వ్యవసాయ అధికారి కృష్ణారెడ్డి ప్రజాభూమి ముద్దనూరు క్రిమిసంహారిక మందుల అమ్మకం దుకాణ యజమానులు రైతులకు తప్పనిసరిగా కొన్న వాటికి బిల్లులు ఇవ్వాలని, వాటిని రైతులు భద్రపరుచుకోవాలని వ్యవసాయ అధికారి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నల్లబెల్లి గ్రామంలో పూల వరదయ్య పూల వరదయ్య వేసిన శనగ పంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలములో వేరు కుళ్లు తెగులు అధికంగా సోకింది అని అలాగే పచ్చ పురుగు అధికంగా ఉంది అని తెలిపారు. రైతు గతంలో వాడిన పురుగు మందులు పరిశీలించి తదుపరి పురుగు ఉధృతి నివారణకు తగు సలహాలు అందించారు.వేరు కుళ్లు నివారణకు గాను టేబుకొనజోల్ 1 యమ్.యల్ అలాగే ఒక లీటరు నీటిలో కలిపి నోవాల్యురాను +ఇండాక్స్ కర్బ్ కలిపి పిచికారీ చేయాలి అని తెలిపారు.అలాగే 19.19.19 ఒక. లీటరు నీటికి10 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి అని తెలిపారు. రైతు లు అవసరం మేరకే పురుగు మందులు వాడుకోవాలి అని సూచించారు.ఇష్టానుసారంగా మందులు వాడరాదు అని తెలిపారు. డీలర్ల దగ్గర మందులు కొన్న వాటికి తప్పనిసరిగా నగదు బిల్లు తీసుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు మహేష్,యస్.వేణు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.