Thursday, November 28, 2024

Creating liberating content

Uncategorizedసచివాలయంలో మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

సచివాలయంలో మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ తయారీ అభినందనీయం
మొట్టమొదటి దేశీయ మంక్సీపాక్స్ టెస్ట్ కిట్ విడుదల గర్వకారణం
మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుం
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి :- మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీపీసీఆర్ కిట్ ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ కిట్ ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్ టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెడ్ టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్‌ (ErbaMDx MonkeyPox RT-PCR Kit) పేరిట ఈ కిట్ రూపకల్పన చేసినట్లు సీఈఓ జితేంద్ర శర్మ సీఎంకు వివరించారు. ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని తెలిపారు. మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను రూపొందించిన మెడ్ టెక్ జోన్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు అభినందించారు. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుంది. ప్రభుత్వం నుండి మెడ్ టెక్ జోన్ కు అన్ని విధాలా సహాయ,సహకారాలు అందిస్తామన్నారు. వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా త్వరలో సోలార్ తో నడిచే ఎలక్ట్రానికి వీల్ చైర్ ను రూపొందించనున్నట్లు మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నిక గల వైద్య పరికరాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article