Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంఅక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి

అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది – లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి

హిందువుల అతిపెద్ద పండుగలలో దీపావళి ఒకటి. ఏటా ఆశ్వయుజమాసం ఆఖరిరోజు…కార్తీకమాసం ప్రారంభానికి ముందురోజు వచ్చే అమావాస్య రోజు దీపావళి అమావాస్య జరుపుకుంటారు. అన్ని పండుగలలా కాకుండా దీపావళి ఐదు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ధన త్రయోదశి నుంచి యమవిదియ వరకూ ఐదు రోజులు జరుపుకునే పండుగ దీపావళి.ధన త్రయోదశి, నరక చతుర్థశి, దీపావళి, బలిపాడ్యమి, యమ విదియ.. మొత్తం ఐదు రోజులు జరుపుకుంటారు. దసరా తొమ్మిదిరోజుల పాటూ దుర్గాదేవిని ఆరాధించి..దీపావళి వేళ మహాలక్ష్మిని పూజిస్తారు. ధనత్రయోదశి నుంచి లక్ష్మీదేవికి, కుబేరుడికి పూజలు నిర్వహిస్తారు. దీపావళి అమావాస్య రోజు సాయంత్రం అమ్మవారిని పూజించి ఐశ్వర్యం ప్రసాదించమని వేడుకుంటారు. దీపావళి పండుగను అమావాస్య రోజు జరుపుకుంటారు. ఏదైనా తిథి రెండు రోజుల పాటూ వచ్చినప్పడు గందరగోళం నెలకొంటుంది. సాధారణంగా హిందువుల పండుగలన్నీ సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే ప్రధానంగా తీసుకుంటారు. అందుకే అక్టోబరు 31 ఉదయం నుంచి నవంబరు 1 మధ్యాహ్నం వరకూ అమావాస్య ఉండండతో ఏ రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి అనే సందేహం మొదలైంది.
ఏ తిథి ఏ రోజు ఏ సమయం వరకూ ఉంది

అక్టోబరు 29 మంగళవారం ఉదయం 10 గంటల 34 నిముషాల నుంచి ప్రారంభమై… అక్టోబరు 30 బుధవారం మధ్యాహ్నం 12 గంటల 35 నిముషాలవరకూ ఉంది. త్రయోదశి పూజ ఉదయం సమయంలో నిర్వహిస్తారు..అందుకే అక్టోబరు 30 బుధవారం ధన త్రయోదశి జరుపుకుంటారు…
అక్టోబరు 30 బుధవారం మధ్యాహ్నం 12 గంటల 36 నిముషాల నుంచి అక్టోబరు 31 గురువారం మధ్యాహ్నం 2 గంటల 45 నిముషాల వరకూ చతుర్థశి తిథి ఇంది. నరక చతుర్ధశి కూడా సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఈ ఏడాది నరక చతుర్ధశి అక్టోబరు 31 గురువారం..
సాధారణంగా చతుర్థశి మర్నాడు అమావాస్య వస్తుంది కదా..అందుకే నరక చతుర్థశి మర్నాడు దీపావళి జరుపుకోవాలని అనుకుంటారు. కానీ దీపావళి జరుపుకునేందుకు సూర్యాస్తమయం సమయానికి అమావాస్య తిథి ఉండడం అత్యంత ప్రధానం. ఈ లెక్కన ఈ ఏడాది అమావాస్య తిథి అక్టోబరు 31 మధ్యాహ్నం 2 గంటల 46 నిముషాల నుంచి నవంబరు 1 శుక్రవారం సాయంత్రం 4 గంటల 47 నిముషాల వరకూ ఉంది. అంటే సూర్యాస్తమయం సమయానికి అమావాస్య ఉన్న రోజు అంటే అక్టోబరు 31 గురువారం.అందుకే ఈ రోజే లక్ష్మీపూజ, దీపావళి జరుపుకుంటారు. నరకచతుర్థశి, దీపావళి ఒకేరోజు వచ్చాయన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article