Monday, January 20, 2025

Creating liberating content

తాజా వార్తలుకోట మండలంలో నకిలీ జీడిపప్పు హల్చల్

కోట మండలంలో నకిలీ జీడిపప్పు హల్చల్

కోట్లాది రూపాయలు వ్యాపారం

ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడరు

ఏలూరు

జీడిపప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం ఏ శుభకార్యం జరిగిన ఏ కార్యక్రమం జరిగిన చిన్న పెద్ద తేడా లేకుండా జీడిపప్పులు వాడటం నేటి రోజుల్లో సర్వసాధారణంగా మారింది. ఒకప్పుడు ఉన్నత వర్గాలు మాత్రమే ప్రాముఖ్య పరిస్థితి. ఆ స్థితి నుండి నేడు ప్రతి ఒక్కరు జీడిపప్పు లేని వంటకం లేదంటే ఆశ్చర్యకరం. దీన్ని వ్యాపారస్తులు మూడు పూలు ఆరు కాయలుగా నకిలీ జీడిపప్పును చలామణి చేస్తున్నారు. దీనిలోబద్ద, గుండు, నలుసు వంటి గ్రేడింగ్లు ఉంటాయి. దీనిలో ప్రధానంగా గుండు పప్పును నకిలీన్ తయారుచేసి మార్కెట్లోకి బుచ్చలవిడిగా వదులుతున్నారు. ప్రజల ప్రాణాలు ఎటు పోతే మాకేంటి, మా వ్యాపారం సాగుతుంది. కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాం అనే ధోరణి తప్ప ప్రజల ప్రాణాలు పట్టించుకునే పరిస్థితి లేదు. కామవరపుకోటలో నకిలీ జీడిపప్పు వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుంది. ఇక్కడ జరిగే వ్యాపారానికి, జమ ఖర్చులు ఉండవు, ఒకవేళ ఉన్న నామమాత్రపు కచ్చులే తప్ప ఆడిటులతో దొరికే అంత చూపించరు అనేది జగమెరిగిన సత్యం. ప్రతిరోజు ఇక్కడ నుండి ఆటోలు, టాటా వ్యాన్లు, ఆర్టీసీ బస్సులలో వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు. ఏ ఒక్క లగేజీకి ఎన్వాయిసులు, బిల్లులు ఉంటే ఒట్టు. నిజమైన జీడిపప్పు ఒక అంగుళం ఉంటే నకిలీ జీడిపప్పు దానికంటే పరిమాణంలో బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా అడిగితే ఇది పలాస, ఇది గుడివాడ, ఇది నెల్లూరు, పేర్లు చెబుతూ రేటు తక్కువ క్వాలిటీ అంటూ చలామణి చేస్తూ ఉంటారు. పప్పు అమ్మని తర్వాతే డబ్బులు ఇస్తారు. దీంతో ఈ ప్రాంతం నుండి రాష్ట్ర నలుమూలలతో పాటు, తెలంగాణ కూడా ఎగుమతి చేస్తారు. ఒకప్పుడు దివాలా తీసిన వ్యాపారులు, కోట్లాది రూపాయలు టర్న్ అవర్ చేస్తున్నారు. నిజమైన జీడిపప్పు కొద్దిగా తీపిగా ఉంటుంది. నకిలీ జీడిపప్పు చప్పగా ఉంటాయి. నకిలీ జీడిపప్పు కంటే నిజమైన జీడిపప్పు బరువు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఎవరు చూస్తారు. తెచ్చామా కార్యక్రమాలు నిర్వహించామా అనేది చూస్తారు తప్ప నకిలీ గుర్తించడం కష్టం. దీన్ని ఆసరాగా చేసుకొని జీడిపప్పు తో ప్రజలు ప్రాణాలు తో ఆట్లాడుకుంటున్నారు. కోట్లు గడిస్తున్నారు. అధికారులు స్పందించి జీడిపప్పు కేటుగాళ్లు ఆటలు కట్టించాలని ప్రజల కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article