ద్వారకాతిరుమల
అనేక సంవత్సరాల నుండి స్వామివారి ఉత్సవాలు గ్రామస్తులు సహకారంతో ముందుకు నడిపిస్తున్నామని ఓబిలి శెట్టి గోపాలకృష్ణమూర్తి అన్నారు .
మండలంలోని గుండుగొలను కుంట గ్రామంలో ఏం చేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 19వ వార్షికోత్సవ షష్టి కళ్యాణ మహోత్సవములు వైభవముగా నిర్వహించారు. దానిలో భాగంగా ఉదయం రుచికరమైన పిండి వంటకాలు తో సుమారు వెయ్యి మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి, చిలుకూరి ధర్మారావు, మధ్యాహ్నపు దుర్గారావు, నారాయణస్వామి, బోట్ల సాయి, అద్దంకి భరత్ కుమార్, కానుమూరు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.