బెజవాడ వాసులను వరదల్లో ముంచారా…
బుడమేరే ముంచిందా.. ముంచేలా చేశారా..
ఇది ప్రకృతి ప్రళయమా..నేతల ప్రమేయమా…
ఈవిపత్తు ఉహించనిదా …ఉహించే జరిగిందా…
ఎవరు మునిగి పోయారు..ఎవరు ముంచారు…
ఎవరు లాభపడ్డారు… ఎవరు సర్వం కోల్పోయారు…
ఎవరు బిగ్ షాట్ అయ్యారు.. ఎవరు బికారి అయ్యారు…
సర్వం దోచుకున్నదెవరు…సర్వం అర్పించుకొన్నదెవరు…
ఎవరీ దురాక్రమణ దారులు…ఏమిటీ దురాఘతం
ఎందుకింత నిర్లక్ష్యం… ఏమిటీ నయవంచన
వారు చేసిన పుణ్యమేమిటీ ..వీరు చేసిన పాపమేమిటీ. .
జెండాలే తప్ప అజెండాలు ఉండవా…
ఏమిటీ మీ అజెండా …ఎక్కడ ప్రజలకు అండ…
ఇంకెన్నాళ్లీ దురాక్రమణలు…
లోపాలను సరిదిద్దే దమ్ముందా ..
ప్రభుత్వానికి దమ్ముగా నిలుస్తారా… నిలువరిస్తారా ..
బుడమేరు ను బుగ్గి పాలు చేసిందెవరు ..
వెలగ లేరును వెతలపాలు చేసిందెవరు ..
కొల్లేరును కొల్లగొడుతున్న దెవరు
కొంపలు కొట్టుకుపోతున్న దానికి కారణమెవరు ..
పేదవాడి కొంపలు గుల్లచేసిందెవరు…
ఈ పెత్తందార్ల పై ప్రభుత్వమేమిచేస్తుంది…
చక్కదిద్దుతా…చల్లగా జారు కొంటుందా..
చరిత్ర చెప్పిన సత్యమేమిటీ..
ప్రకృతి నేర్పిన పాఠమేమిటీ…
పాలకులారా పునరాలోచన చేయండి..
ప్రకృతితో చెలగాటం వద్దు…
అధికారులు మారండి..
మీ అవినీతికి, నీతిలేని విధానాలు మానండి..
మీరు కూడా మనుషులేనని నిరూపించుకోండి…
మానవత్వంతో ఆలోచించి అడుగులు వేయండి …
రాజులు రాజ్యాలే పోయాయి…
మనమూ మట్టిలో కలవాల్సిందే…
ఇదంతా మూన్నాళ్ల ముచ్చట…
రూపాయి చూసిమురిసిపోకు…
నీ రూపం గల్లంతైతే…
గాఢంగా ఆలోచించు.. గమనించు..గుర్తించు..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
శతాబ్దాల పోరాటం, ఎన్నో అవాంతరాలు, జల ప్రళయాలు,విపత్తులు, ఊహించని వరదలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో మరెన్నో ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎన్ని దిద్దు బాటు చేసేయలు7 తీసుకున్న ఏలాంటి రక్షణ చర్యలు చేపట్టిన ఊహించని విపత్తుకు ఎంతోకొంత అస్తి, ప్రాణ నష్టం వాటిల్లడం సహజమే. కానీ నాడు అనుకోని ప్రళయాలు చుట్టుముట్టిన కేవలం నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పంటలు పొలాలు ఆ పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు మాత్రమే వరద తాకిడికి బలి అయ్యేవారు.
కానీ నేడు అలా జరగడం లేదే. అందుకు భిన్నమైన పరిస్థితి దాపురించి అనేక దరిద్రాలు చోటుచేసుకుంటున్నాయి. కారణం ఎవరు దీనంతటికి అంటే సమాధానం తెలిసిన తప్పును ఒప్పుకునే అలవాటు లేక పోయి పైగా ఇతరుల మీద నెట్టేసి పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుంది.నిజాయితీ తగ్గిపోయి అవినీతి పెరిగిపోయి విపరీత అనర్థానికి దారి తీస్తున్న అందుకు కారణాలు తెలుసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో విఫలం చెందుతున్నారు.
