Praja Bhoomi https://www.prajabhoomi.com/ Get the Facts, Get Prajabhoomi Wed, 27 Nov 2024 10:25:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వరి పంట కోతలు చేపట్టవద్దు. https://www.prajabhoomi.com/buttayigudem/ https://www.prajabhoomi.com/buttayigudem/#respond Wed, 27 Nov 2024 10:25:16 +0000 https://www.prajabhoomi.com/?p=19785 మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు. ,బుట్టాయగూడెం.రానన్న ఐదు రోజులపాటు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వరి సాగు చేసిన రైతులుపంట కోతలు చేపట్టకుండా, కోసిన పంటను జాగ్రత్త చేసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మండల వ్యవసాయ అధికారి డి. ముత్యాలరావు సూచించారు. మండలంలోని లక్ష్ముడుగూడెం, దొరమామిడిలలో బుధవారం మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల విస్తరణ కార్యక్రమం పొలం పిలుస్తుంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ 2024 […]

The post తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వరి పంట కోతలు చేపట్టవద్దు. appeared first on Praja Bhoomi.

]]>
మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు.

,బుట్టాయగూడెం.
రానన్న ఐదు రోజులపాటు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వరి సాగు చేసిన రైతులుపంట కోతలు చేపట్టకుండా, కోసిన పంటను జాగ్రత్త చేసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మండల వ్యవసాయ అధికారి డి. ముత్యాలరావు సూచించారు. మండలంలోని లక్ష్ముడుగూడెం, దొరమామిడిలలో బుధవారం మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల విస్తరణ కార్యక్రమం పొలం పిలుస్తుంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ 2024 సీజన్ సంబంధించి వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే ధాన్యం అమ్మకం చేయాలని తెలిపారు. ప్రస్తుతం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వరి సాగు చేసిన రైతులు ఐదు రోజులపాటు కోతలు నిలుపుదల చేయాలని, ఇప్పటికే కోసిన వరి పంట పనల మీద గాని, ధాన్యం రాశుల మీద గాని, ధాన్యం కళ్ళల్లో ఉన్నట్లయితే గనుక రైతులు సురక్షితమైన ప్రదేశాలకి తీసుకువెళ్లి భద్రపరచాలని, ధాన్యం రాశుల మీద ధాన్యం తడవకుండా బరకాలు కప్పాలని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి వరి పంటలను పరిశీలించి తగిన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సహాయకులు కుసుమ, మౌనిక మరియు గ్రామ రైతులు హాజరైనారు.

The post తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వరి పంట కోతలు చేపట్టవద్దు. appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/buttayigudem/feed/ 0
తన పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేసిన కీర్తి సురేష్ https://www.prajabhoomi.com/keerthy-suresh-officially-announces-her-marriage/ https://www.prajabhoomi.com/keerthy-suresh-officially-announces-her-marriage/#respond Wed, 27 Nov 2024 10:11:38 +0000 https://www.prajabhoomi.com/?p=19782 గీతాంజలి అనే మళయాళ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కీర్తి సురేష్ ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నేను లోకల్, మహానటి తదితర సినిమాలు చేశారు. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేష్ తన అభినయంతో జాతీయ అవార్డును సాధించారు. తెలుగు, తమిళం, […]

The post తన పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేసిన కీర్తి సురేష్ appeared first on Praja Bhoomi.

]]>
గీతాంజలి అనే మళయాళ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కీర్తి సురేష్ ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నేను లోకల్, మహానటి తదితర సినిమాలు చేశారు. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేష్ తన అభినయంతో జాతీయ అవార్డును సాధించారు. తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేశారు.ఫొటో షేర్ చేసిన కీర్తి సురేష్ కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా వాటన్నింటికీ అధికారికంగా చెక్ పెట్టింది. 15 సంవత్సరాల నుంచి తన స్నేహితుడు ఆంటోనీతో కొనసాగుతున్న పరిచయం ఇకనుంచి జీవితాంతం కొనసాగనుందంటూ తనతో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మొన్న దీపావళి సందర్భంగా వీరిద్దరూ ఈ ఫొటో దిగారు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటినుంచే వీరిద్దరూ స్నేహితులు అని తెలుస్తోంది. దీనిపై సెలబ్రిటీలంతా స్పందిస్తున్నారు. జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.ఏడడుగులు నడవబోతున్న కీర్తిసురేష్ తన స్నేహితుడు ఆంటోనీతో కలిసి త్వరలోనే ఏడడుగులు నడవబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఇప్పుడు కీర్తి సురేష్ అధికారికంగా ప్రకటించింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆంటోనీ విదేశాల్లో కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత ఇండియాకు తిరిగివచ్చి వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. ఇవన్నీ కేరళలో ఉన్నాయి. పెద్దల అంగీకారంతో, ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. కీర్తి సురేష్ నుంచి వచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

The post తన పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేసిన కీర్తి సురేష్ appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/keerthy-suresh-officially-announces-her-marriage/feed/ 0
ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం https://www.prajabhoomi.com/israel-hezbollah-approve-ceasefire-agreement/ https://www.prajabhoomi.com/israel-hezbollah-approve-ceasefire-agreement/#respond Wed, 27 Nov 2024 10:06:00 +0000 https://www.prajabhoomi.com/?p=19779 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీకాలం చివరి రోజుల్లో గొప్ప విజయాన్ని సాధించారు. గత 10 నెలలుగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ వేశారు. ఈ రోజు ఉదయం నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అమెరికా, ఫ్రాన్స్ భాగస్వామ్యం వహించాయి. కాల్పుల విరమణకు సంబంధించి లెబనాన్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ హిజ్బుల్లా ప్రతినిధి ఎవరూ లేరు.కాల్పుల […]

The post ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం appeared first on Praja Bhoomi.

