Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుదసరా వచ్చింది.. సరుకు వచ్చింది..

దసరా వచ్చింది.. సరుకు వచ్చింది..

తరలించు తటపటాయించక..
మమ్మల్ని ఆపేదెవరు అంటున్న మాఫియా ..
నకీలీ గాళ్ళకు మామూళ్లు..
వార్తలు రాస్తే కోతలు కోస్తారు..
తనిఖీలు చేస్తే తప్పుడు పనులు బైటికి వచ్చాయ్..
పట్టుబడుతున్న బియ్యం చాలవ సాక్ష్యాలు గా ..
బెజవాడ మాఫియాకు ముగింపు పలక లేరా..
రెచ్చిపోయిన వారు ఇప్పుడేమి చేస్తారు..
అధికారుల అలసత్వమే అన్నిటికీ కారణం
అన్నీ తెలిసినా ఆదమరుస్తున్నారు ఆ శాఖ అధికారులు..
రేషన్ పట్టు గిఫ్ట్ పట్టు అన్నట్లుగా మాఫియా..
పట్టుబడిన బియ్యాన్ని వీరే కొంటారు..
కొన్నట్లు కాగితాలు ఉంటాయి ..
అదే బియ్యం అదే కాగితాలు..అవే ఆటోలు
ఇక కోటాను ఆపేదెవరు..
కాసులిస్తే కాగితాలు బోలెడు..
అధికారుల కక్కుర్తి కి కొదవే లేదు..
పేరుకు పేదలకు తరలించేది పరాయి రాష్ట్రాలకు ..

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
‘దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచిందయ్యా దశనే మార్చిందయ్యా జయహో దుర్గా భవానీ.. ” అనేది లారీ డ్రైవర్ సినిమాలో అద్భుతమైన పాట.అయితే ఆ అద్భుతమైన పాట లాగే ఇక్కడ ఇంకా అద్బుతంగా రేషన్ మాఫియా చిందులేస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఇటు బెజవాడ అటు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అండ పిండ బ్రహ్మాండం బద్దలయ్యేలా నిర్వహిస్తారు.ఈ ఉత్సవాలలో ఆ దేవదేవుని దర్శించుకునేందుకు ,ఇటు అమ్మలగమ్మ మూలపుటమ్మను దర్శించు కునేందుకు లక్షలాదిమంది భక్తులు దేశ విదేశాల నుంచి వస్తారు. ఆ భక్తుల భద్రతా దృష్ట్యా భారీ బందోబస్తు ఉంటుంది.భక్తులకు సౌకర్యాలు కల్పించాలని వేలాదిమంది అధికారులను అక్కడ విధుల్లో వేస్తారు. ఇంకేముంది రేషన్ మాఫియా వారికి పండగే పండగ.దసరా వచ్చింది దారిలో ఎవరూ ఉండరు…సరుకు వచ్చింది సంచులు నింపుకుని సరదాగా జేబులు నింపుకున్న అడిగేవాడు ఉండడు.. అమ్మా భవాని, జై భోలో భవాని అని చిందులు వేస్తున్నారు మాఫీయా కింగ్ లు. సాధారణంగా రేషన్ అక్రమ రవాణా ను అడ్డుకునే నాధుడే కరువయ్యారు. ఎన్ని కథనాలు రాసినా ఆ కథనాలు కాగితాల్లోనే ఉంటున్నాయే తప్ప కథనాలను చూసి కనీసం కట్టడి చేయడానికి కూడా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఏదో మొక్కు బడిగా అది కూడా లారీల ను ఆపి సొమ్ము చేసుకునే కొంతమంది నకిలీ విలేకరుల మూలాన కొన్ని చోట్ల ఒకటో రెండో లారీలు ఆటోలు పట్టుబడుతున్నాయి. ఈ పట్టుబడినవి కూడా ఇబ్రహీంపట్నం అడ్డరోడ్ లోనే కొంచెం ఎక్కువ అని చెప్పాలి.ఎందుకంటే అక్కడ రేషన్ మీదే బ్రతికే నకిలీ గాళ్ళు ఉన్నారు.దీనితో అక్కడ పట్టుబడుతున్నాయి. లింగాల జగ్గయ్య పేట ,కంచిక చర్ల ,నందిగామ, పామర్రు, కంచిక చర్ల,మంగళగిరి,తెనాలి తదితర ప్రాంతాల్లో రోజూ దసరా పండగలాగే రేషన్ తరలిపోతుంది.ఇవన్నీ అధికారులకు తెలిసే జరుగుతున్నా ఈ ఉత్సవాలలో ఈ అక్రమ రవాణా మరింత జోరుగా చేసుకునే అవకాశం ఉంది. ఇక పోతే పట్టుబడిన రేషన్ బియ్యం మల్లీ వీరే కొనుగోలు చేస్తారు. అందుకు అధికారులు కాగితాలు ఇస్తారు.అది మాఫియా వారికి అధికారికంగా లైసెన్స్ ఇచ్చినట్లు గా అవుతుంది.అదే ఆటో అదే బియ్యం అని చెప్పడం అవే కాగితాలు చూపించి అనేక లారీల ద్వారా తరలించడం .ఇదంతా షరా మాములే.ఇలా ఏళ్ల తరబడి జరుగుతుంటే ఏ ప్రభుత్వం వచ్చినా పాతసీసోలో కొత్త నీరు అన్నట్లుగా ఉందే తప్ప కొత్త రకం చర్యలు ఏమి కనిపించడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article