ఎఫ్ ఐ ఆర్ అవ్వకుండా లోకేషన్ ఇవ్వొచ్చా…
ముంబై నటీ కాదంబరీ వ్యవహారం మరవలేదు…
ప్రవేటు వ్యక్తులకు లొకేషన్ ఇస్తారా..
ఫోన్ పోతేనే లొకేషన్ ఇస్తారా
ఏకంగా లొకేషన్ న్ ఇచ్చేసిన ఎస్ ఐ
ఆ లొకేషన్ తో ఓ ఇంటికి వెళ్లి హాల్ చల్..
లొకేషన్ si ఇచ్చాడట…ఫోన్ ఇవ్వాలని వాగ్వాదం..
ఇదేనా పోలీస్ పద్ధతి…
సెల్ ఫోన్ పోతే అరగంట లో లొకేషన్ వస్తుందా…
మరి కాదంబరి జైత్వాని కేసు లో ఇలానే జరిగిందా…
పోలీసులు ఉండేది ఇందుకోసమేనా…
ఇంకెప్పుడు మారతారు పోలీస్ బాస్లు…
ఏమిటీ మీ రహస్య ఒప్పందాలు…
యూట్యూబర్ పై ఉన్న ప్రేమ ఏమిటో మరి…
ఎందుకంత ఉల్లాసం…ఏమి ఘోరం జరిగిందని ఇలా…
(రామమోహన్ రెడ్డి సంపాదకులు)
సభ్య సమాజం తలదించుకోవాలి ఈ పోలీసుల తీరు చూసి.ఇప్పటికే ఈ మహానీయుల నిర్వహకం తో దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. వీరు పోలీసులే నా ఇంకేమైన అన్న సందేహాలు తలెత్తే విదంగా ప్రజల్లోతీవ్ర చర్చ జరుగుతున్న నేపధ్యంలో బెజవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసుల తీరు సంబ్రామాచ్చార్యానికి గురిచేస్తున్నాయి.ఓ వైపు ముంబై నుండి ప్రముఖ నటి డాక్టర్ కాదంబరి జైత్వాని విజయవాడకు పోలీసుల అరాచకం పై స్వయానా బెజవాడ పోలీస్ కమిషనర్ ను కలిసి వివరాలు ఇవ్వడం జరిగింది. ఓ వైసీపీ నేత కుక్కల విద్యా సాగర్ వ్యవహారం పై ప్రత్యేక అధికారి దర్యాప్తు చేస్తున్నారు.మరో వైపు ఎడతెరపి లేని వర్షంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ కొండ చరియలు విరిగిపడుతూ ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని పట్టని ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ కు ఓ అతిపెద్ద సమస్య వచ్చిపడింది.
ముఖ్యమంత్రి అహోరాత్రులు కష్ట పడుతున్నాడు. నేటికి పదిరొజులైన వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఆయనే అంతా బిజీగా ఉంటే ఓ యూట్యూబర్ సెల్ ఫోన్ మిస్ అయ్యింది. ఇప్పుడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ కు ప్రజల భద్రత కంటే యూట్యూబర్ ల కు సంబంధించి సెల్ ఫోన్ పోయింది కలిచి వేసింది.వెంటనే రంగంలోకి దిగిన సబ్ ఇన్స్పెక్టర్ కేసు కట్టలేదు,fir నమోదు చేయలేదు…ఫోన్ పోయి అరగంట మాత్రమే అయింది వెంటనే టవర్ లొకేషన్ తెప్పించి సిబ్బంది పురమాయించారు.సిబ్బంది రావడం కొంచెం ఆలస్యం అయ్యిందట ఆలోకేషన్ యూట్యూబర్ లకు ఇచ్చారు ఇంకేముంది లొకేషన్ పట్టుకుని ఓ ఇంటికి వెళ్లి హడావిడి చేశారు.కాలింగ్ బెల్ కొట్టగానే వీరిని చూసి ఏమిటండి అని అడిగితే ఫోన్ పోయింది సబ్ ఇన్స్పెక్టర్ లొకేషన్ ఇచ్చాడు అది మీ ఇల్లే చూపిస్తుంది ఫోన్ కావాలి.ఇదేమిటని ఆ పాత్రికేయుడు సబ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేస్తే మీ ఇల్లు కాదు ఆ చుట్టూ ప్రక్కల 300 మీటర్ల పరిధిలో ఉండచ్చు…అయిన నేను చూసుకుంటా నో ప్రాబ్లెమ్ అని సమాధానం.ఈ సంఘటన జరిగి నేటికీ పది రోజులు.ఇదేనా పోలీసుల తీరు…ఫోన్ పోయింది.. జాలి ప్రేమ ఉందో లేక ఇంకేమైన ఉందొ మరి అంత అత్యుత్సాహం చూయింఛాల్సిన అవసరం ఉందా..ఫోన్ పోగుట్టు కున్న వారు అక్కడికి వెళ్లి వెతుక్కుంటూ వెళ్లలేరా…పోనీ కేసు పెట్టక పోయిన నిదానంగా పరిశీలించి చర్యలు తీసుకోవచ్చుగా…ఎవ్వరికీ సాధ్యం కానివి పోలీసులకు సాధ్యపడతాయు…దేనికి ప్రజా ప్రయోజనాల నిమిత్తం.అయితే ఒక సెల్ ఫోన్ అదేమీ దేశ భద్రతకు చెందింది కాదు… కాదంబరి కేసులో ఉన్న కుక్క ల విధ్యాసాగర్ ది కాదు…అంత కంటే ముఖ్యమైనది కాదు..అయిన అంత హడావుడి అవసరమా పోలీసులారా…ప్రజా సమస్యలు కూడా అంతే త్వరగా పరిస్కరిస్తే ఎంతో సంతసిస్తారు…పోలీసులు మారండి …అతి వినయం దూర్త లక్షణం అంటారు ఇలాంటివి చూసి. అయ్యా పోలీస్ బాస్ కొంచెము ఆలోచించండి… ఆపై మీ ఇష్టం.. ప్రజల అదృష్టమో..లేక ఇంకేదో మరి…
ఉన్నతాధికారుల వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా వారు వరద బాధితుల సహా యక చర్యల్లో బిజీగా ఉన్నందున స్పందించలేకపోయారు.