అసలు ఎంచుకు ఇలా అభివృద్ధి చెంచుతున్న నగరాలు, పట్టణాల్లో నే ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయని విశ్లేషణ చేస్తే విస్తుపోయే నిజాలు బైటికి వస్తున్నాయి.మితి మీరిన దనదాహానికి చెరువులు, నదులు, వాగులు,వంకలుఇలా అన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయి.ఈ ఆక్రమణలు తారాస్థాయికి చేరిపోయి ప్రకృతికే ఎదురోడ్డే విధంగా పరిస్థితి తయారైంది. మరి అటువంటప్పుడు ఉహించని విపత్తు వస్తే ప్రకృతి ప్రకోపానికి ఎవరు బలి కావాలి. వారే బలికావాలి.
ఇలా ఎందుకు అంటే సగటు మనిషి స్వార్థం. అతి తక్కువ కాలంలో ఆర్థికంగా ఎదిగి తనతో పాటు నాలుగు తరాలు కష్టపడకుండా తినాలి,ఒక వేల సంపాదించుకోవాలి అనుకుంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఈ ప్రక్రియ లో ఎదుటివాడు ఏమైన పర్వాలేదు.ఎవరో ఏదో అయితే మనకెందుకులే అన్న నిర్లక్ష్య ధోరణి తో పేద ప్రజలు కావచ్చు వారిని భుచుగా చూపించి వారి వెనుక ఉన్న పెద్దలు కావచ్చు ఫలితంగా ప్రమాదం బారిన పడక తప్పడం లేదు.
ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నా శాశ్విత పరిస్కారం చూపే ఆలోచన లేదు.సమస్య ఉత్పన్నమై నప్పుడు అప్పటి కప్పుడు ఒకరి మీద ఒకరు బురద జల్లే కార్యక్రమం చేసుకోవడం ఆ తరువాత అంతా మాములే…
నిర్మాణాలు ఎక్కడ నిర్మించకూడదంటే….ఎఫ్‌టీఎల్:
ఎఫ్‌టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవల్ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్‌టీఎల్ తెలియజేస్తుంది. అక్కడ అన్ని కాలనీల్లో నీరు ఉండదు. దీంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే.. అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు. నిర్మాణాలు చేయడానికి అక్కడ పర్మిషన్ ఉండదు.
బఫర్ జోన్: రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. సాగు మాత్రమే చేసుకోవచ్చు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. వాటికి 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.చంద్రబాబు తోనే ప్రక్షాళన . .. రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఉండవల్లి కరకట్ట ప్రాంతం లో నిర్మించిన ఓ అద్దే ఇంట్లో నివాసముంటున్నాడు.ఆ నివాసం కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోనిది.దానికి అనుసంధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక నిర్మించడం ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కట్టడాలు అక్రమని ఇక్కడే నుంచే అక్రమ కట్టడాలు కూల్చడం మొదలు అని అన్నారు. ప్రజావేదిక మాత్రమే కూల్చారు.ఆ ప్రక్కన ఉన్న కట్టడాలు మంతెన సత్యనారాయణ ప్రకృతి ఆశ్రమమం,గోకరాజు గంగరాజు కట్టడాలు జోలికి వెళ్లే లోపు కోర్టుల జోక్యం తో వెనకడుగు వేశారు.రాజకీయ ప్రయోజనాలు కక్ష్య సాధింపు లో భాగంగా కొంతమంది నిర్మాణాలు కూలగొట్టారు.ఆ తరువాత ప్రభుత్వ మార్పు జరిగింది. తాడేపల్లి వైసీపీ ఆఫీస్ ,ఇంకా వైసీపీ ఆఫీస్ లు వైసీపీ నేతలు ఇల్లు అక్రమని కూల్చారు.ఇది వారి వారి రాజకీయ వికృత క్రీడలు అనుకోవాలి. ఇప్పుడు బెజవాడ వణికి పోతుంది. