Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్బొప్పాయి తో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకోకూడదు

బొప్పాయి తో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకోకూడదు

బొప్పాయి.. అన్ని పోషకాలు కలగలిగిన పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయిలో ప్రోటీన్, మినరల్స్, విటమిన్, ఫైబర్, ఆంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. కాబట్టే ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను మనకు కలిగిస్తుంది. కానీ ఈ బొప్పాయి తో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను పొరపాటున కూడా తీసుకోకూడదు. పొరపాటున తీసుకున్నామో.. లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి.. మరి బొప్పాయితో కలిపి తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కాఫీ , టీ , పాలు : బొప్పాయితో పాటుగా కొన్ని ఆహార పదార్థాలను పొరపాటున కూడా తీసుకోకూడదు. వాటిలో కాఫీ , టీ, పాలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా బొప్పాయి తిన్న తర్వాత ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి బొప్పాయి తిన్న వెంటనే వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగకండి. ఇలా తాగడం వల్ల కొంతమందిలో కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
పెరుగు: బొప్పాయి , పెరుగు రెండూ ఒకేసారి తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బొప్పాయి , పెరుగు కాంబినేషన్ తినడం వల్ల బొప్పాయి వల్ల శరీరంలో వేడి పెరిగితే, పెరుగు వల్ల ఒంటికి చలువ చేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల భరించలేని తలనొప్పి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సిట్రస్ జాతి పండ్లు..బొప్పాయి తోపాటు నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు కూడా తీసుకోకూడదు. ఒకవేళ కలిపి తీసుకుంటే ఎసిడిటీ ,గుండెల్లో మంట ,కడుపునొప్పి, విరోచనాలు వంటివి వస్తాయి. బొప్పాయితో స్పైసీ ఫుడ్స్ కూడా కలిపి తీసుకోకూడదు. బొప్పాయితో స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. అలాగే జీర్ణాశయాంతర సమస్యలు పెరుగుతాయి.. ప్రోటీన్ ను విచ్చినం చేసే ఎంజైమ్ ను కలిగి ఉంటుంది బొప్పాయి.. అందుకే బొప్పాయితో పాటు చేపలు, మాంసం, గుడ్లు తదితర ప్రోటీన్ రిచ్ ఫుడ్లను తీసుకోకూడదు. ఇక ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article