Thursday, November 28, 2024

Creating liberating content

బిజినెస్డెబిట్‌ కార్డు మిస్‌ అయితే?..

డెబిట్‌ కార్డు మిస్‌ అయితే?..

వివిధ ఆన్‌లైన్‌ చెల్లింపులకు డెబిట్‌ కార్డును తరచూ ఉపయోగిస్తుంటారు.అదే డెబిట్ కార్డ్‌ ఒక వేళ మిస్‌ అయితే.. గుండెల్లో గుబులు మొదలవుతుంది. అకౌంట్‌లో ఉన్న నగదు సురక్షితంగా ఉన్నాయా? లేవా? అని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొన్ని టిప్స్‌ పాటిస్తే.. ఈ టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కార్డు పోయినవెంటనే ముందుగా కార్డును బ్లాక్‌ చేయాలి. బ్యాంక్ పోర్టల్‌ నుంచి, కస్టమర్‌ కేర్‌కి కాల్‌ చేసి కార్డును బ్లాక్‌ చేయవచ్చు. ఇలా చేస్తే, మీ ఖాతాలో సొమ్ము సురక్షితంగా ఉంటుంది. డెబిట్‌ కార్డును పోగొట్టుకుని, అందులో డబ్బులు ఎవరైనా దుండగులు కాజేస్తే.. బ్యాంకు దానికి బాధ్యత వహించదు. కాబట్టి కార్డు పోతే వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి. డెబిట్‌ కార్డు పోయినా, పాడైనా, దాని ఎక్స్‌పైరీ తేదీ పూర్తి అయినా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం బ్యాంకు బ్రాంచీకి వెళ్తే సరిపోతుంది. కస్టమర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో నెట్‌ బ్యాంకింగ్‌కు లాగిన్‌ అయ్యి కొత్త కార్డును పొందడం అన్నింటికంటే సులభమైన మార్గం. ఇక్కడ మీరు కార్డు పొందే అడ్రస్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుల వెబ్‌సైట్‌ ప్రకారం అనుసరించాల్సిన స్టెప్స్‌లో కొన్ని మార్పులు ఉంటాయి. దాదాపు అన్ని బ్యాంకులకు ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్లు ఉన్నాయి. దీని ద్వారా కూడా డెబిట్‌ కార్డు రీప్లేస్‌మెంట్‌ సర్వీస్‌ను రిక్వెస్ట్‌ చేసి కొత్త కార్డును పొందవచ్చు.
కస్టమర్‌ కేర్‌కి కాల్‌ చేసి ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదిస్తే వారు రిజిస్టర్ చిరునామాకు డెబిట్‌ కార్డును పంపిస్తారు. గుర్తుపెట్టుకోవాల్సినవి కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసేటప్పుడు నంబర్‌ను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే తీసుకోవాలి. వారు పిన్‌, పాస్‌వర్డ్‌ వంటి వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగరు. కార్డు రీప్లేస్‌మెంట్‌ కోసం బ్యాంకులు ఛార్జీలను వసూలు చేయవచ్చు. కార్డును మీ చిరునామాకు పంపుతారు. కాబట్టి అడ్రస్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article