మాజీమంత్రి ముత్తంశెట్టి
విశాఖపట్నం:
మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు సీతమ్మదార కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శంఖారావం సభలో లోకేష్ తనపై చేసిన విమర్శలను ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఖండించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ లోకేష్ శంఖారావం సభ అట్టర్ ఫ్లాప్ అని, లోకేష్ సభకు స్పందన జీరో కావడంతో ఎవరో రాసిన స్క్రిఫ్ట్ లోకేష్ చదువుతున్నాడని..లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని రెండు వేల ఎకరాలు భీమిలి లో కబ్జా అంటున్న లోకేష్ నిరూపిస్తే ఆ భూమి లోకేష్ కి రాస్తానని ఆయన అన్నారు. లోకేష్ కి ధైర్యం ఉంటే భీమిలీలో పోటీ చేయాలని.. విశాఖ నగరంలో భూ కబ్జాలకు పాల్పడింది టీడీపీ నేతలే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు దూరంగా పెట్టి పవన్ ను ఎందుకు దగ్గరకు తీసుకున్నారో ప్రజలకు చెప్పండని ఆయన తీవ్ర వాఖ్యలు చేశారు. రాజ్య సభ సీట్లతో వ్యాపారం చేసింది చంద్రబాబు,లోకేష్ ది. ఒక దళితుడుకి రాజ్య సభ సీటు ఇచ్చిన చరిత్ర సీఎం జగన్ కే సాధ్యం అని..లోకేష్ ది ఎర్ర బుక్ కాదు, ఎర్రి బుక్ లాంటి వాడని.. సీఎం ధైర్యం ముందు చంద్రబాబు లోకేష్ ఎంతని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ధైర్యవంతుడు కాబట్టి ఎమ్మెల్యే సీట్లు మార్చారని భూ కబ్జాలు మీ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టే ప్రజలు మిమ్మల్ని కుర్చి మడతపెట్టి మరీ కొట్టారని అది గ్రహించని లోకేష్ మాలోకం పిచ్చిగా మాట్లాడుతున్నాడని మీకు దమ్ముంటే మేము కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కార్యకర్తలు కానీ సెంటు భూమి కబ్జా చేసినట్లు నిరూపించాలని అన్నారు.