Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుమురికి…ఏది మురికి …ఎవరు మురికి

మురికి…ఏది మురికి …ఎవరు మురికి

మురికివాడల్లోనుంచి మహనీయులు ఉన్నారే..
మురికి వాడల్లో ఉంటే మురికి పనులు చేయాలని లేదే..
ఈ మురికి మాటలకే ఆ పంతులు మండి పడ్డాడా
మంచి మాటలు మాట్లాడాల్సిన సద్బ్రాహ్మణుడు సహనం కోల్పోయాడా…
మురికి చేష్టలు చూసి మీసాలు మెలేసాడా…
మురికి వాడలంటే శాపమేమి కాదే…
మురికిలో కూడా మానవత్వం ఉంటుందే…
ముష్టి పనులు చేస్తూ మురికి అని అంటించు కోవడం దేనికో..
అదుపు చేయలేక అండగా ఉండవారు కూడా మురికి వారేనా..
మురికిని శుభ్రం చేయాల్సిన మురికి శాఖ కూడా ఇందులో ఉందా…
వృత్తి ప్రవుత్తి ఒక్కటి అవ్వాలని లేదే…
కౌతాలో ఇన్ని మురికి పనులు జరుగుతుంటే …
ఈ మేధావులు మౌనంగా ఉన్నారెందుకో…
కళామాతల్లి కూడా మురికి అంటిస్తుంటే…
కళ్ళున్న కళా కారులకు కారు చీకట్లు కమ్ము కున్నాయా…
ఏమిటీ ఆ మురికి ఏల ఈ మురికి పనులు…

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం పట్టణాలలోని కనీస అవసరాలు లేని నివాస ప్రాంతాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మురికివాడల్లో నివసించే ప్రజల శాతం 1990 – 2005 మధ్య 47 నుండి 37 కు తగ్గింది. అయినా పెరుగుతున్న జనాభా దృష్ట్యా మురికివాడల్లో నివసించే ప్రజలు ఎక్కువ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ ప్రజలు మురికివాడల్లో నివసిస్తున్నారు.అయితే మురికి వాడల్లో నివసించే వారంతా మంచివారు కాదని చెప్పడానికి ఎవరూ కూడా మాట్లాడరు. ఒక మనిషి ఎక్కడ పుట్టాము…ఎలా పెరగినాము అన్నది ఇక్కడ ప్రామాణికం కాదు..ఆ వ్యక్తీ యొక్క ప్రవర్తన ఆధారంగా అతని చేష్టలు ,నడవడిక, అలవాట్లు, సమాజ పోకడలు చూసి నిర్ణయిస్తారు. అంతే కానీ మురికి నుంచి వచ్చాను కాబట్టి మురికి పనులు చేస్తా అంటే మురికి వాడలనుంచి వచ్చి ఈ దేశానికి ఒక గొప్ప విధి విధానాలు అందించిన మహనీయుడు డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగ ము ఒప్పుకోదు గా. గుర్రం జాషువా ఒక తెలుగు కవి. తెలుగు సాహితీ లోకంలో ఆయన దిగ్గజ వ్యక్తి. తన అపారమైన జ్ఞానంతో మరియు కుల ఆధారిత వివక్ష కారణంగా అతను ఎదుర్కొన్న పోరాటం ద్వారా, జాషువా తన కవిత్వాన్ని విశ్వవ్యాప్త విధానంతో రాశాడు. అతని కలకాలం కవిత్వం మరియు సాహిత్యం కోసం అతను “మిలీనియం కవి” అని పిలువబడ్డాడు.ఆయనేమి మురికి వాడలనుంచి వచ్చాను అని మురికి పనులు చేయలేదే.ఏది మానవత్వం ఏది మానవ సమాజం అని విసదీకరించి విస్తృతం చేసాడు. విశ్వనాథ సత్యనారాయణ కృష్ణాజిల్లా వాసి ఓ కుగ్రామం లో పుట్టాడు…అయినంత మాత్రాన మేధావి గా రాణించాడు.ఆయనెప్పుడు మురికి గ్రామంలో పుట్టాను అని అనలేదే.దేశ వర్ధమాన కాల పరిస్థితిల కారణంగా ప్రజలు జీవించే ప్రదేశం లో సరైన వసతులు కల్పించడంలో కొంత వెనుకబడిన ప్రాంతాల్లో మురికి కనిపిస్తుందే తప్ప మనిషి పుట్టుక చావు రెండూ కూడా మురికిలో నే జరిగేవి.తల్లి గర్భం నుంచి వచ్చిన తరువాత మురికిని శుభ్రం చేసిన తరువాత నే శిశువు ను బైటికి ఇస్తారు.ఎంత సంపన్నుడు అయినా మురికి అంటుకోకుండా పైకి రాలేరు.మరణం కూడా అంతే లేనివాడైన ఉన్నవాడైన చివరికి చితిలో ఒక్కటే మిగిలేది బుడిదే.అది మురికి వాసన వస్తుంది. పొట్టకూటి కోసం నిద్రలేచింది మొదలు మురికిని శుభ్రం చేసి పారిశుధ్య కార్మికులు ఆ పని అవ్వగానే మురికిని శుభ్రం చేసుకుని హాయిగా జీవిస్తూ ఉంటారే వారేప్పుడు మురికి మాటలు మురికి పనులు చేయరే.ఇక్కడ వృత్తి ధర్మం వేరు జీవన విధానం వేరు.

