Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్ప్రెస్ క్లబ్ పై 2 కోట్లకు పైగా ఉన్న బకాయిలను తక్షణమే వసూళ్లు చేయాలి

ప్రెస్ క్లబ్ పై 2 కోట్లకు పైగా ఉన్న బకాయిలను తక్షణమే వసూళ్లు చేయాలి

  • ఆ నగదును ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, విజయవాడలోని జర్నలిస్ట్ సంక్షేమానికి వినియోగించాలి..

అందరి ప్రెస్ క్లబ్ గా మార్చేందుకు ఇరిగేషన్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు
ప్రెస్ క్లబ్ ను స్వాధీన పరుచుకుని అధికారులు, జర్నలిస్టులతో కలిపి కమిటీ వెయ్యాలి

  • కూటమి ప్రభుత్వం విజయవాడ ప్రెస్ క్లబ్ పై దృష్టి సారించాలి.
    —– ప్రెస్ క్లబ్ సాధన జేఏసీ నేతల డిమాండ్
  • విజయవాడ:వివిధ ప్రభుత్వ శాఖలకు పన్నుల రూపేనా బకాయి పడిన రెండు కోట్లపైగా మొత్తాన్ని ప్రెస్ క్లబ్ మాది అంటున్న ఏపీయూడబ్ల్యూజే నేతల నుంచి వసూలు చేయడంతో పాటు ఆ డబ్బుని విజయవాడ జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగించే విధంగా ఆ ఆ శాఖలతో పాటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని” ప్రెస్ క్లబ్ అందరిదీ విజయవాడ ప్రెస్ క్లబ్ సాధన సమితి” డిమాండ్ చేసింది.
    నాటి నుండి నేటి వరకు విజయవాడ ప్రెస్ క్లబ్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ, ప్రభుత్వ శాఖలకు కోట్లాది రూపాయలు పన్నులు బకాయి పడుతూ విజయవాడ జర్నలిస్టుల సంక్షేమానికి రూపాయి కూడా ఖర్చు పెట్టని విజయవాడ ప్రెస్ క్లబ్ పాలకవర్గ చర్యలను జేఏసీ తీవ్రంగా ఖండించింది.
    మంగళవారం స్థానిక సీతారాంపురం జంక్షన్ లో ఏపీ ఎం పి ఏ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన “ప్రెస్ క్లబ్ అందరిదీ జేఏసీ” సమావేశంలో వివిధ జర్నలిస్టులు పాల్గొన్నారు.
    విజయవాడ ప్రెస్ క్లబ్ అంశాలు భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ
    విజయవాడలో 2000 మంది పైబడి అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్న కేవలము 120 మందికి మాత్రమే విజయవాడ ప్రెస్ క్లబ్ లో సభ్యత్వాలు ఇచ్చి మిగతా జర్నలిస్టులు అందరికీసభ్యత్వాలు.అందజేయకపోవటానికి గత సంవత్సరముగా జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్న విషయము విధిదమే.
    ఇది ఇలా ఉండగా గత కొంతకాలంగా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రెస్ క్లబ్ యాజమాన్య వైఖరిని తప్పుపడుతూ కోట్లాది రూపాయలు పెనాల్టీ వేయటం పట్ల జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రెస్ క్లబ్ ను ఖాళీ చేయమని ఇరిగేషన్ శాఖ వారు నోటీసులు ఇవ్వటమే కాక కోటి 80 లక్షలు బకాయిలు చెల్లించమని నోటీసు ఇవ్వడం పట్ల జేఏసీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ డబ్బును తక్షణమే ప్రస్తుతం ఉన్న ప్రెస్ క్లబ్ యాజమాన్యంతో కానీ, ఇది అందరి ప్రెస్ క్లబ్ కాదు ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ అంటున్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) నుంచి వసూలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.
    ఏపీయూడబ్ల్యూజే కబంధహస్తాల నుంచి ప్రెస్ క్లబ్ ను కాపాడి రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన విజయవాడ జర్నలిస్టులకు సభ్యత్వాలు కల్పించి ఎన్నికలు నిర్వహించవలసినదిగా జేఏసీ డిమాండ్ చేసింది. 1971లో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి హయాంలో విజయవాడ ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ కు శంకుస్థాపన చేశారని ఆ సమయంలో గానీ, 1995లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ప్రెస్ క్లబ్ మొదటి అంతస్తుకు ప్రారంభోత్సవం చేశారని ఆ సమయంలో కూడా ఎక్కడ ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) శిలాఫలకాలపై ప్రస్తావనలేదని జర్నలిస్టుల సంఘ నాయకులు అందరూ ముక్తకంఠంతో అన్నారు. ప్రెస్ క్లబ్ ను జర్నలిస్టుల కుటుంబ కార్యక్రమాలకు కానీ, జర్నలిస్టుల
    సంఘాల సమావేశా లకు కానీ, ఇవ్వకుండా పూర్తిగా వ్యాపార దృక్పథంతో
    పాలకవర్గం నిర్వహించటం పట్ల జేఏసీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
    2023 డిసెంబర్ 11న నాటి సబ్ కలెక్టర్ విజయవాడ వారు నివేదిక ఇస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారని అన్నారు.
    సబ్ కలెక్టర్ నివేదికను పరిగణలోకి తీసుకొని విజయవాడలో ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్ట్ కు సభ్యత్వం కల్పించి ప్రెస్ క్లబ్ ను అందరి ప్రెస్ క్లబ్ గా మార్చాలని జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే ప్రసాద్ బాబు, టి.ఏ.పి.జె.ఏ. అధ్యక్షులు చందన మధు, ఏపీయూజే రాష్ట్ర నాయకులు కాకుమాను వెంకట్ వేణు, ఐ .ఎఫ్.డబ్ల్యూ.యు.జె. రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, పసుపులేటి చైతన్య కే హరికృష్ణ ప్రసాద్, తాడికొండ బాలాజీ, జాబ్ నాయకులు పి ప్రభాకర్ రావు,ఆర్ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article