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎవరో చేసిన తప్పిదాలు అందరి ప్రాణాలు తీసే విదంగా ఉన్నాయి తొమ్మిది రోజులు కావస్తున్నా వరద నీరు వస్తుంది .వచ్చిన వరద బైటికి వెళ్లే మార్గాలు లేక ఇంకా జలాదిగ్బందం లోనే వేలాది మంది ప్రజలు అన్నామో రామచంద్ర అంటూ విలపిస్తున్నారు. సరే అనుకోని విపత్తు వచ్చింది చర్యలు చేపట్టారు ఓకే. కానీ అక్రమ నిర్మాణాలు తొలగొస్తేనే శాశ్విత పరిస్కారం .అయితే దార్శనికుడు,అభివృద్ధి ప్రదాతగా పేరు ఉన్న చంద్రబాబు నాయుడు మొదట కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని అక్రమాలపై ఉక్కుపాదం మోపితే సగం సమస్యకు పరిస్కారం అవుతుందని మేధావి వర్గాలు అంటున్నాయి.
బుడమేరు ఎక్కడ ఎలా…
కొల్లేరులో పడే నదుల్లో బుడమేరు అతి పెద్దది. నది మొత్తం పొడవు 113 కిలోమీటర్లు. పరీవాహక ప్రాంతం 1,880 చదరపు కిలోమీటర్లు. సముద్ర మట్టానికి 564 మీటర్ల ఎత్తులో విజయవాడకు ఉత్తరాన సుమారు 60 కిమీ దూరంలో తెలంగాణాలో ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రస్తుత ఎన్‌టిఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని జమ్ములవోలు కొండలలో ప్రారంభమై మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ప్రవహించి విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి చేరుతుంది. మధ్యలో కొండవాగు, కోతులవాగు, పులివాగు, బీమ్‌వాగు, లోయవాగు, దొర్లింతలవాగు, ఇంకా అనేక వాగుల ప్రవాహాలను తనలో కలుపుకుంటుంది. ప్రారంభం నుంచి దక్షిణదిశగా 47 కిమీ ప్రవహించి అక్కడి నుంచి 10 కిమీ కృష్ణా నదికి సమాంతరంగా ప్రవహించి ఎనికేపాడు అండర్ టన్నెల్ ద్వారా ఏలూరు కాల్వను దాటుకొని అక్కడి నుంచి ఈశాన్యాన 55 కిమీ ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది. ఏలూరు కాల్వ, రైవస్ కాల్వ మధ్య అనేక మలుపులు తిరుగుతుంది. పరీవాహక ప్రాంతంలో 1,335 చ.కి. పర్వత, ఎత్తయిన ప్రాంతం కాగా మిగతాది డెల్టా ప్రాంతం. వర్షాకాలంలోనే బుడమేరు కనిపిస్తుంది. మామూలు రోజుల్లో ఎండిపోయి ఉంటుంది.
బుడమేరు ఆక్రమణలే కొంపముంచాయి ..
బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయి.20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని విధంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. విజయవాడ నగరం పక్కన ప్రవహించే కృష్ణా నది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా ముప్పు పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు పొంగింది. అప్పుడు విజయవాడలో సగానికి పైగా ముంపునకు గురైంది.బుడమేరులో ఏటా సాధారణ సీజన్‌లో గరిష్ఠంగా 11వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది. బుడమేరు తీవ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల కిందట బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమనూరు ప్రాంతాల్లో ఉన్న “యూ” టర్నింగ్‌లను సవరించాలని 20 ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది.ఆక్రమణలను తొలగించాలి. బుడమేరును దాని గరిష్ఠ సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలి.