]]>
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీకాలం చివరి రోజుల్లో గొప్ప విజయాన్ని సాధించారు. గత 10 నెలలుగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ వేశారు. ఈ రోజు ఉదయం నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అమెరికా, ఫ్రాన్స్ భాగస్వామ్యం వహించాయి. కాల్పుల విరమణకు సంబంధించి లెబనాన్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ హిజ్బుల్లా ప్రతినిధి ఎవరూ లేరు.కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్ ఒక విషయం స్పష్టం చేసింది. హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము వారి ప్రదేశంలోకి ప్రవేశించి దాడి చేస్తామని చెప్పింది. వెనక అడుగు వేయబోమని స్పష్టం చేసింది. ఇరాన్, గాజాలపై దృష్టి సారించేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని అంగీకరించామని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం చెబుతోంది.ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ 10-1 ఓట్ల తేడాతో ఆమోదించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటితో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. యుద్ధాన్ని తాత్కాలికంగా ముగించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించినట్లు బైడెన్ వెల్లడించారు. హిజ్బుల్లా, ఇతర ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ భద్రతలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పారు.ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలో లెబనాన్ సైన్యం నియంత్రణను ఉపసంహరించుకోవడంతో 60 రోజుల్లో ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకుంటుందని బైడెన్ చెప్పారు. హిజ్బుల్లా అక్కడ తన స్థావరాన్ని పునర్నిర్మించుకోకుండా చూడాలి. ఇరు దేశాల పౌరులు త్వరలోనే సురక్షితంగా ఇళ్లకు చేరుకోగలుగుతారని బైడెన్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే హిజ్బుల్లా ఉల్లంఘిస్తే తీవ్రంగా స్పందిస్తామని ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం నెతన్యాహు చెప్పారు.అయితే నెతన్యాహు తన ప్రభుత్వంలోని కొందరు వ్యక్తుల నుంచి ఈ ఒప్పందంపై వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కాల్పుల విరమణ వల్ల ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్‌లపై దృష్టి సారించడానికి, ఆయుధాల ఎగుమతులను భర్తీ చేయడానికి, దళాలకు విశ్రాంతి ఇవ్వడానికి అవకాశం లభిస్తుందని నెతన్యాహు అన్నారు. ఒప్పందాన్ని అమలు చేస్తామని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా దీటుగా స్పందిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. ‘గెలిచే వరకు కలిసికట్టుగా పనిచేస్తాం. హిజ్బుల్లా యుద్ధం ప్రారంభంలో ఉన్న దానికంటే ఇప్పుడు బలహీనంగా ఉంది. దశాబ్దాలుగా దాన్ని వెనక్కి నెట్టివేశాం, సరిహద్దుల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం.’ అని నెతన్యాహు చెప్పారు.అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ అధికారులతో కొన్ని నెలలుగా చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ ఒప్పందంపై సంతకం చేయడమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ లెబనాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

The post ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/israel-hezbollah-approve-ceasefire-agreement/feed/ 0
ప్రమాదం కూడా పరిహాసమేనా..? https://www.prajabhoomi.com/is-even-an-accident-a-joke/ https://www.prajabhoomi.com/is-even-an-accident-a-joke/#respond Wed, 27 Nov 2024 06:00:49 +0000 https://www.prajabhoomi.com/?p=19775 పసికూన ప్రాణం పోతే పలకరింపు లేదు ..వయస్సు పోతే వాలిపోరని వాగుడు..యవ్వనస్తుడివి అవ్వు…యవ్వారాలు చేసుకో..ఏ ప్రాణము పోతే నీకెందుకు…పసికూనలపై పాడు మాటలేల..ఉన్నంత సేపు నా పాప అంటూ పట్టుకుని ఉంటివి..ప్రాణం పోయాక పాడు మాటలు లేలపెద్దమనిషి నంటూ నీకు నీకే కితాబు..నీ పైసలు ఉన్నంత వరకు నీ ఆర్భాటాలు…నీ రూపాయి లేదన్న రోజు నిన్ను పాపం అనికూడా అనరు..నీ పాటలు ..నీ పలుకులు ..నీ పనికిమాలిన చేష్టలు…ప్రాణ మన్నది పై వాడి దయ..అదేమీ షాపింగ్ మాల్ అంత […]

The post ప్రమాదం కూడా పరిహాసమేనా..? appeared first on Praja Bhoomi.

]]>
పసికూన ప్రాణం పోతే పలకరింపు లేదు ..
వయస్సు పోతే వాలిపోరని వాగుడు..
యవ్వనస్తుడివి అవ్వు…యవ్వారాలు చేసుకో..
ఏ ప్రాణము పోతే నీకెందుకు…
పసికూనలపై పాడు మాటలేల..
ఉన్నంత సేపు నా పాప అంటూ పట్టుకుని ఉంటివి..
ప్రాణం పోయాక పాడు మాటలు లేల
పెద్దమనిషి నంటూ నీకు నీకే కితాబు..
నీ పైసలు ఉన్నంత వరకు నీ ఆర్భాటాలు…
నీ రూపాయి లేదన్న రోజు నిన్ను పాపం అనికూడా అనరు..
నీ పాటలు ..నీ పలుకులు ..నీ పనికిమాలిన చేష్టలు…
ప్రాణ మన్నది పై వాడి దయ..
అదేమీ షాపింగ్ మాల్ అంత ఈజీ కాదు ..

