Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలురాష్ట్ర తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులు

రాష్ట్ర తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులు

జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

అనంతపురము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఆంధ్ర రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14వ తేదీన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని పెద్దపాడులో ఒక దళిత కుటుంబంలో జన్మించారన్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందని, ఆయన సేవలు ఎంతో గొప్పవని అన్నారు. నిజాయితీగా ప్రజలకు సేవలందించడంతో పాటు ప్రజాహిత పాలన కోసం అనేక సంస్కరణలు అమలుచేసి అందరి మన్ననలను పొందారన్నారు. సమాజానికి, వెనుకబడిన వర్గాలకు ఎంతో సేవ చేశారని, ప్రతి ఒక్కరు ఆయన బాటలో నడవాలని సూచించారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సాధారణ దళిత కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. దామోదరం సంజీవయ్య జాతికి చేసిన సేవలను గుర్తించి 2008లో విశాఖపట్నంలో స్థాపితమైన ఆంధ్రప్రదేశ్ నేషనల్ యూనివర్సిటీకి వీరి జ్ఞాపకార్థం 2012 లో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ గా పేరు మార్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, డీఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, మెప్మా పిడి విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం స్టేషన్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ ఏడీ రామసుబ్బారెడ్డి, మార్కెటింగ్ ఏడీ చౌదరి, క్రిస్టియన్ మైనారిటీ అధికారి మధుసూదన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article