Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుముంబై జట్టులో లుకలుకలు..

ముంబై జట్టులో లుకలుకలు..

జట్టు ఓటమికి ఏ ఒక్కరినో బాధ్యుడిని చేయడం సరికాదని హితవు

ఐపీఎల్‌ను ఐదుసార్లు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈసారి దారుణంగా ఉంది. ఆడిన 12 మ్యాచుల్లో 8 పరాజయాలతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ ఇలా ఘోరంగా ఇంటిముఖం పట్టడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ హర్దిక్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.ఇటీవల ఒక మ్యాచ్ తర్వాత కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్లు సమావేశమయ్యారు. డిన్నర్ సందర్భంగా రోహిత్‌శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తమ ఆలోచనలను బయటపెట్టినట్టు తెలిసింది. జట్టు విఫలం కావడానికి గల కారణాలను వెల్లడించారు. ఆ తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ ప్రతినిధులు సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరితో చర్చలు జరిపినట్టు తెలిసింది. డ్రెస్సింగ్ రూములో ఆరోగ్యకరమైన వాతావరణం లేదని, హార్దిక్ జట్టును నడిపిస్తున్న తీరు అస్సలు బాగోలేదంటూ జట్టులోని కీలక ఆటగాళ్లు కోచింగ్ స్టాఫ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ముంబై అధికారి మాత్రం జట్టులో నాయకత్వ సంక్షోభం లేదని, పదేళ్లపాటు రోహిత్ సారథ్యంలో ఆడిన ఆటగాళ్లు ఇంకా దాని నుంచి బయటపడలేకపోతున్నారని చెప్పాడు. నాయకత్వ మార్పు సమయంలో క్రీడల్లో తరచూ ఇలాంటి సమస్యలు సహజమేనని తేలిగ్గా తీసుకున్నారు.
ఢిల్లీ కేపిటల్స్‌తో ఓటమి తర్వాత టాప్ స్కోరర్ అయిన తిలక్‌వర్మపై పాండ్యా వేళ్లు చూపిస్తూ మ్యాచ్ అవేర్‌నెస్ లేదని చెప్పడం, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తిలక్‌వర్మ సరిగా ఆడలేకపోయాడని బ్రాడ్‌కాస్టర్లతో చెప్పడం వంటివి సరికాదంటున్నారు. జట్టు వైఫల్యానికి ఒక్క ఆటగాడిని నిందించడం మంచిదని కాదని అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article