(కృష్ణ సింధు,క్రైం)
మానవుల దృష్టిలో పుట్టడం అంటే ఇంతకుముందు లేనిది ఏదో రావడం. గిట్టడం అంటే ఇప్పటి వరకు ఉన్నది పోవడం. రెండు వేరు వేరుగా కనపడుతున్నా కానీ పుట్టడం అన్నా గిట్టడం అన్నా రెండూ ఒకటే! ఎలా అంటే ఏదైనా ఒక వస్తువు తన పూర్వావస్థ ( అంటే ఇంతకు ముందున్న స్థితి )ని వదిలి ఉత్తరావస్థ ( అంటే ఇప్పటి స్థితిని వదిలి తరువాత స్థితి )ని పొందడాన్నే పుట్టడం అంటారు. గిట్టడం అంటే కూడా అదే అర్ధం వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నస్థితిని వదిలి దాని తరువాత స్థితికి వెళ్ళడాన్ని గిట్టడం అంటారు.మరి ఇవి కూడా తెలియని ఒక మేధావి తన పైత్యం తో చిలుక పలుకులు పలుకుతుంటే పాటల లోకం ఫక్కున నవ్వుకుంటుంది.ఓ గాయని పాటల కోసం ప్రాకులడుతూ పసికూన అని చూడకుండా పరిగెడుతుంటే ప్రమాదంలో ప్రాణాలు పొగుట్టుకుంది. ఆ ప్రాణం పోయిందని ఎన్నో ప్రాణాలు విల విల లాడి పోయి పరుగులు తీసి పసికూన పై ప్రేమ చూపించి ఆ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.కానీ ప్రక్కనే ఉన్న పడుచు కుర్రాడిని గొప్పలు చెప్పుకుంటూ ఆ పాప ఉన్నప్పుడు నా పాప నా పాప అని పై పై పలుకులు పలికిన ఆ నోరు ఆరోజు ఎక్కడికి పోయిందో తెలియదు. ఈయన రాకపోయిన ఆ పసికూన తిరిగిరాదు కానీ ప్రమాదాన్ని కూడా పరిహాసంగా పలుకుతుంటే పక్కన వారు కూడా పైసలకోసం ప్రాకులాడుతూ అయ్యో ఏమిటి ఇలా అని ఖండించలేని స్థితిలో ఉన్నారంటే కళామాతల్లి ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఒకడు మరణం ఒకడి జననం అన్నది పై వాడి దయ.అంటే చేతపడులు ఉన్నాయని అంటున్నారు అలా అయినా ఆయుస్సు పుట్టినది గిట్టుకు టైం రానిది ఏమి కాదన్నది భగవతానుగ్రహం పొందిన వారి మాట.షాపింగ్ మాల్ లాగా కొనడం పడేయడం అనుకుంటే పొరపాటన్నది తెలుసా లేక తెలియని అజ్ఞానమా…తెలిసినా పొగరా అన్నది అంతా ఆ పై వాడికి తెలియాలి.అసలు మరణం అంటే ఏమిటీ ఎందుకు మరణాన్ని చూసి మనిషి భయపడుతున్నాడు అంటే… మరణానికి మరొక మారుపేరు “మార్పు”. మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ మరణం అనే పదాన్ని వాడగానే చాలా భయపడి పోతూవుంటాం. మానవునికి జీవించివున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే “అవస్థాషట్కము” అని అంటారు. అవి 1. పుట్టుట, 2. ఉండుట, 3. పెరుగుట, 4. మారుట, 5. క్షీణించుట, 6. నశించుట. దీనినే భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగము 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు.జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే అని. మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల తాను ప్రేమిస్తున్నవి తాను అనుభవిస్తున్నవి సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది.భూమి పుట్టి ఇంతకాలమైనా ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ మృత్యు భయం వీడకపోవటానికి కారణం ‘మోహం’ మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు, ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు! అందుకు ధర్మరాజు ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు! మృత్యువుని గురించి నచికేతుడు యమధర్మరాజుని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అది ‘కఠోపనిషత్’ గా ప్రసిద్ధి చెందింది. ఇక భగవద్గీతలో కూడా దీన్ని గురించి చెప్పబడింది. దాని ప్రకారం – ఏది అభౌతికమైనది అంటే.‘ఆత్మే’ అభౌతికమైనది.దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం. భూమిలోను అగ్నితత్వం. అగ్నిలోను, జలతత్వం, జలములోను వాయుతత్వం. వాయువులోను శబ్దతత్వం. ఆకాశంలోను లయమౌతాయి. ఇదీ క్లుప్తంగా గీత చెప్పింది.నాకు అన్నీ తెలుసు అన్న మనిషికి అసలు ఏమీ తెలియదు అనే ఒక నానుడిని మీరు కూడా వినే ఉంటారు. నేను భగవదానుభూతిని పొందాను, ఆధ్యాత్మిక వికాసం అంటే ఏమిటో నాకు తెలుసు అని ఎవరైనా అంటే దానర్ధం స్టేషన్ కు వెళ్ళటానికి నాకు దారి తెలుసు సుమా అని. స్టేషన్ ఒక స్థిర ప్రదేశం దీన్ని చేరుకోవటానికి అనేక మార్గాలున్నాయి. ఈ రోజుల్లో ఒక్కక్క మార్గానికి ఒక్కక్క గురువు ఉన్నాడు. నిజానికి వాళ్ళు చెబుతున్ననాకు తెలుసు నేను చూసాను అంటే వాళ్ళు ఏదో చూసారు ఆ చూచినదానికి కట్టుబడి ఉన్నారు.వాళ్ళంతా గతంలోనే ఉన్నారు. గతం కాలంలో కరిగి పోతుంది. అది సజీవమైంది. స్టేషన్ లాగా అది స్థిరమైన ప్రదేశం కాదు. మృత వస్తువు అంతకన్నా కాదు. విశ్వాసం నిజం కాకపోవచ్చు, అదే సత్యం కాదు కూడానేమో. కొంతమంది భగవంతుని విశ్వసించవచ్చు, కొంతమంది విశ్వసించక పోవచ్చు. ఎవరి విశ్వాసంలో వారికి ప్రామాణికత లుంటాయి. మన ఆలోచనలకు అనుగుణంగా మనం విశ్వాసాలను ఏర్పరుచుకున్నాం. మరి ఇంతకూ నిజం ఏమిటో ఎలా తెలుస్తుంది? నిజం తెలుసుకోవాలంటే మనసు స్వేచ్ఛగా ఉండాలి.విశ్వాసం, అవిశ్వాసం ఈ రెండింటిలోను దానికి తావులేదు. నిరంతరమూ అన్వేషించటమే సత్యాన్ని తెలుసుకోవటానికి మార్గం ఏదో ఒక మార్గంలో అన్వేషించాలి. ఆ మార్గం తప్పైతే మరో మార్గం! మరణభయాన్ని విశ్లేషించి చూస్తే మరణించేటపుడు పొందవలసిన దేహబాధ పెట్టే భయం కన్న మరణం తరువాత నేను మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది. ఇన్ని గ్రహించిన తర్వాత మనిషి ఎదుటి వారి మనస్సును, అంతరాత్మ పరమార్దాన్ని తెలుసుకోగాలుగుతున్నాడా.. ఇదే అందరూ గమనించి అవసరమైనప్పుడు ఒకలా అవసరం లేదు…ఇక ఆ అవసరం ఉన్నా అవకాశాలు లేకుండా పోయినప్పుడు అవకాశవాద మాటలు అమాట్లాడితే ఆవేశంగా ఉన్నా ఆవేదన తో ఆలోచించి అడుగులు వేసిన రోజు ఆ భగవంతుడు ఆలోచన చేస్తాడన్నది ఆ పరమాత్మ పై ఉన్న అపార నమ్మకం.ఇది అనుసరిస్తే ఆయుస్సు ఉంటుందా పోతుందో అనేది అంగడిలో సరుకు కాదన్నది అవగతమవుతుందని అర్థమయితే చాలు…

