లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షిలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ భారత్ బంద్ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా లేపాక్షి లో అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ మండల కార్యదర్శి శివప్ప, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపి నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 26 వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు అందజేయాలన్నారు. రైతు రుణాలను సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించడంతోపాటు, స్మార్ట్ మీటర్లను తొలగించాలన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న కౌలు రైతులకు పంట నష్టపరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, గౌతమ్ కుమార్, మారయ్య, గంగన్న ,మంజు ,బాలు ,గోవిందు, తదితరులు పాల్గొన్నారు.