Monday, January 20, 2025

Creating liberating content

Uncategorizedచుట్టుముట్టి దాడిచేసిన కుక్కలు.. మృతి చెందిన రైతు

చుట్టుముట్టి దాడిచేసిన కుక్కలు.. మృతి చెందిన రైతు

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. బిత్రపాడు గ్రామానికి చెందిన నీరస శంకరరావు (40) నిన్న ఉదయం గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదారు కుక్కలు ఆయనను చూసి మీదికి ఎగబడి దాడిచేశాయి. కుక్కలన్నీ ఒకేసారి దాడిచేయడంతో శంకరరావు తప్పించుకోలేకపోయాడు. వాటి దాడిలో తొడలు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. శంకరరావు అరుపులకు అక్కడికి చేరుకున్న స్థానికులు కుక్కలను తరిమి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే చినమేరంగి సీహెచ్‌సీకి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article