ఆక్రమిత కట్టడాలే కొంప ముంచాయి…
విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలే. ఇక్కడ కట్టను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసారు.2010 తర్వాత కొత్తగా ఏర్పడ్డ నివాస కాలనీలు బుడమేరు క్యాచ్ మెంట్ ఏరియాలో ఉన్నాయి. అక్కడ ఇళ్లు కట్టిన వారిలో చాలా మందికి అక్కడ బుడమేరు ప్రవాహం ఉందని కూడా తెలియని పరిస్థితి.బుడమేరు ఆక్రమిత ప్రాంతాల్లో కాస్త తక్కువ రేట్లకే ప్లాట్లు, ఇంటి స్థలాలు అమ్మేశారు. మధ్యతరగతి ప్రజలు భారీగా కొనుక్కున్నారు. దీంతో ఇక్కడ మరో నగరమే ఏర్పడింది. మరి ఇలాంటి ప్రాంతాల్లో కట్టడాలకు అనుమతి ఇవ్వడమే ప్రధాన సమస్య.‘‘బెజవాడను ముంచెత్తిన వరదకు భారీ వర్షాలు ఒక కారణం మాత్రమే, అసలు కారణం బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్ధీకరణ చేయని ప్రభుత్వ నిర్లక్ష్యం.
ముంచెత్తిన వరద ప్రవాహం..
సాధారణంగా బుడమేరులో వరద ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో 11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించగలదు. ఆధునీకరణ పనుల్లో భాగంగా బుడమేరు సామర్థ్యాన్ని 17 వేల క్యూసెక్కుల వరకు పెంచేలా ప్లాన్ రూపొందించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 45 వేల క్యూసెక్కుల వరద వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి.ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డ్రెయిన్‌కు డైవర్షన్ కాలువ ఉండగా, అక్కడి రెగ్యులేటరుకు 11 గేట్లు ఉన్నాయి.ఇవి ఎత్తితే ‘పవిత్ర సంగమం’ వద్ద కృష్ణా నదిలో వరద కలుస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వాగులు, వంకలు అన్నీ మైలవరం మీదుగా బుడమేరులో కలిశాయి.దీంతో వెలగలేరు రెగ్యులేటరీపై ప్రభావం చూపింది. గేట్లు ఎత్తడంతో డైవర్షన్ కాలువకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. ఈ వరద.. కవులూరు, రాయనపాడు మీదుగా జక్కంపూడి కాలనీ, వైఎస్సార్ కాలనీ, వాంబే కాలనీ, పాల ఫ్యాక్టరీలను ముంచెత్తింది.
కొల్లేరును కొల్లగొట్టిన కబ్జాదారులు…
కొల్లేరు సరస్సు వన్యప్రాణుల అభయారణ్యం, విస్తారమైన నిస్సారమైన చిత్తడి నేలలు, భారతదేశంలోని ఏకైక చిత్తడి నేల.ఇది కృష్ణా, గోదావరి నదుల డెల్టాల మధ్య సహజ వరద-బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పనిచేస్తుంది. గృహ వినియోగం , నీటిపారుదల కొరకు నీటి వనరుగా ఉంది. దాని రక్షిత స్థితి ఉన్నప్పటికీ చిత్తడి నేల ముప్పులో ఉంది.1990లో, సరస్సు చుట్టూ ప్రధాన భూ వినియోగం, జీవనోపాధి వరి వ్యవసాయం. కొల్లేరు కూడా సాంప్రదాయకంగా గణనీయమైన చేపల పెంపకానికి మద్దతు ఇచ్చింది 1990వ సంవత్సరంలో, కొల్లేరు సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య ఆక్వాకల్చర్ వేగంగా విస్తరించింది. “కొల్లేరు కార్ప్ కల్చర్”గా వర్ణించబడిన ఒక ప్రత్యేకమైన, సెమీ-ఇంటెన్సివ్ సిస్టమ్ అభివృద్ధి చేయబడింది.2002 నాటికి రాష్ట్రంలోని 600 000 మెట్రిక్ టన్నుల కార్ప్‌లో 90 శాతం ఉత్పత్తి చేస్తోంది.1990లో కొల్లేరు సరస్సు చుట్టూ వరి , కొంత ఆక్వాకల్చర్ చేపట్టడం జరిగింది.