వేలేరుపాడు:నకిలీ విత్తనాలు అరికట్టి మేలైన విత్తనాలను రైతాంగానికి సబ్సిడీపై అందించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా డిమాండ్ చేసింది. రాళ్లపూడి గ్రామంలో జరిగిన మండల కమిటీ సమావేశం లో (ఏఐపికె ఎంఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ మాట్లాడుతూ, 2024 సంవత్సరం వ్యవసాయ సీజన్ ప్రారంభం అయినప్పటికీ గిరిజన రైతులకు అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వమే 50% సబ్సిడీలతో ఇవ్వాలని ,మార్కెట్లో వచ్చే కల్తీ విత్తనాలను అరికట్టాలని ,పోలవరం ప్రాజెక్టు ముంపులో లేనటువంటి రామవరం, మేడేపల్లి గ్రామ పంచాయతీలలోని గిరిజన రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ,పాత వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని, తెలంగాణ రాష్ట్రంలోని అశ్వరావుపేట మండలంలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను పూడికలు తీసి సకాలంలో రైతులకు సాగునీరు అందించాలని, ఆదివాసి గిరిజన రైతులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సిరికొండ రామారావు,గడ్డాల ముత్యాలరావు,వేలేరుపాడు మండల కార్యదర్శి సోయం చందర్రావు,పార్టీ మండల కమిటీ సభ్యులు ఆసి లక్ష్మయ్య, మడకం నాగేశ్వరరావు, లంకపల్లి శివ, మోసం రాజారావు, పిడిగాల సత్యనారాయణ గ్రామ కమిటీ సభ్యులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు