కాసులివ్వు కట్టడాలు కట్టుకో..
నోట్ల కట్టలు సరిపోక పోతేనే నోటీసులు…
అబ్బో వీరయితే ఎన్ని కట్టడాలు కూల్చారో ..
హరిని, నాగేశ్వరరావు లయితే ఎన్ని కట్టడి చేశారో ..
గొళ్లపూడి కాంప్లెక్ మొత్తం హడలెత్తించారుగా..
అప్పారావు ప్లాట్లలో అసలే అనుమతి ఇవ్వలేదు..
వీరి హయాంలో షెడ్డులే వేయలేదు..
పాపం ప్రభుత్వం ఒక అంతస్తుకు ఇస్తే వీరు మరో అంతస్తే వెయిస్తారు…
ఇలాంటి అధికారులను బదిలీ చేసారెందుకో…
వీరు బదిలి అయ్యారు నిర్మాణాలు ఆపేవారే లేరు..
సీఆర్డీఏ కు ఎంత కష్టమొచ్చింది..
బిల్డర్ భాషపై ,ఆ బీల్డింగ్ లపై ఎంత అభిమానమంటే…
మాటల్లో చెప్పలేనిది… చేతల్లో చూపించలేనిది…
ఈ అధికారుల అవినీతికి ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి..
ఏదైనా అంటే టీడీఆర్ బాండ్లు…
గొళ్లపూడి చిత్రాలు చూడ తరమా…
ఈ అధికారుల అవినీతి రాయతరమా…
ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా…
సీఆర్డీఏ చిత్రాలు సూపర్ సక్సెస్…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ఏపీ సీఆర్డీఏ అంటే అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అథారిటీ చట్టం, 2014 ప్రకారం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో 2014 డిసెంబరు 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది.ఈ సంస్థ రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాంతంలో నిర్మాణ పనులపై ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, రాజధాని ప్రాంతంలో పట్టణ సేవలును పర్యవేక్షిస్తుంది. అయితే ఇక్కడి అధికారులు ఎంత బాగా నిర్మాణ పనులపై ప్రణాళికలు రచిస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రధానంగా గొల్లపూడి పంచాయితీ పరిధిలో బీల్డింగ్ నిర్మాణాలు బోలెడు జరుగుతున్నాయి.మరి ఈ నిర్మాణాలకు అనుమతులు సక్రమంగా ఇస్తున్నారా అంటే సమాధానం కష్టం.అసలు సీఆర్డీఏ బీల్డింగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఆపై, కింది స్థాయి అధికారులు కావచ్చు గోళ్లపూడి హోల్ సేల్ మార్కెట్ పై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తే విస్తు పోయే నిజాలు బైటికి వస్తాయి.ప్రభుత్వం జి+1 కు అనుమతులు ఇచ్చి వ్యాపార సముదాయాలు గా నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రణాళికలు వేశారు.ఇప్పుడేమి రాజ్యాంగ సవరణ జరగలేదు గా..మరి సీఆర్డఏ పరిధిలో కొత్త చట్టాలు కూడా ఏమి మార్చలేదని తెలిసిందే.అయితే ఈ నిర్మాణాలు అక్రమమా సక్రమమా అంటే ఈ అధికారులు స్పందించి స్థితిలో లేరు.గతంలో బీల్డింగ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న అధికారిణి అయితే అడిగినంత కాసులు ఇవ్వలేదని నిర్మాణాలు కూల్చివేసింది. సరే ఆ అధికారిణి రూల్ ప్రకారం చట్టం ప్రకారం పోతే అదే తరహలో మిగిలిన కాంప్లెక్స్ నిర్మాణాలకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు.. ఎందుకు ఆ నిర్మాణాలు కూల్చలేదు…ఎందుకు అడ్డుకట్ట వేయలేక పోయారో అనేది ఆలోచన చేస్తే అర్ధమవుతుంది కదా.ఇందులో ఏ అధికారిని నిందించా ల్సిన అవసరం లేదుగా..చట్టం తన పని తాను చేస్తే విమర్శలు కు తావెక్కడ వస్తాయో ఉన్నతాధికారులు కూడా ఆలోచన చేయమని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో భవానిపురం ఊర్మిళనగర్ శివారులో పట్టాలేని స్థలంలో రేకుల షెడ్ ల నిర్మాణాలు చేసినా దానిపై స్పందించే విధానం లేక లోగా సరియైన వివరాలు ఇచ్చేందుకు కూడా అధికారులకు చాలా ఇబ్బంది గా ఫీల్ అవుతున్నారు.అదే తరహాలో గోళ్లపూడి కళీల్ రెస్టారెంట్ ప్రక్క రోడ్డులో ఓ అపార్టుమెంట్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ నిబంధనలు పాటించార అంటే సమాధానం లేదు.టీడీఆర్ బాండ్లు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఆ పూర్తి వివరాలు కావాలంటే సమాచార శాఖ ద్వారా తెలుసుకోవాలే తప్ప ఈ అధికారులు చెప్పడానికి అందుబాటులో కి రాకపోవడం శోచనీయం. ఇక పోతే గోళ్లపూడి హైస్కూలు వెనుక వెంకటేశ్వరనగర్ లో నిర్మాణం జరుగుతుంది. అయితే ఆ నిర్మాణ దారుడి దగ్గర భారీగా ముడుపులు తీసుకుని అండగా నిలబడ్డారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ట్విస్ట్ చూస్తే ఈ అధికారులు అవినీతి ఏ స్టాయిలో ఉందొ అట్టే అర్ధమవుతుంది. సంబంధిత బిల్డర్ కు ఫోన్ చేసి త్వరగా ఐటమ్స్ రాకుండా నిర్మాణాలకు రంగులు వేయమని ఉచిత సలహా కూడా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం మారిన ఎన్ని చట్టాలు మారినా అవన్నీ అవినీతి అధికారులకు చుట్టాలే అవుతున్నాయే తప్ప వీరికి అడ్డుకట్ట వేసే నాధుడు కరువయ్యారు. ఇక ఈ పరిస్థితి ని మార్చే వారు లేరా ఇక రారా అన్న సందిగ్దత లో ప్రజలు ఉన్నారు.చూడాలి మరి ఏమి జరుగుతుందో…