చైనా యూనివర్సిటీ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి
మీరు కాఫీ లేదా టీ ప్రేమికులైతే ఈ వార్త నిజంగా మీకు శుభవార్తే! చైనాలోని సుషౌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు మూడు కప్పుల కాఫీ లేదా టీ తాగే వారికి గుండె జబ్బులు వచ్చే ముప్పు సగానికి తగ్గుతుందని తేలింది. ఈ ప్రయోజనాలకు ప్రధానంగా కాఫీ మరియు టీలో ఉండే కెఫైన్ కారణమని పేర్కొన్నారు. కెఫైన్ మధుమేహం, పక్షవాతం వంటి ఇతర రోగాల ముప్పును కూడా తగ్గించడంలో సహాయపడుతుందని వారి పరిశోధన పేర్కొంది.ప్రతిరోజు 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫైన్ తీసుకోవడం హృద్రోగాల్ని నివారించడంలో సహాయపడుతుందని తెలిపారు. కాఫీ, టీ కాకుండా కెఫైన్ ఉండే చాక్లెట్లు, ఎనర్జీ డ్రింకులు, స్నాక్ బార్లు వంటి వాటిలో కూడా ఇది ఉంటుంది. కాఫీ లేదా టీ తాగని లేదా తక్కువ తాగే వ్యక్తులతో పోలిస్తే, రోజుకు మూడు కప్పులు తాగే వారిలో గుండె జబ్బుల ముప్పు 48 శాతం తక్కువగా ఉండటం విశ్లేషణలో కనిపించిందని వారు వివరించారు.ఈ పరిశోధనలో లక్షలాది మంది వాలంటీర్ల ఆరోగ్య వివరాలు యూకో బయోబ్యాంక్ డేటా ఆధారంగా పరిశీలించబడ్డాయి.