శాసనసభ్యులు బాలరాజు
జీలుగుమిల్లి
విద్యార్థిని విద్యార్థులను తీర్చి దిద్దటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పోలవరం శాసనసభ్యులు బాలరాజు అన్నారు.
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో గల స్కూల్ నందు పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు సలహాలు సూచనల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో హై స్కూల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుపాల్గొన్నారు. ఆట స్థలాలను ఆయన ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము , మండల విద్యాశాఖ అధికారి సురేష్ ,పిన్నమనేని మధు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.