Friday, November 29, 2024

Creating liberating content

రాజకీయాలునాలుగో స్తంభమా నీ పాత్రేమిటీ..

నాలుగో స్తంభమా నీ పాత్రేమిటీ..

పార్టీల కండువా కప్పుకోవడమే తక్కువ…
దిగజారి బ్రతుకుతున్నావా…
లేక దిగజారిపోయావ..
నీ ఉనికి దేనికోసం….
ప్రజాస్వామ్య పరిరక్షణ కాదా
నీవున్న పరిస్థితుల్లో నీతి వర్ణించే స్థాయి ఉందా
నీకే నీతి లేక పోతే నేతల నీతిపై నేతి మాటలేల..
ఎందుకీ నాటకాలు… ఎవరికోసం…
మనం చేస్తున్నది ప్రజరక్షనా… ప్రజాకక్ష్యనా…
ఓ సమాజమా ఆలోచించు…

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
దేశ భౌగోళిక నిర్మాణంలో నాలుగో స్తంభాలది కీలక పాత్ర.ఈ నాలుగు స్తంభాలలో ఏ స్తంభం వైఫల్యం చెందినా ,పెడదోరణి పట్టినా అయ్యో నాలుగో స్తంభం చూస్తుంది రా బాబు మన బండారాలు బైట పడితే బ్రతుకు ఛిద్రం అవుతుందనే భయం వెన్నులో పుట్టేది.అదే జర్నలిజం. .అందుకే ఏ వ్యవస్థ గాడి తప్పినా ప్రశ్నిస్తుంది.. గొంతెత్తి మొత్తుకొంటోంది.. ప్రజలను చైతన్య పరుస్తుంది.ఇది ఒకనాటి పరిస్థితి. వర్తమాన కాలంలో నాలుగో స్తంభం నవ్వుల పాలవుతుంది.విలువలు దిగజారి పోతున్నాయి.. పోయేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడాలన్న, ప్రజలకు మంచి చేయకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించి తరువాతి కాలంలో ప్రభుత్వాల మార్పు కూడా చేసే స్థాయిలో నాలుగో స్తంభమైన జర్నలిజంకు ఉండేది. పెరిగిన పరిజ్ఞానం సాంకేతికత జోడించుకుని ప్రసార మాద్యమాలు పెరిగాయి. పెరిగిన ప్రసార మాధ్యమాలు ప్రజలను ఏ వైపు నడిపిస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి నేడు నెలకొన్నది.అందుకే ప్రజావ్యతిరేకతను గాని,ప్రజాచైతన్యాన్ని గాని గుర్తించ లేని గుడ్డి వ్యవస్థ గా గాడి దప్పి గాడిద చాకిరి చేయడానికి సిద్దమైనది.
అసలు ఈ భావదారిద్ర్యం రాష్ట్ర విభజన తరువాత మరింత ఎక్కువగా పెరిగి పోయింది.కులానికి ..వర్గానికి ఒక మీడియాగా విడిపోయి జెండా అజెండా లు మరిచి పార్టీల ఎజెండా ను భుజాన వేసుకుని పైకి మాత్రమే తాము ప్రజా సమస్యల కోసం పరితపిస్తున్నామని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ ప్రజాజీవనాన్ని ఓ రకంగా అస్తవ్యస్తం చేస్తున్నాయి.ఇది ముమ్మాటికీ నిజం దీనిని ఎవడు కాదని నిరూపించే దమ్ము లేదు.అందుకే ఈనాటి ఎన్నికల ఫలితాలపై నిక్కచ్చిగా నిగ్గుతేల్చలేక పోతున్నారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థ కు విఘాతం కలిగిస్తుంటే ప్రసార మాధ్యమాలు పెను ప్రమాదం గా మారిన నేపధ్యంలో కట్టడి చేయలేని సోషల్ మీడియాతో ప్రజలు కూడా తమ అభిమతాన్ని స్పష్టంగా తెలియపరచక కుండా మౌనం దాల్చుతున్నారు.దీనితో సర్వే సంస్థల పేరుతో దేశ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేస్తామని గొప్పలు చెప్పుకునే పరిస్థితి దాపురించింది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. గతంలో ఎన్నికల ఫలితాలు ఓట్ల శాతాన్ని బట్టే అప్పటికప్పుడే ఎవరి భవితవ్యం ఏమిటో చెప్పేసే వారు. కానీ నేడు ఏ ఒక్కరూ ఓటరు శాతం ఎందుకు పెరిగింది ప్రభుత్వ వ్యతిరేకత నా ప్రజాసంక్షేమమా అన్నది నిస్పష్టంగా తేల్చుకోలేకపోతున్నారు.ఒకప్పుడు మీడియా అంటే చంద్రబాబు … చంద్రబాబు అంటే మీడియా అన్న ధోరణి నుంచి ఏనాడు మీడియాపై కస్సుబుస్సులాడని వారు కూడా నేడు ఇది ఆ మీడియా నా.. ఓహో ఈ మీడియా అదేనా అన్న ధోరణికి వచ్చారంటే నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్న సూక్తి ఆయనకు వర్తిస్తుంది.
కారణం కొంత మంది అపర మేధావులమని చెప్పగా చెవిని అందించడమే పెద్దతప్పు అయింది.అందుకేనేమో వైఎస్ జగన్ తొలినాళ్ళ నుంచి తెలుగు మీడియాలో ఆయన సొంత మీడియా సాక్షి మినహాయించి మిగిలిన మీడియా కు అరకొర తప్ప పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేకుండా పోయాయి.ఇలాంటి పరిస్థితుల్లో నాలుగోస్తంభాన్ని నేటి సమాజం అంతగా ఆదరించలేక పోతున్నదనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికయినా ప్రజాస్వామ్య పరిరక్షణ లో ప్రధాన భూమిక పోషించాల్సిన మీడియా మేథో మథనం చేసి మార్పు దిశగా పయనించాలని మేధావులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article