కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్-సి, విటమిన్-ఏ, విటమిన్- బీ, విటమిన్-ఇ, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటితో పాటు కరివేపాకులతో ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం.కరివేపాకుల్లో ఉండే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. వివిధ రకాల వ్యాధులను నివారిస్తాయి.
క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం ఉన్న జెనెటిక్ మ్యూటేషన్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. దీంతో క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.కరివేపాకుల్లో ఉండే గ్లైకోసైడ్స్, ఫినోలిక్స్, ఆల్కలాయిడ్స్, ఫైటోకెమికల్స్ వంటివి యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి వివిధ రకాల ఇన్‌ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. మొత్తంగా శరీర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తాయి.కరివేపాకులోని ఔషధ గుణాలు శరీరంలోని విష వాయువులను డిటాక్సిఫికేషన్ చేస్తాయి. దీంతో కణాల వాపు తగ్గి వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. కరివేపాకు కషాయం తాగితే సాధారణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిస్తుంది.వంటల్లో కరివేపాకులు వాడితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆకులతో చేసిన కషాయం తరచుగా తాగితే శరీరంలో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కరివేపాకుల్లోని సమ్మేళనాలు బరువు తగ్గేవారికి మంచివి. బరువును నియంత్రణలో ఉంచే కాంపౌండ్స్ వీటిలో ఉంటాయి. అందుకే రోజువారీ ఆహారంలో కరివేపాకులను వినియోగిస్తే బరువు పెరగకుండా ఉంటారు.జుట్టు రాలడం, ఇతర హెయిర్ ప్రాబ్లమ్స్‌కు కరివేపాకు చెక్ పెడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను నివారించి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కరివేపాకు ఆకులను పేస్ట్‌లా తయారు చేసుకుని కాలిన గాయాలు, చర్మం దురదగా ఉన్న ప్రాంతాల్లో రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.ఎముకల అరుగుదల, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రో సమస్యలను కరివేపాకు నియంత్రిస్తుంది. లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్లను నివారించే ఔషధ గుణాలు కరివేపాకులో ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కరివేపాకు యూరిన్ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో చేర్చుకుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.