వి.అర్.పురం
కేంద్రంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి, అన్నదాతల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం మండల కేంద్రం రేఖపల్లి సెంటర్లో హర్యానా లో తమ న్యాయమైన హక్కులు సమస్యల సాదనకు శాంతియుత పద్దతుల్లో ఆందోళన చేస్తావుంటే ఏకంగా రైతుల పై భాస్ప గోళాలు రబ్బర్ తూటాలను ప్రయోగంచడం హేయమైన చర్యగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ ఖండించారు. రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా రేఖపల్లి లో నాయకులు బిజెపి నిరంకుశ దోరణి వలన దేశానికి అన్నం పెట్టే రైతులు పై ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడడం అన్యాయం అని విమర్శించారు. ఈ ఆందోళనలో యువ రైతు ప్రాణాలు కోల్పోయాడని ఇదేనా మీ రైతు సాధికారిత ప్రభుత్వం అని ఏద్దేవా చేశారు. తక్షణం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని నాయకులు డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేకి బిజెపి విధానాలు నసించాలని, బిజేపి ని గద్దె దించాలని నినాదాలు చేసారు. ఇకనైనా బిజెపి తమ వైఖరి మార్చుకోావాలని లేదంటే రాబోయే రోజుల్లో యావత్ రైతాంగం ఏకంగా ఐక్య ఉద్యమాలను సన్నద్ధం అవక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చినబాబు, నాయకులు రైతు సంఘాల నాయకులు పంకు సత్తిబాబు, కుంజ నాగిరెడ్డి, వడ్లధి రమేశ్, గుండేపూడి లక్ష్మణరావు, సిహెచ్ సుబ్బారావు, నాల్లారపూ ప్రకాశ రావు, సోడి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.