The post ప్రమాదం కూడా పరిహాసమేనా..? appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/is-even-an-accident-a-joke/feed/ 0
సాయంత్రం 6 గంటలతర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండొద్దు https://www.prajabhoomi.com/employees-should-not-be-in-the-offices-after-6-pm/ https://www.prajabhoomi.com/employees-should-not-be-in-the-offices-after-6-pm/#respond Wed, 27 Nov 2024 05:58:06 +0000 https://www.prajabhoomi.com/?p=19773 -ఉద్యోగులకు చంద్రబాబు బంపర్ ఆఫర్..! అమరావతి:-రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు.రాష్ట్రంలో ఉద్యోగులంతా స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీస్‌లో ఉండొద్దని వారికి సూచించారు. అలాగే తాను కూడా 6 గంటలకే సచివాలయం నుంచి వెళ్లిపోతానని వారికి తెలిపారు. ఉద్యోగులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని వారికి చంద్రబాబు సూచించారు. గతంలో ఎక్కువ గంటలు ఆఫీసుల్లో ఉండి పనిచేసే […]

The post సాయంత్రం 6 గంటలతర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండొద్దు appeared first on Praja Bhoomi.

]]>
-ఉద్యోగులకు చంద్రబాబు బంపర్ ఆఫర్..!

అమరావతి:-
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు.రాష్ట్రంలో ఉద్యోగులంతా స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీస్‌లో ఉండొద్దని వారికి సూచించారు. అలాగే తాను కూడా 6 గంటలకే సచివాలయం నుంచి వెళ్లిపోతానని వారికి తెలిపారు. ఉద్యోగులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని వారికి చంద్రబాబు సూచించారు. గతంలో ఎక్కువ గంటలు ఆఫీసుల్లో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని చంద్రబాబు ఉద్యోగులకు గుర్తుచేశారు.ఇప్పుడు అమల్లోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు ఉద్యోగులకు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు.
కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ ఆఫీసుల్లో ఉండొద్దనేది తన విధానంగా వివరింంచారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటు ఏ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు అయినా ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పనిలేదన్నారు. అలాగే స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని కూడా ఉద్యోగులకు సూచించారు.

The post సాయంత్రం 6 గంటలతర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండొద్దు appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/employees-should-not-be-in-the-offices-after-6-pm/feed/ 0
ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష https://www.prajabhoomi.com/the-constitution-is-the-savior-of-democracy/ https://www.prajabhoomi.com/the-constitution-is-the-savior-of-democracy/#respond Wed, 27 Nov 2024 05:55:05 +0000 https://www.prajabhoomi.com/?p=19770 కాలరాయాలని చూస్తే ఓటుతో గుణపాఠంఅంబేద్కర్ ఆశాయాలు నెరవేరుద్దాం – సమానత్వం సాధిద్దాంవందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి తెలుగువారిదే అగ్రపథంప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం – రాజ్యాంగాన్ని పూజిస్తాంమా ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో స్వేచ్ఛాస్వాతం్రత్యంరాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి :ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష అని, మన రాజ్యాంగం ఎంతో ధృడమైనదని.. దానికి ఎవరూ ఏమి చేయలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అరాచకశక్తులు అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో […]

The post ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష appeared first on Praja Bhoomi.

