మార్కెట్లో లభించే అన్ని పుచ్చకాయలు మంచివే అని చెప్పలేం. అవి త్వరగా పండేందుకు వాటిలో రసాయనాలు కలుపుతూ ఉంటారు. పుచ్చకాయలు త్వరగా చెడిపోకుండా ఉండేందుకు, లోపలి భాగం ఎరుపు రంగులో ఉండాలని వివిధ కారణాలతో పుచ్చకాయలకు రసాయనాలు కలుపుతారు.ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి చాలా హానికరం.రసాయనాలతో పండిన పుచ్చకాయ గింజలు చాలా చిన్నవిగా.. సహజంగా పండిన పుచ్చకాయ పండ్ల గింజలు నల్లగా ఉంటాయి…పెద్దగా ఉంటాయి.పుచ్చకాయలను కట్ చేసినప్పుడు గుజ్జు పగిలిపోయి రంగులో తేడా ఉంటుంది. కోసినప్పుడు విడిపోతే ఆ పుచ్చకాయలో కెమికల్ కంటెంట్ ఉందని చెప్పొచ్చు. కొన్నిసార్లు మనం పుచ్చకాయను కోస్తుంటే గుజ్జులో తేడా కనిపిస్తుంది. కింద పడుతూ ఉంటుంది. అది సరైనది కాదని అర్థం.పుచ్చకాయ పండ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే, అలాంటి పండ్లపై రసాయనాలు స్ప్రే చేసినట్లు భావించవచ్చు. వాటిని చేతులతో తాకగానే పౌడర్ చేతులకు అంటుకుంటుంది. అలాంటి పండ్లు ఆరోగ్యానికి మంచిది కాదు.సాధారణంగా పండ్లను సరిగా పరిశీలిస్తే అందులో కెమికల్ కలిపారో లేదో అర్థం చేసుకోవచ్చు. నిశితంగా పరిశీలిస్తే పుచ్చకాయలో సూదితో పొడిచిన చిన్న రంధ్రం ఉంటుంది. పండ్లు త్వరగా పక్వానికి రావడానికి కార్బైడ్‌ను కలుపుతారు. ఇది ఇథనాల్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా పండ్లు త్వరగా పండుతాయి. త్వరగా పక్వానికి రావడానికి, రంగు వచ్చేలా చేయడానికి సుడాన్ రెడ్, మిథనాల్ ఎల్లో, మెర్క్యూరీ క్రోమేట్ వంటి రసాయనాలను కూడా ఉపయోగిస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు.
కార్బైడ్‌తో చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మిథనాల్ కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. క్రోమేట్ కడుపు సమస్యలు, రక్తహీనత, మెదడు దెబ్బతినడం, సంతానోత్పత్తి తగ్గడం వంటి సమస్యలను కలిగిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తింటాం. కానీ మనం తినే పండ్లు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే లాభం కోసం పండ్లపై రసాయనాలు వాడుతున్నారు. రసాయన రహిత పండ్లు తినడం మాత్రమే ఆరోగ్యానికి మంచిది.