌నంగాజ‌రిగింది.ముందుగా కంకణబట్టార్ శేషాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార,కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలోఅనుసంధానం చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు.

సాయంత్రం 6 నుండి 7గంట‌ల‌కుధ్వ‌జావ‌రోహ‌ణంతోబ్ర‌హ్మోత్స‌వాలుముగుస్తాయి.ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్లు చెంగ‌ల్రాయులు, వెంక‌ట‌స్వామి, ఆల‌య అర్చకులు బాలాజి రంగ‌చార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల విశేషాలు :

  • ఆలయంలోని పోటులో శ్రీ వంశీస్వామి, శ్రీ భానుస్వామి ఆధ్వ‌ర్యంలో రోజుకు 10 నుండి 15 వేల మంది భక్తులకు ప‌ది రకాల ప్రసాదాలు తయారుచేసి పంపిణీ చేశారు. గ‌రుడ‌సేవ, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం వంటి ప‌ర్వ‌దినాల‌లో 20 వేల నుండి 25 వేల మందికి ప్ర‌సాదాలు అందించారు.
  • ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో మీడియా సెంటర్‌ ఏర్పాటుచేసి బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందజేశారు. రోజుకు 100 మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
  • బ్రహ్మోత్సవాల సందర్భంగా వైద్య విభాగం ఆధ్వర్యంలో 1100 మందికి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో 1600 మందికి వైద్యసేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
  • ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తొమ్మిది రోజులకు గాను 10 టన్నుల పుష్పాలు వినియోగించారు. 50 మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు. స్నపనతిరుమంజనం, వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు, చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు.
  • ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ 75 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆలయం, పోటు, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు. గ‌రుడ‌సేవ, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం వంటి ప్ర‌త్యేక దినాల‌లో 25 మంది అద‌న‌పు సిబ్బంది సేవ‌లందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article