]]>
కాలరాయాలని చూస్తే ఓటుతో గుణపాఠం
అంబేద్కర్ ఆశాయాలు నెరవేరుద్దాం – సమానత్వం సాధిద్దాం
వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి తెలుగువారిదే అగ్రపథం
ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం – రాజ్యాంగాన్ని పూజిస్తాం
మా ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో స్వేచ్ఛాస్వాతం్రత్యం
రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి :
ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష అని, మన రాజ్యాంగం ఎంతో ధృడమైనదని.. దానికి ఎవరూ ఏమి చేయలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అరాచకశక్తులు అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పునర్జీవం వచ్చిందన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఎన్నో అసమానతల నుంచి సమానత్వం దిశగా భారతదేశం అడుగులు వేస్తోందంటే దానికి రాజ్యాంగం నిర్దేశించిన మార్గంతోనే సాధ్యమవుతోందని చెప్పారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ స్పూర్తితో నడచుకోవాల్సి ఉందన్నారు. భారత రాజ్యంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అతి గొప్ప రాజ్యాంగం మనది : ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 సంవత్సరాలు పూర్తయ్యిందని, ఇంతటి శుభదినం మనందరికీ ఎంతో విశిష్టమైందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారత దేశ రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని దీని రచనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారధ్యంలోని 299 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ రచనా సంఘం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిందని గుర్తు చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, కెనడా, జపాన్ వంటి పలు దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలో ఉత్తమమైన అంశాలను తీసుకుని ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. రాజ్యాంగ రచనలో నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య ఎన్జీ రంగా, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ వంటి 11 మంది తెలుగువారు కీలకపాత్ర పోషించారన్నారు. అంతేగాక దేశం గర్వించేలా పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారని సియం ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్ సవాళ్లకు తగ్గట్టుగా రాజ్యాంగ రచన :భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే ఊహించి అందుకనుగుణంగా తీసుకోవాల్సిన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. అంబేద్కర్ పేర్కొన్నట్టు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే వ్యక్తులు చెడ్డవారైతే దానివల్ల సమాజానికి చెడే జరుగుతుందని చెప్పారు. ప్రాథమిక హక్కుల్ని సైతం గతంలో ఎలా కాలరాశారో మనం చూశామని గడిచిన ఐదేళ్శ పాలనే ఇందుకు నిదర్శనమని సియం పేర్కొన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తెలిపారు. విధ్వంసం నుంచి విముక్తి :రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించకూడదని అన్నారు. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని, ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన జీవోలను రహస్యంగా ఉంచారని మరలా మన ప్రభుత్వం పారదర్శకంగా అన్ని జీఓలను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని సియం చెప్పారు. వందేళ్ల వేడకల్లో తెలుగువారిదే మొదటి స్థానం :2047 నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతాయని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్‌లో భాగంగా ఏపీలో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి అన్నారు. ఆనాటికి తెలుగువారు దేశంలోనూ, ప్రపంచంలోనూ మొదటి స్థానంలో ఉండాలన్నదే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అంతేగాక తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని చెప్పారు. అదే విధంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను సంపన్న, ఆరోగ్య, సంతోషకర (Wealth, Health, Happy) రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్య ఆశయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో పాల్గొన్న అందరితో రాజ్యాంగ పీఠిక పఠనం చేయించారు.కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది, ఐటి శాఖమాత్యులు నారా లోకేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. అలాగే మంత్రులు ఎస్. సవిత, పి. నారాయణ, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి కుమార్, బిసి జనార్థన రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అనంతరాము, ముఖ్య కార్యదర్శులు ముకేష్ కుమార్ మీనా, శశి భూషణ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు కార్యదర్శులు, శాఖాధిపతులు, సచివాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

The post ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/the-constitution-is-the-savior-of-democracy/feed/ 0
అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం https://www.prajabhoomi.com/deep-technology-iconic-building-in-amaravati/ https://www.prajabhoomi.com/deep-technology-iconic-building-in-amaravati/#respond Wed, 27 Nov 2024 05:49:38 +0000 https://www.prajabhoomi.com/?p=19768 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లుయువతలో నిత్యం నైపుణ్యం పెంచే కార్యక్రమంస్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష అమరావతి:-రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. నాడు […]

The post అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం appeared first on Praja Bhoomi.

]]>
2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు
యువతలో నిత్యం నైపుణ్యం పెంచే కార్యక్రమం
స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్
నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష

అమరావతి:-
రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. నాడు హైదరాబాద్‌లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.
2029 కల్లా 5 లక్షల వర్క్ స్టేషన్లు :-
నూతన ఐటీ పాలసీపై మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపైనా చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కో-వర్కింగ్ స్పేస్‌లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకివ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నూతన ఐటీ పాలసీపై ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఐఐటీలతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) అనుసంధానం :-రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు అనుసంధానంగా రాష్ట్రంలో ఐదు జోనల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర.. ఇలా ఐదు ప్రాంతాల్లో జోనల్‌హబ్‌లకు కేంద్రంగా అమరావతిలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ పనిచేయాలని చెప్పారు. 5 జోనల్ హబ్‌లకు దేశంలోని 25 ఐఐటీలను అనుసంధానం చేయాలన్నారు. ప్రతి నెలా నూతన ఉద్యోగాల కల్పనే లక్ష్యం :-నెలకు రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని అన్నారు. పాలసీ ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్లు కూడా వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తో రాష్ట్రంలో ఎంతమంది వర్క్ ఫ్రం హోం కింద పనిచేస్తున్నారో మదింపు చేయాలన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వర్క్ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టత వస్తుందన్నారు. వర్క్ స్టేషన్లకు వచ్చి పని చేసుకునే వారికి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా స్కిల్ అప్‌గ్రేడ్ చేయాలన్నారు. గ్రామాల్లో నాలెడ్జ్ ఉన్న యువత మెండుగా ఉన్నారని, కానీ సరైన స్కిల్ లేకపోవడంతో రాణించలేకపోతున్నారని, ఆ మేరకు వారిలో నైపుణ్యం పెంపొందించాల్సి ఉందన్నారు. డెవలపర్లకు కేటగిరీల వారీగా రాయితీలు :-ఐటీ సంస్థల కోసం మౌలిక వసతులు కల్పించే డెవలపర్లకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. కో వర్కింగ్ స్పేస్‌లు, నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌లు, ఐటీ క్యాంపస్‌లకు వాటి సీట్ల సామర్ధ్యం, కార్యాలయ సముదాయం విస్తీర్ణానికి అనుగుణంగా సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కో వర్కింగ్ స్పేస్‌కు సబ్సిడీ పొందాలంటే కనీసం 100 సీట్ల సామర్ఢ్యం కానీ, 10 వేల చదరపు అడుగుల కార్యాలయ సముదాయం ఉండాలి. అలాగే నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌కు పది సీట్ల సామర్ధ్యం కానీ, వెయ్యి చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తప్పనిసరి. ఐటీ క్యాంపస్‌కు వచ్చేసరికి 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రూ. 30 కోట్ల టర్నోవర్ కానీ కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా తుది ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