అంతెందుకు ఓ కళాసంస్థ పెట్టి రిజిస్టర్ లేకుండా ఓ పార్టీ బ్యానర్ కట్టి పాటలు పాడటం వరకు పర్లేదు.ఏ అర్హత ఉందని గాణ సరస్వతి, జూనియర్ బాలు ఇలా అవార్డులు ఇస్తున్నారు.అది సక్రమమేనా ఇదే మురికి నోరుతో ఓ గాయకుడి దగ్గర ఓ గాయని మణిని ఏదో మాట్లాడటం తెలియగానే ఎప్పటి నుంచో ఆ గాయనీ గాయకులతో పాటలు పాడించు కుని ఆహా ఓహో అని ఇప్పుడు వారి ఊసే లేకుండా పోయిందే వీటినే మురికి పనులు అంటారు ఇలా కారుకూతలు కుసేవారు మురికి వాడల్లో ఉండాలని అనరు.చేసే తప్పుడు పనులు కు మురికి మురికి అని అంటించు కొంటె అది ఎవడి కర్మ వాడిది. ఊరు గొప్ప పేరు దిబ్బ అని చెప్పుకుంటూ మురికి మాటలు మాట్లాడడం వల్లనే ఆ పంతులు కూడా అన్ని మురికి కూతలు కుసాడెమో మరి.సద్బ్రహ్మణుడు నోటి వెంట శాంతి మాటలు రావాల్సింది సహనం కోల్పోయి సై అని తొడగొట్టేంత స్థితికి వచ్చారంటే ఏమనాలో విజ్ఞులైన కళాభిమానుల, కళాపోషకులు ఆలోచన చేయాలి. పోనీ మురికి నుంచి వచ్చి కళామ తల్లిని ఆరాధిస్తూ కళలను బ్రతికేస్తున్నావని అనుకుంటే ఆమురికి మాటలను కట్టడి చేయాల్సింది పోయి స్థాయి వయస్సు మరిచి గ్రూప్ లలో ఫార్వర్డ్ చేయడమంటే వీరేంత మురికి మునుషులో మరి ఆలోచించాలి అభిమాన కళాకారులు.ఇలాంటి వారి వల్లే కదా కళారంగం కళావిహీనం గా మారిపోతున్నది.సరే కౌతాలో మేధావులే ఉన్నారని అనుకుంటే సింగర్ సురేష్ తో స్నేహం ఉందని ఓ కళాసంస్థ అధినేత కృష్ణలంక లో కళాభిమానుల కోసం కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఆ కార్యక్రమాన్ని కుట్రలు చేసిందేవరు అన్నది తెలిస్తే మరి ఈ కళా సంస్థలు అధినేతలను కళాభిమానుల ఏమిచెయ్యాలో ఆలోచన చేయాలి. ఇది ఇక్కడ జరుగుతున్న తీరు ఇప్పటికయినా కళారంగాన్ని పోషిస్తున్న కళాపోషకులు ఆలోచన చేసి అర్థవంతమైన పనులు చేయాలని పలువురు కళాకారులు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article