జీలుగుమిల్లి:ఏపి షెడ్యూల్డ్ ఏరియాలో స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించి ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆదివాసీ నిరుద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ సూచించారు. శుక్రవారం మండలం లోని బర్రింకలపాడు పోలవరం శాసన సభ్యులు నివాసం లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కు ఆదివాసీ నిరుద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ బృందం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పాడేరు సభలో ప్రకటించిన హామీని తక్షణమే అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మెగా డి ఎస్ సి లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని అన్నారు.5వ షెడ్యూల్డ్ ఏరియాలో 100 శాతం రిజర్వేషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తున్న జి.ఓ నెంబర్ 3 పై సుప్రీంకోర్టు తీర్పుకు ప్రత్యామ్నాయంగా ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జనరల్ డిఎస్సీ నోటిఫికేషన్తో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన ఆభద్రత భావం,ఆందోళన కలిగిస్తోందన్నారు.గిరిజన గురకులం నిబంధనలకు విరుద్దంగా గిరిజన గురుకులం విద్యా సంస్థలలో వున్న ఖాళీ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొన్నారన్నారు.రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకు భద్రత, రక్షణ, పరిపాలన బాధ్యత గూర్చి స్పష్టంగా పేర్కొనబడిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఏ ఉత్తర్వులైనా 5వ షెడ్యూల్ క్లాజ్ (1)×2) ప్రకారం గవర్నర్,గిరిజన సలహా మండలి (టి.ఏ.సి) ఆమోదం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతంలో వున్న ఏకలవ్య, ఐసిడిఎస్, కెజిబివి, మెడికల్ కాలేజీతో పాటు విద్యాశాఖల్లో మైదాన ప్రాంతాల వారిని ఏజెన్సీ ప్రాంతంలో నియమించారని గుర్తు చేశారు.ప్రస్తుతంనాన్ షెడ్యూల్ పంచాయితీ కార్యదర్శులను కూడా ఏజెన్సీ ప్రాంతంలో నియమించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ప్రభుత్వాల చర్యలవలన ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు.1/70 చట్టం ప్రకారం స్థిర నివాసానికి అనుమతులు లేని వారు 2% శాతం మాత్రమే ఉన్న గిరిజనేతరు.అనంతరం పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్తానని ఏజెన్సీ 7గురు ఎమ్మెల్యే లతో చర్చించి ఆదివాసీ యువతకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ బృందంలో ఆదివాసీ నిరుద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తెల్లం రామకృష్ణ, కారం ధారయ్య, సరియం రామ్మోహన్, సోయం చంద్రరావు, దర్ముల రమేష్,తెల్లం దుర్గారావు,పోలోజు నాగేశ్వరావు,కారం భాస్కర్, బన్నే వినోద్, కట్టం నాగేశ్వరావు,మడివి దుర్గారావు,కుంజా నవీన్, బంధం అర్జున్, కె కిరణ్, ఈ భూషణం, టి బాబురావు, కె దావీదు, కట్టం ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.