ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బ్లడ్ డోనర్స్ గౌరవ అద్యక్షులు మూర్తి.
రామచంద్రపురం
కులం మతం అనే తారతమ్యం లేకుండా ఒకే రంగులో ఉండి మనుషులంతా ఒక్కటేనని మన రక్తం చెబుతుందని, నువ్వు ఇచ్చే రక్తం వేరొకరికి పునర్జన్మనిస్తుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల బ్లడ్ డోనర్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు తొగరు మూర్తి అన్నారు. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ద్రాక్షారామం పివిఆర్ హైస్కూల్ లో ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగినది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తొగరు మూర్తి రక్తదాతలను ఉద్దేశించి మాట్లాడుతూ తన వైవిధ్యమైన నటనతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రక్తదానం చేసిన 50 మంది అభిమానులకు అభినందనలు తెలిపుతో అభిమానులు ఇచ్చే ప్రతీ రక్తబొట్టు రక్త గ్రహీత కు ఆయు ప్రమాణం పెంచి వారి జీవిత కాలాన్ని పొడిగించిన వారవుతారు,ఇంతటి గొప్ప పుణ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు వాసంశెట్టి శ్యామ్, సాది రాజేష్ లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.అన్ని దానాలలో కల్లా రక్తదానం గొప్పదని సకాలంలో రక్త అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కొందరిని, యాక్సిడెంట్లు జరిగి ఆసుపత్రిలో చేరి రక్తం అందక చనిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. బాధితుల బాధలు ఇబ్బందులు చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మానవతావాదని వందలాది మంది విద్యార్థులను చదివించారని ఈరోజుకి కూడా విదేశాలలో ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు జూనియర్ ఎన్టీఆర్ గారు అందించే సహాయంతో విద్యా వంతలవుతున్నారని తొగరు తెలిపారు.అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైన గంగవరం గ్రామానికి చెందిన ఖండవిల్లి ప్రదీప్ కుమార్,రామచంద్రపురం పట్టణానికి చెందిన రాపాక శివప్రసాద్ ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల తారక్ అభిమానుల సంక్షేమ సంఘం నుండి ఒక్కొక్క కుటుంబానికి 40 వేల రూపాయల చెక్కులను జూనియర్ ఎన్టీఆర్ సేవాసమితి గౌరవాధ్యక్షులు వాసంశెట్టి శ్యామ్, బ్లడ్ డోనర్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు తొగరు మూర్తి చేతుల మీదుగా అందజేసి,రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు.అనంతరం ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సేవాసమితి గౌరవ అధ్యక్షులు వాసంశెట్టి శ్యామ్, అధ్యక్షులు సాదే రాజేష్, సెక్రటరీ మణికంఠ,జాయింట్ సెక్రెటరీ క్రాంతి కుమార్, దుర్గాప్రసాద్ నాగరాజు విజయ్ సుబ్బు వీరకుమార్ చైతన్య అధిక సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.