వికలాంగులకు వృద్ధులకు మహిళలకు పంపిణీ.

మూడు లక్షల విలువైన వస్త్రాలు 700 మందికి పంపిణీ.
భారీ అన్నదాన కార్యక్రమం.

రామచంద్రపురం.
ద్రాక్షారామలో శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నంకు చెందిన శివకోటి మధు సూధనరావు ఆధ్వర్యంలో వృద్ధులకు మహిళలకు వికలాంగులకు దుప్పట్లో చీరలు పంపిణీ జరిగింది. సత్యసాయి ట్రస్ట్ విశాఖపట్నం వారి 15వ వార్షికోత్సవ పురస్కరించుకుని ద్రాక్షారామంలో ఈ కంపెనీ కార్యక్రమం చేపట్టారు.శ్రీ భీమేశ్వర స్వామి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సుమారు 700 మంది వృద్దులకు, వికలాంగులకు, మహిళలకు సుమారు 3లక్షలు విలువైన చీరలు, దుప్పట్లు, అందజేశారు. అలాగే ఇక్కడకు హాజరైన వారందరికీ భోజనం, బాబా వారి ప్రసాదం అందజేసినారు. అనంతరం మధుసూదనరావు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెలలో తమ బృందం 50మంది సభ్యులుతో కలిసి విశాఖపట్నం నుండి ద్రాక్షారామ వచ్చి బాబా వారి ఆశీస్సులతో పేదవారికి తమ వంతు సేవ చేస్తున్నామనితెలిపారు. మా సంస్థ విశాఖపట్నంలో కే.జీ.హెచ్ వద్ద ప్రతీ రోజూ 500 మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేటికి 15 సంవత్సరాలు నుండి నిరంతరంగా మా బృందం ద్రాక్షారామ వచ్చి పేద వారికి ఉచితంగా బట్టలు, భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు, దాడి భాస్కర్, పి. శ్రీనివాస్, జె. చంద్రశేఖర్, ఐ. రవికిరణ్, బి. శ్రీకాంత్, ఎస్వీఆర్ రాజు, వై. నాగేశ్వరరావు, ఎం. కామేశ్వరరావు, వై. రోజారాణి, ఎం. పద్మావతి, వై. విజయ తదితరులు పాల్గొన్నారు.