ఏవో స్రవంతి
రామచంద్రపురం
భూసార పరీక్ష విధానంతోనే భూమిని బంగారంగా మార్చుకుని మనం పండించే పంటల్లో నుంచి అధిక ఆదాయం పొందగలరని రామచంద్రపురం మండలం వ్యవసాయ అధికారి శ్రీమతి స్రవంతి అన్నారు.
మండలం లో గత ఖరీఫ్ సీజన్ లో భూసార పరిరక్షణ పథకం(బంగారు నేల – బంగారు పంట)క్రింద 440 భూసార పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం లో భూసార పరీక్ష పత్రాలను రైతులకు ఆమె అందచేసారు. రైతులు కు భూసారా పరీక్షల వలన నత్రజని,భాస్వరం, పొటాషియం, జింక్, ఐరన్ మొదలగు వాటి లభ్యత తెలుస్తుంది అని వాటిని అనుసరించి రైతులు రబీ లో ఎరువులు ఎంత మోతాదు లో వేస్కోవచ్చునో ఒక అంచనాకు వచ్చి మంచి దిగుబడి పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు