Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యందీపావళికి దీపాలు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!

దీపావళికి దీపాలు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!

ఆలయం అయినా, ఇల్లు అయినా ఏ శుభకార్యం అయినా ప్రారంభమయ్యేది దీపారాధనతోనే. అంత విశిష్టత ఉండే దీపాలతో ఇల్లంతా నింపేసే పండుగ దీపావళి. అమావాస్య చీకటి లాంటి అజ్ఞానాన్ని తొలగించి వెలుగుతో సమానమైన జ్ఞానాన్నిచ్చే దీపాలను వెలిగిస్తారు. అందుకే దీపాన్ని జ్ఞానజ్యోతి అని కూడా అంటారు.

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్‌
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్‌ ఘోరాద్దివ్య జ్యోతిర్నమోస్తుతే॥

దీపం వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలనే సందేహం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది. ఆ సందేహాలకు సమాధానం ఈ శ్లోకం. సాజ్యం త్రివర్తి సంయుక్తం..అంటే మూడు ఒత్తులు కలిపి అని అర్థం. 3 ఒత్తులను నూనెలో తడిపి అగ్నితో వెలిగించిన శుభప్రదమైన, ముల్లోకాల్లో చీకట్లను పారద్రోలే దీపాన్ని వెలిగించాను. అలాంటి దీపాన్ని భక్తితో పరమాత్మకి సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి నన్ను రక్షింటే..దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నా అని అర్థం. దేవతా స్వరూపం అయిన దీపాన్ని వెలిగించేటప్పుడు ప్రమిదకు గంధం , కుంకుమ బొట్టు, పూలు పెట్టి నమస్కరించాలి. అనంతరం అక్షతలు సమర్పించి పూజించాలి. దీపారాధనకు వెండి, ఇత్తడి కన్నా మట్టి ప్రమిదలే మంచివి. లోహం వేడెక్కితే భూమి వేడెక్కుతుంది, మట్టి ప్రమిదలు అయితే వేడిని గ్రహిస్తాయి..అందుకే మట్టి ప్రమిదనే వినియోగించండి . ప్రమిదలో రెండు లేదా మూడు ఒత్తులు వేసి వాటిని కలిపి దీపం వెలిగించాలి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి వినియోగించాలి.ఇంద్రుడు దీపావళి రోజు లక్ష్మీ ఆరాధన చేసి పోయిన ఐశ్వర్యాన్ని తిరిగిపొందాడు.. అందుకే దీపాలు పెట్టిన ఇంట్లో దారిద్ర్యం ఉండదంటారు.
దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే
జీవాత్మకి, పరమాత్మకి ప్రతీక దీపం..అందుకే పూజ చేసేముందు దీపం వెలిగించి… దేవుడికి ప్రతిరూపాన్ని ఆరాధిస్తాం. షోడసోపచారాల్లో మొదటి , ముఖ్యమైనది దీపం. అందుకే శుభకార్యాలు, వేడుకలు, పండుగల సమయంలోనే కాదు నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం ముఖ్యం అంటారు పండితులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article