సమాచార శాఖలో ఏమి జరుగుతోందో చూడరా
మీ పై కేసు వేసిన స్వర్ణాంధ్ర పత్రిక కు యాడ్స్ ఇవ్వడం…
జగన్ జమానా అన్నారు…
మీ జమానాలో అదే జరుగుతోంది గా…
మీ వైఫల్యమా.. లేక వీరి ధిక్కార స్వరమా…
ప్రకటన ల్లో పలుకుబడి సాగుతోందా…
పైసలకోసం ప్రభుత్వాన్నే పెడచెవిన పెట్టారా…
అక్రిడేషన్ లో గోల్మాల్..
ఆఖరికి ప్రకటనలలో అదే తీరు..
95 సీఎం అన్నారు…కనీసం 2014 సీఎం గా ఉంటారా…
ప్రక్షాళన చేయకుంటే పెనుప్రమాదం తెస్తారేమో..
రాష్ట్ర స్థాయికి దిక్కులేదు… జిల్లాలకు అవసరం…
ఎందుకిలా చేస్తున్నారు..
ఎవరి మెప్పుకోసం తప్పులు చేస్తున్నారు…
ఇలాంటి వాళ్ళ వల్లే మాయని మచ్చ…
ముఖ్యమంత్రి గారు ముందుచూపు చూడండి..
(రామమోహాన్ రెడ్డి, సంపాదకులు)
ఈరోజుతో ముందుకు మీకు స్వాతంత్రం,స్వేచ్ఛ వచ్చింది.మీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యము వచ్చిందంటే ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ వస్తుందని ఆశిస్తున్నా..అని కూటమి ఘన విజయం సాధించిన జూన్ 5వతేది ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో నారాచంద్రబాబు అన్న మొట్టమొదటి మాటలు.ఆ తరువాత ఆయన అనేక సందర్భంలో వ్యవస్థల తీరుపై ఒక్కొక్కటిగా శ్వేత పత్రం విడుదల చేస్తూ,అటు అసెంబ్లీ సాక్షి గా ఆవేదన చెందారు.రాష్ర్ట పునర్నిర్మాణం పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధానం గా వైసీపీ ప్రభుత్వ వైఫల్యం పై దండెత్తారు. ఇప్పటికి కూడా దండెత్తుతున్నారు ఒక సమాచార శాఖనే కోట్లు దోచిపెట్టింది జగన్ మానస పత్రికకు అని.అందులో భాగంగా సమాచార శాఖ నాటి కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి,మీడియా రిలెషన్స్, ప్రకటన ల విభాగం జాయింట్ డైరెక్టర్ కస్తూరి పై వేటు వేశారు.సమాచార శాఖకు కొత్త డైరెక్టర్ని నియమించి సమాచార శాఖ ప్రక్షాళన తో పాలనకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరు మీటింగ్ లో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదరావు ఏదో పొరపాటు చేసారని ఆగ్రహం వ్యక్తంచేశారు.95 సీఎం ను చూస్తారని హెచ్చరించారు.అంటే మీ పాలనలో సమాన్యాయ, ప్రోటోకాల్ పాటించడంలో మీ తరువాతే ఎవరైనా అన్నది మరోసారి నిరూపించారు.
అవినీతి జరిగిందంటే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక చర్యలు తీసుకునే మీ పాలన తొలినాళ్ళ లో ఇంకా అధికారులు గత ప్రభుత్వం లోనే ఉన్నామని భావించి ప్రవర్తిస్తున్న తీరు చుస్తే బాబుగారి జమానాలో ఇన్ని లోపాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది.గత ప్రభుత్వ వైఫల్యం చెందిందని కదా కూటమికి ప్రజలు జై కొట్టినా అవే కుట్రలు కొనడగుతున్నాయని అనుమానం కలుగుతోంది.2014 పాలన లో ఎంతో మంచిగా సమన్యాయం పాటించి ఎవరికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలో చూసారు.అవి ప్రకటనలు కావచ్చు… పత్రికలను ప్రొస్టేహించడం లోను. కానీ ఆందుకు భిన్నమైన పరిస్థితి దాపురించడం చూస్తే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాలన పై ఇంకా పట్టు సాదించలేక పోతున్నారా లేక నమ్మిన అధికారులే నట్టేట ముంచుతున్నారా అన్నది ఆలోచన చేయాలని పత్రికా సంపాదకులు కోరుతున్నారు.చంద్రబాబు నాయుడు పై కేసు వేసిన యాడ్స్ ఇవ్వడమా..గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేత గా ఉన్న నారాచంద్రబాబు నాయుడుపై ప్రతి రోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా ప్రత్యేక డిబేట్ పెట్టి విమర్శలు చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా కొలువు తీరక ముందే సాక్ష్యాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసుల గురించి హైకోర్టు లో పిల్ వేసిన స్వర్ణాంధ్ర పత్రికా సంపాదకులు బాలగంగాధరతిలక్ కు సిగ్గు ఎగ్గు లేకుండా ప్రకటనలు కట్టబెట్టారంటే ఈ అవినీతి అధికారులు కూటమి ప్రభుత్వం లో ఎన్ని కుట్రలు చేస్తున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని పలు పత్రికల సంపాదకులు సూచిస్తున్నారు.