ఆ తరువాత సరస్సు పరిసర ప్రాంతంలో పెరుగుతున్న జనాభా మరియు పెరుగుతున్న భూ వినియోగం కారణంగా పారిశ్రామిక వ్యర్థాలు, పురుగుమందులు మరియు ఆక్వాకల్చర్ నుండి వచ్చే ఎరువులు మరియు వ్యవసాయం మరియు గృహ మురుగునీటితో సహా కాలుష్య ఇన్‌పుట్‌లు పెరగడానికి దారితీసింది. ప్రభుత్వం సరస్సు పరిస్థితిని మెరుగుపరచడానికి ఒక కార్యక్రమాన్ని ఆదేశించింది, అనధికార చేపల చెరువులను కూల్చివేయమని ఆదేశించింది రక్షిత ప్రాంతంలో ఉన్న అనేక కార్ప్ ఆక్వాకల్చర్ ఎన్‌క్లోజర్‌లు 2005 మరియు 2006లో పేలుడు పదార్థాలను ఉపయోగించి ఉల్లంఘించబడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి.ప్రభుత్వ కార్యక్రమం రక్షిత ప్రాంతంలో ఆక్వాకల్చర్ తీవ్రతను తగ్గించినప్పటికీ, కొన్ని చెరువులు మిగిలి ఉన్నాయి. అక్రమ చెరువులు అభయారణ్యంలోకి తిరిగి వస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. చెరువులు ఉల్లంఘించిన చోట, అనేక సందర్భాల్లో చాలా వరకు ఆవరణ మిగిలి ఉంది. ఈ ప్రాంతాల యొక్క జలసంబంధ పర్యావరణ విధులను మార్చడం కొనసాగుతుంది. ఇతరులు అదనంగా, గోదావరి మరియు కృష్ణా డెల్టాల మధ్య పరిసర ప్రాంతం ఆక్వాకల్చర్ యొక్క నిరంతర విస్తరణ కూడా ప్రభావితం చేస్తోంది. పరిశ్రమ, వ్యవసాయ, ఆక్వాకల్చర్ కార్యకలాపాలు పెద్ద మొత్తంలో ప్రధాన పోషకాలు, ట్రేస్ లోహాలు, పురుగుమందులను సరస్సులోకి విడుదల చేస్తున్నందున నీటి నాణ్యత ముప్పుకు కారణాలు గా తెలుస్తున్నాయి.
శిష్యుడి బాటలో నడిస్తే… అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం. ఆక్రమణల తొలగింపు ఏదయినా అడ్డంకి ఉంటే కూల్చడం బాబుకే సాధ్యం. బహుళ ప్రయోజనాల కోసం తప్పనిసరి గా చేయవలిసిన కార్యక్రమం చేసి తీరతారు. ఇప్పుడు అదే ఆసన్నమైంది. కొంతమంది స్వార్ధ పరుల కోసం లక్షలాదిమంది ని నిరాశ్రయులను చేయడం కరెక్ట్ కాదు.పరిస్కారం అంటే వందల నుంచి వేల కోట్లు వెచ్చించాలి. నిధుల కొరత సమయం ఇలా చూసుకుంటే అకాల వర్సాలు, ఆకస్మిక వరదలు రావచ్చు. అప్పుడు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి తరహాలో హైడ్రా లాంటి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి అక్రమాలపై ఉక్కు పాదం మోపితే జగత్తు జడుచుకోవాలి.ఆక్రమణ అన్న పదం వింటే ఆమడ దూరం పారి పోవాలి.అది చేస్తే చరిత్రలో మిగిలిపోతారు.పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయూడిగా ఉండి పోతారు.మరి కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు సారధ్యంలో పవన్ కళ్యాణ్, లోకేష్ ల పర్యవేక్షణలో ఏమి జరుగుతుందో చూడలి.