ఒక భారతీయ అధ్యయనంలో కెఫిన్ వినియోగం గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి తెచ్చింది. ప్రతిరోజూ 400 మి.గ్రా కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల గుండెకు చాలా ప్రమాదం. 400 మి.గ్రా కెఫీన్ అంటే దాదాపు నాలుగు కప్పుల కాఫీతో సమానం. లేదా రెండు ఎనర్జీ డ్రింక్స్ తాగడంతో సమానం. రోజుకు మూడు, నాలుగు కప్పుల కాఫీ తాగితే మాత్రం గుండెకు చేటు జరుగుతుంది.ఇలా తరచూ కాఫీ తాగుతూ ఉంటే తీవ్రమైన హృదయ సంబంధ సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది. కాఫీ మాత్రమే కాదు సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి ఇతర కెఫిన్ ఉత్పత్తులు వల్ల గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది.కాఫీ శరీరంలోని పారాసింపథెటిక్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. ఈ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తే శరీరం విశ్రాంతిగా ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటును శాంతపరుస్తుంది. శ్వాసను నెమ్మదించేలా చేస్తుంది. అయితే కాఫీ తాగగానే పరిస్థితి మారుతుంది. కాఫీ ఒక ఉద్దీపన అని చెప్పుకోవాలి. ఇది పారాసింపథెటిక్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది.ఇలా కాఫీ వల్ల పారాసింపథెటిక్ వ్యవస్థకు అంతరాయం కలుగుతూ ఉంటే అధిక రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. గుండెలో అధిక పీడనం అనేది నిశ్శబ్ద ప్రమాదంగా మారుతుంది. ఇది నెమ్మదిగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, చిత్తవైకల్యం వంటి ప్రమాదకరమైన వ్యాధులుగా మారుతుంది.మహిళలు, వ్యాపారం చేసేవాళ్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అధికంగా కాఫీ తాగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సుదీర్ఘ పని గంటలు చేయడం, ఒత్తిడితో కూడిన పని ప్రదేశాలు, బిజీ, వేగవంతమైన జీవనశైలితో కూడిన ఉద్యోగాలు, లెక్కలేనన్ని కాఫీ షాపులు, ఆఫీస్ కాఫీ యంత్రాలు… ఇవన్నీ కాఫీ ఎక్కువ తాగేలా చేస్తున్నాయి. ఇలా కొంతమంది రోజులో 600 మి.గ్రా కంటే ఎక్కువ కెఫీన్ గుండెపై ప్రభావం బలంగా పడుతుంది.