తాజా వార్తలుకాంట్రాక్టర్ శివశంకర్ రెడ్డి ని బ్లాక్ లిస్టులో పెట్టాలి
కాంట్రాక్టర్ శివశంకర్ రెడ్డి ని బ్లాక్ లిస్టులో పెట్టాలి
- ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి
- శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు వేతనాలు ఇవ్వాలి
- కలెక్టర్ ఇచ్చిన హామీ అమలు కాకపోతే ఉద్యమిస్తాం.
- కార్మికులపై అక్రమ కేసులు ఎత్తివేయాల్సిందే
- రౌండ్ టేబల్ సమావేశంలో సిఐటియు నేత ఓబులు ప్రజాభూమి బ్యూరో, అనంతపురము
నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు, పీఎఫ్ తక్షణమే చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల యూనియన్ గౌరవాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్ చేశారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం స్థానిక జేవివి జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు హాజరై మాట్లాడారు. శాశ్వత పనులకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. కరువు జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రజల జీవనాధారంగా నిలిచిందన్నారు. 650 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తూ 600 మంది కార్మికులు వచ్చే వేతనాల్లో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. 15 ఏళ్లుగా కార్మికులు వని చేస్తున్నప్పటికీ వేతనాలు పెంపుదల జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ మూడు ప్రభుత్వాలు మారినా కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపుదల చేయాల్సి ఉన్నా చేయడం లేదన్నారు. పైగా చేసిన పనికి వేతనాలు పొందాలంటే ప్రతి నెలా రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కార్మికుల మీద కమిషన్ల కోసం పని చేస్తున్న కాంట్రాక్టర్లు, హక్కులు కాపాడాల్సిన కార్మిక శాఖ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కార్మిక శాఖ పర్యవేక్షణ ఏమాత్రం లేదన్నారు. కాంట్రాక్టర్లకు ఆరడబ్ల్యూఎస్ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తూ బినామీ కార్మికులను ప్రభుత్వం చూపించి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని రౌండ్ టేబుల్ సమావేశం లో కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలన్నింటికీ కారణమైన ఆర్డబ్ల్యూఎస్,ఎస్ఈ అవినీతే కారణమన్నారు అతను పైన న్యాయవిచారం జరపాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వేతనాల కోసం వినతిపత్రాలు, నిరసనలు, ధర్నాలు చేసినా స్పందన రాకపోవడంతోనే కార్మికులు సమ్మెలు చేపడుతున్నారని తెలిపారు. సమ్మె నేపథ్యంలో అధికారులు హామీలిచ్చి కొంత మేరకు వేతనాలు ఇచ్చి సమ్మె విరమింపజేయడం, యధావిధిగా వేతనాలు బకాయిలు పడటం కార్మికులు రోడ్లు ఎక్కాల్సి రావడం తంతు మార్చేశారని విమర్శించారు. ప్రభుత్వం ఒక రకంగా పొమ్మన లేక పొగ పెట్టె పద్ధతిని అనుసరిస్తోందన్నారు. తాగునీటి పథకం ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో నీటి కొలాయిలకు మీటర్లు, నిర్వహణ బాధ్యతలు అంగన్వాడీ ఏజెన్సీలకు అప్పగించి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకునేందకు కుట్ర చేస్తోందన్నారు. తాగునీటికి సరఫరా పథకానికి నిఖర బడ్జెట్ కేటాయించడంలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. గ్రామీణ ప్రజల దాహార్థిని తీర్చే శ్రీరామిరెడ్డి పథకాన్ని ప్రభుత్వమే యధావిధిగా నిర్వహించాలన్నారు. బకాయి పడ్డ వేతనాలు, పిఎఫ్ తక్షణమే చెల్లించాలన్నారు. కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ శివశంకర్ రెడ్డి పై క్రిమినల్ చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ లైసెన్స్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ, కార్మికుల వేతనాలు రూ.2వేలు కోతలు విధించిన కాంట్రాక్టర్ శివ శంకర్‌రెడ్డి నుంచి తిరిగి కార్మికులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులపై బనాయించిన అక్రమ కేసులన్ని ఎత్తివేయాలన్నారు. కార్మికులను దూషిస్తూ ఆక్రమ తొలగింపులకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ శివ శంకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐటియుసి, ఐఎఫ్ టియు నాయకులు మల్లికార్జున, ఏసురత్నం, ఏపి రైతు సంఘం జిల్లాప్రధానకార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు భీమేష్, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి, నగర కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ, కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ప్రజా, కార్మిక సంఘాలుగా ఐక్య పోరాటాలు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను వివరించి పరిష్కరించేలా విజ్ఞాపన పత్రాలు అందజేద్దామని సమావేశంలో తీర్మానించారు. ఈ నెలలో నిరసన సమయంలో స్పందించిన కలెక్టర్ యూనియన్ నేత ఓబులుకు ఇచ్చిన హామీని సెలబెట్టుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఇది వరకు పని చేస్తున్న కార్మికులందరిని విధుల్లోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్లడం ఖాయమని యూనియన్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల యూనియన్ జిల్లా ఆధ్యక్షులు ఎర్రిస్వామి, కోశాధికారి వన్నూరుస్వామి, మాజీ కార్యదర్శి గంగాధర, రామాంజనేయులు, నాగరాజు, నరేష్, రామాంజినేయులు, ఆదిరెడ్డి, సిఐటియు నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.