The post అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/deep-technology-iconic-building-in-amaravati/feed/ 0
ఆత్మీయత పెరిగితేనే అనేక లాభాలు.. https://www.prajabhoomi.com/there-are-many-benefits-if-intimacy-increases/ https://www.prajabhoomi.com/there-are-many-benefits-if-intimacy-increases/#respond Tue, 26 Nov 2024 10:40:30 +0000 https://www.prajabhoomi.com/?p=19765 చిన్న పత్రికలపై ఉన్న చిన్న చూపు దూరం కావాలి..ఎడిటర్ ల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి..మన సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం..భవిష్యత్ కార్యాచరణ కు సిద్ధం కండి..మీ అన్ని సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా..అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేక పోయా ..మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బోండా ఉమా…చిన్న పత్రికల సత్తా చాటుదాం..పత్రిక ల సత్తా ఏమిటో చుపిద్దాం..నిజమైన సమాచారాన్ని చేర వేసేది చిన్న పత్రికలు..ఘనంగా ఏడిటర్ ల ఆత్మీయ సమ్మేళనం..అలరించిన సంగీత విభావరి..అట్టహాసంగా హాజరైన […]

The post ఆత్మీయత పెరిగితేనే అనేక లాభాలు.. appeared first on Praja Bhoomi.

]]>
చిన్న పత్రికలపై ఉన్న చిన్న చూపు దూరం కావాలి..
ఎడిటర్ ల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి..
మన సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం..
భవిష్యత్ కార్యాచరణ కు సిద్ధం కండి..
మీ అన్ని సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా..
అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేక పోయా ..
మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బోండా ఉమా…
చిన్న పత్రికల సత్తా చాటుదాం..
పత్రిక ల సత్తా ఏమిటో చుపిద్దాం..
నిజమైన సమాచారాన్ని చేర వేసేది చిన్న పత్రికలు..
ఘనంగా ఏడిటర్ ల ఆత్మీయ సమ్మేళనం..
అలరించిన సంగీత విభావరి..
అట్టహాసంగా హాజరైన ఆత్మీయ ఎడిటర్ లు

