ఈ రుచికరమైన డిటాక్స్ డ్రింక్ పొట్ట సమస్యలకు చక్కని పరిష్కారం. కిచెన్‌లో ఉండే కొన్ని పదార్థాలతో దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు ఒక టేబుల్‌స్పూన్ చొప్పున వాము, సోంపు, ధన్యాలు, చిటికెడు పసుపు, ఒక కప్పు నీరు తీసుకోవాలి.
ఒక గిన్నెలో కప్పు నీరు పోసి మరిగించాలి. దీంట్లో వాము, సోంపు, పసుపు, ధన్యాలు వేసి 15-20 నిమిషాలు బాయిల్ చేయాలి. ఆ తర్వాత మంట మీద నుంచి దించాలి. కాస్త చల్లారిన తర్వాత వడగట్టాలి. పడుకునే ముందు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ డిటాక్స్ డ్రింక్ తాగాలి.వాములో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉంటాయి. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. సోంపు డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. పసుపు కొవ్వును కరిగిస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది. ధన్యాలు డైజెషన్‌ను మెరుగుపరచడంతో పాటు, రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఈ లక్షణాలన్నింటి కారణంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు సహజంగానే కరిగిపోతుంది. అయితే ఈ హెల్తీ డ్రింక్ ఒక్కటే సమస్యకు పరిష్కారం చూపించదు. నిపుణుల సలహాతో కొన్ని వ్యాయామాలు, ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి.రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క డ్రింక్ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వు ఐస్‌లా కరిగిపోతుంది!
ఎన్నో హెల్త్ బెనిఫిట్స్వాము, సోంపు, ధన్యాలతో చేసే ఈ హెల్త్ డ్రింక్‌లోని సమ్మేళనాలు ఇన్‌ఫ్లమేషన్ తగ్గించగలవు. ఇది దీర్ఘకాలంలో ఇన్‌ఫ్లమేషన్, వాటర్ రిటెన్షన్‌కు చెక్ పెడుతుంది. ఈ డ్రింక్ మెటబాలిజంను బూస్ట్ చేస్తుంది. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా బరువు తగ్గిస్తుంది. పసుపులోని కర్కుమిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది.30-50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి బెల్లీ ఫ్యాట్ చాలా డేంజర్. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత సమస్యలకు దారితీస్తుంది. వాముతో చేసే ఈ డ్రింక్‌ను ప్రతి రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది.ఈ డిటాక్స్ డ్రింక్ జలుబు, దగ్గుకు చెక్ పెడుతుంది. ముక్కు దిబ్బడ తలెత్తకుండా చూస్తుంది. వాము, సోంపు శ్లేష్మాన్ని సులభంగా విడుదల చేసి జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముక్కు నుంచి చక్కగా శ్వాస పీల్చుకునేలా చేస్తాయి. ఈ డ్రింక్ ఊపిరితిత్తుల గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో ఆస్తమా, బ్రాంకైటిస్ రోగులకు ఇది బెస్ట్ డ్రింక్ అవుతుంది.ఈ డ్రింక్‌లోని మూలికల లక్షణాలు స్లీప్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి. మంచి నిద్ర మెటబాలిజంను ఇంప్రూవ్ చేస్తుంది, ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి కారణం అవుతుంది.