వేలేరుపాడు:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ,ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం వేలేరుపాడు తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల రమేష్, జిల్లా నాయకులు మడివి దుర్గారావు లు మాట్లాడుతూ, ప్రజలపై మోయలేనటువంటి భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరిచే పని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుచేస్తున్నాయని మండిపడ్డారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పెట్రోల్, డీజిల్, రిటైల్ ధరల పెరుగుదలకు అంతే లేదు అని అన్నారు. నిరుద్యోగ సమస్య తీరడం లేదు, పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని హెద్దేవా చేశారు. బడ్జెట్ సమావేశాలల్లో పోలవరం ప్రాజెక్టు నిధులు కొంత మేరకు పర్వాలేదు కానీ, నిర్వాసితుల పరిహారం, పునరావాసం అంశాన్ని ప్రస్తావించకపోవడం అంటే నిర్వాసితులను విస్మరించడమే అని విమర్శించారు.గిరిజనులకి, దళితులకు బడ్జెట్ కేటాయింపులోపూర్తిగా అన్యాయం జరిగిందని, ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ అంశాలు చర్చలోకి రాకపోవడం బాధాకరమని అన్నారు. జీవో నెంబర్ త్రీ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని, స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టొద్దని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో సత్యనారాయణ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కారం వెంకట్రావు, గుమ్మల వెంకట నరసయ్య, కొత్త వెంకటేశ్వర్లు, మాడి ప్రసాద్ రెడ్డి, కరటం ప్రకాష్, కేచ్చేలా వెంకటేశ్వర రెడ్డి, కరటం మల్లేష్, నాగేంద్రబాబు, వీర్రాజు, నాగు, రామ్ కిరణ్, ప్రసాద్ రెడ్డి, ప్రేమ్ కుమార్, ఊకె రాజులు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.