( విజయవాడ)
అందరు ఎడిటర్ లు ఆత్మీయతతో అడుగులు వేస్తేనే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతామని ఆంద్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం అధ్యక్షుడు కూర్మా ప్రసాద్ బాబు అన్నారు.ఆదివారం విజయవాడ గాంధీనగర్ వెలిగండ్ల హనుమంతరాయ గ్రంధాలయంలో ఆంద్రప్రదేశ్ లోని అన్ని దిన వార మాస పక్ష పత్రికల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రజాభూమి దినపత్రిక ఎడిటర్ అంకిరెడ్డి పల్లె రామమోహన్ రెడ్డి సభాధ్యక్షత బాధ్యత వ్యవహారించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మెగావైద్య శిబిరాన్ని డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ శిబిరాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ బి ఆశయ్య హాజరై పత్రికా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే అన్ని ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. పత్రిక లంటేనే ప్రజల సమస్యలు ఎత్తి చూపి అధికారులుకు చేరవేసేందుకు ఎంతో కృషి చేస్తారని కితాబిచ్చారు.ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఇంతమంది ని ఇలా ఓకే చోట చూడటం అనేది సాధారణ విషయం కాదన్నారు.ఇలాంటి కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యం చేసి చక్కటి వాతావరణం లో ఆత్మీయులు మధ్య ఉండటం కూడా ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నారు.ఓ వైపు సంగీతాన్ని కూడా ఏర్పాటు చేసి కనువిందు చేసి అందులో తనని కూడా పాటలు పాడేలా చేసిన సంపాదక వర్గానికి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మహాగణపతి పాటను పాడి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజా భూమి క్రైం ప్రతినిధి, సింధు ఈవెంట్స్ మరియు ఎంటర్టైన్మెంట్ అధినేత కృష్ణ సింధు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమములో చక్కని పాటలు పాడి అందరని ఆశ్చర్యపరిచారు ఆశయ్య.ఇక సభాధ్యక్షుడు రామమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన సభను ఉద్దేశించి పత్రికా సంపాదకుల సంఘం అధ్యక్షుడు కోస్తాప్రభ ఎడిటర్ కూర్మా ప్రసాద్ బాబు మాట్లాడుతూ చిన్న పత్రికలంటే చిన్న చూపు ఉందని ఆ విధానానికి స్వస్తి పలికేందుకు అందరూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే గత ప్రభుత్వం పత్రిక ల పై జులుం ప్రదర్శన చేసి పత్రికా రంగం కుదేలు అయ్యేలా చేసిందని కేవలం మనలో ఐక్యత లేకపోకడమే కారణమన్నారు. సీనియర్ సంపాదకులు వీర్ల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ అందరము ఐక మత్యముతో ముందుకు సాగుదామని అప్పుడే అన్ని సాధించు కోవచ్చని ఆయన అన్నారు. సభాధ్యక్షుడు ప్రజాభూమి ఎడిటర్ అంకిరెడ్డిపల్లె రామమోహన్ రెడ్డి మాట్లాడుతు దిగజారి పోయిన ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా వ్యవస్థ మరింత అట్టడుగు తొక్కివేయ బడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజానికి మూలమైన వ్యవస్థలలో నాలుగో వ్యవస్థ ఉన్నా పత్రికా వ్యవస్థ మిగిలిన మూడు వ్యవస్థ లకు సూచనలు చేసే స్థాయి నుంచి ఆ మూడు వ్యవస్థ లతోనే ముచ్చెమటలు పట్టేలా తయారు అయ్యిందని తెలిపారు.కేవలం మనలో ఉన్న అంతర్గత లోపాలు కలహాలు కారణం ఈ రోజు చిన్న పత్రికలంటే చిన్న చూపు ఉందని ఆ భావన తొలగి పోయేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.గ్రేటర్ దినపత్రిక ఎడిటర్ కాకుమాను వేణు మాట్లాడుతూ రక్షణ విషయంలో కానీ ఇతర అంశాల విషయంలో వివిక్షకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పలువురు పత్రికా సంపాదకులు తమ అమూల్యమైన సందేశం అందజేసి ఆత్మీయత చాటారు. అనేక కార్యక్రమాలు ఉన్నందున హజరు కాలేక పోతున్నా… మంత్రి కొలుసు పార్థసారథి.. కార్తీక వన సమరాధనలు అనేకం ఉండటం ఎవరి ఆహ్వానాన్ని కాదనలేని పరిస్థితి ఏర్పడిందని అందువల్ల ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొన లేక పోయానని సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఆయన్ను కలిసిన ఏపిఎస్ ఎస్ నాయకులతో అన్నారు.అయినప్పటికీ అన్ని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పరిస్కారం చూపేందు కు కృషిచేస్తానని ఆయన అన్నారు. ఈసందర్భంగా ఈ ఆత్మీయ సమావేశంలో అందరి ఐక్యత చూపించి చిన్న పత్రిక ల సత్తా ఏమిటో చుపిద్దామని సంఘం నిర్ణయం తీసుకుంది.అలరించిన సంగీత విభావరి…సింధు ఈవెంట్స్ మరియు ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఎంతో ఆహ్లదకరం సాగింది. గాయకుడు మంచి సంగీతాన్ని అందిస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఆశయ్య ,పాత్రికేయుడు గాయకుడు వలపర్ల సురేష్, మరో గాయకుడు లక్ష్మణ్ నాయక్, రాజా లతో ,పాత్రికేయురాలు గాయని సింధు చక్కని సంగీతాన్ని అందించినందుకు అభినందనలు తెలిపారు ఎపిఎస్ ఎస్ సంగం. ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.1 ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు పెద్ద పత్రికలకు ఇచ్చే ప్రకటనలలో కనీసం 30 శాతం అయినా చిన్న పత్రికలకు, ఎంప్యానల్ సబంధం లేకుండా యాడ్స్ ఇవ్వాలి.2 స్థానిక పత్రికలకు ప్రింటింగ్ అవసరాల నిమిత్తం 60 శాతం సబ్సిడితో రుణసదుపాయం.3. చిన్న, మధ్య తరహా పరిశ్రమల మాదిరి ప్రాంతీయ పత్రికల మనుగడ కోసం రాజధాని, మరియు అన్ని జిల్లా కేంద్రాలలో పత్రికల కార్యాలయాలు ప్రింటింగ్ యూనిట్ల స్థాపనకు సబ్సిడితో కూడిన భూ కేటాయింపు చేసి రుణాలు మంజూరు చేయాలి.4 ప్రాంతీయ పత్రికల ఎడిటర్లపై జరిగే దాడులకు నివారించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలి. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.5 50 సంవత్సరాలు నిండిన సంపాదకులకు సీనియార్టి ప్రకారం నెలకు 15 వేలు పించన్ ఇవ్వాలి.6. అక్రిడిటేషన్ కమిటీ, దాడుల నివారణ కమిటీల్లో ఎపిఎస్ఎస్కు రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్థానం కల్పించాలి.7. ప్రాంతీయ పత్రికల ఎడిటర్లకు, పబ్లిషర్స్కు ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు వాహన కొనుగోల్లులో సబ్సిడిపై రుణాలు ఇప్పించాలి..8 రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాంతీయ పత్రికల సంపాదకులతో పాటుగా జర్నలిస్టులందరికి ఎన్టీఆర్ జర్నలిస్టు కాలనీగా నామకరణం చేసి ప్లాట్లు మంజూరు చేయాలి.9 టోల్ గేట్లు దగ్గర అక్రిటిడేట్ జర్నలిస్టుల, ఎడిటర్ల వాహనాలకు ఉచిత రాకపోకల సదుపాయం కల్పించాలి.10. రాజధాని ప్రాంతంలో ఉన్న ఎడిటర్లకు ఎన్టీఆర్ మీడియాటౌన్ షిప్ను ఏర్పాటుచేసి, అందులో ప్రింటింగ్ యూనిట్ల స్థాపనకు మరియు ఇండ్ల నిర్మాణాలకు స్థలాలను కేటాయించాలి.11 అమరావతి ప్రాంతంలో ఎడిటర్ల అసోసియేషన్కు స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.12. ప్రాంతీయ పత్రిక ఎడిటర్ల పిల్లలకు కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యతో పాటు విదేశీవిద్యను అభ్యసించేందుకు కూడా రాయితీ కల్పించాలి.13. అసెంబ్లీ సమావేశాలకు పత్రికా సంపాదకులకు లాబీ, గ్యాలరీలలో శాశ్వత పాసులు ఇప్పించగలరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు, పత్రికా సంపాదకులకు అందరికి కూడా అన్ని ఏ.సి. బస్సులలో కూడా రాయితీతో కూడిన పాసులు ఇప్పించగలరు.14. డిక్లరేషన్ ప్రాంతంతో సంబంధం లేకుండా ఉమ్మడి అన్ని జిల్లాల్లో కనీసం రెండుకు తగ్గకుండా అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి.15. ప్రభుత్వ కార్యాక్రమాలు జరిగే సమయంలో పాసులు మంజూరులో చిన్నపత్రికలను గుర్తించాలి.16. స్థానిక పత్రికలకు ప్రింటింగ్ అవసరాల నిమిత్తం 60 శాతం సబ్సిడితో రుణసదుపాయం కల్పించాలి.17. ఎపిఎస్ఎస్కు అక్రిడిటేషన్ కమిటీలో స్థానం కల్పించాలి…18. గత టిడిపి ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పెంచలయ్య గారు చేసిన సమయంలో చిన్నపత్రికకు నెలకు 5 వేల రూపాయలు ఇవ్వాలని జీవో విడుదల చేశారు. గత జీవోను పునరుద్దరించాలి. ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు ధరలు కూడా అధికంగా ఉండటంతో దానిని 50 వేల రూపాయలకు చూయాలి.

The post ఆత్మీయత పెరిగితేనే అనేక లాభాలు.. appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/there-are-many-benefits-if-intimacy-increases/feed/ 0
మోపూరి భైరవేశ్వరుని సన్నిధిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి కుటుంబ సభ్యులు https://www.prajabhoomi.com/mlc-bhumireddys-family-members-in-the-presence-of-mopuri-bhairaveshwara/ https://www.prajabhoomi.com/mlc-bhumireddys-family-members-in-the-presence-of-mopuri-bhairaveshwara/#respond Mon, 25 Nov 2024 10:55:48 +0000 https://www.prajabhoomi.com/?p=19760 బండలాగుడుపోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ పులివెందుల(వేముల)కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని, పులివెందుల నియోజకవర్గం వేముల మండలం, కొండ్రెడ్డి పల్లె గ్రామంలో వెలసిన శ్రీ మోపూరి భైరవే శ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి స్వామివారినిదర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు కుటుంబ సభ్యులతో పూజారి చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడు తూ శ్రీ మోపురి బైరవేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ […]

The post మోపూరి భైరవేశ్వరుని సన్నిధిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి కుటుంబ సభ్యులు appeared first on Praja Bhoomi.

]]>
బండలాగుడుపోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ

పులివెందుల(వేముల)
కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని, పులివెందుల నియోజకవర్గం వేముల మండలం, కొండ్రెడ్డి పల్లె గ్రామంలో వెలసిన శ్రీ మోపూరి భైరవే శ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి స్వామివారినిదర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు కుటుంబ సభ్యులతో పూజారి చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడు తూ శ్రీ మోపురి బైరవేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి, రైతుల సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.అంతకు ముందుగా ఆలయ కమిటీ చైర్మన్ ఓబుల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి లు ఆయనకు ఘన స్వాగతం పలికి దుష్యాలతో పూలహారాలతో సత్కరించారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని వారికి తెలియజేశారు. అనంతరం ఆయన బండలాగుడు పోటీలను ప్రారం భించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

The post మోపూరి భైరవేశ్వరుని సన్నిధిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి కుటుంబ సభ్యులు appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/mlc-bhumireddys-family-members-in-the-presence-of-mopuri-bhairaveshwara/feed/ 0
యనమల దివ్య గెలుపును ఆకాంక్షించిన శ్రీ వెంకట దుర్గా కోలాట బృందం https://www.prajabhoomi.com/sri-venkata-durga-kolata-team-wishes-yanamala-divya-a-divine-victory/ https://www.prajabhoomi.com/sri-venkata-durga-kolata-team-wishes-yanamala-divya-a-divine-victory/#respond Mon, 25 Nov 2024 10:54:00 +0000 https://www.prajabhoomi.com/?p=19756 కోటనందూరు .కోటనందూరు మండలం అల్లిపూడి శ్రీవెంకట దుర్గా మహిళా కోలాట బృందం ఏర్పాటు చేసిన మహా వనసమారాధనను తెలుగు దేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ పసగడుగుల రాంబాబు మంగతాయారు దంపతులు ప్రారంభించారు.యనమల దివ్యగెలుపు నకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని పెద్దాయన యనమలకు మాటిచ్చినకోలాట బృందం సభ్యులు ఆమె నుదుటన విజయ తిలకం దిద్ది గెలుపులో ఉడతాభక్తిగా పనిచేసారు.యనమల దివ్య గెలుపును పురష్కరించుకుని కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని అల్లిపూడి గ్రామంలోఅట్టహాసంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన […]

The post యనమల దివ్య గెలుపును ఆకాంక్షించిన శ్రీ వెంకట దుర్గా కోలాట బృందం appeared first on Praja Bhoomi.

]]>
కోటనందూరు

.కోటనందూరు మండలం అల్లిపూడి శ్రీవెంకట దుర్గా మహిళా కోలాట బృందం ఏర్పాటు చేసిన మహా వనసమారాధనను తెలుగు దేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ పసగడుగుల రాంబాబు మంగతాయారు దంపతులు ప్రారంభించారు.యనమల దివ్య
గెలుపు నకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని పెద్దాయన యనమలకు మాటిచ్చిన
కోలాట బృందం సభ్యులు ఆమె నుదుటన విజయ తిలకం దిద్ది గెలుపులో ఉడతాభక్తిగా పనిచేసారు.యనమల దివ్య గెలుపును పురష్కరించుకుని కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని అల్లిపూడి గ్రామంలో
అట్టహాసంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ మీడియా కోఆర్డినేటర్ పసగడుగుల రాంబాబు మంగతాయారు దంపతులు మహాఅన్న
సమారాధనను ప్రారంభించారు గ్రామపెద్దలు పురజనులు భారీ సంఖ్యలో తరలివచ్చి అన్న తీర్ధ ప్రసాదాలు స్వీకరించారులాలం బాబులు,లాలం రమణ,అంకంరెడ్డి గొల్ల,బత్తి శ్రీను,లాలం‌దేముళ్ళు,చింతకాయల సాయి,కాళ్ల ప్రసాద్,పారుపల్లి నారాయణమ్మ, పారుపల్లి గంగ, గోదారి సచ్చు,కాళ్ళ లక్ష్మీ,ప్రభావతి,చింతకాయల చిన్నారి,కాళ్ల రత్నం,అంకంరెడ్డి రాజు చింతకాయల సత్యవతి,గైరమ్మ,బోలెం లీలాదేవి,,డి మౌళిక,ఆర్ రాకేష్ ,కాపారపు రాజేశ్వరి, బి.పావని, పర్యవేక్షణలో పసగడుగుల రాంబాబు మంగతాయారు దంపతుల
ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది

The post యనమల దివ్య గెలుపును ఆకాంక్షించిన శ్రీ వెంకట దుర్గా కోలాట బృందం appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/sri-venkata-durga-kolata-team-wishes-yanamala-divya-a-divine-victory/feed/ 0