అనుమతులు ఇచ్చింది రెసిడెన్షియల్..
అక్కడ కట్టింది కమర్షియల్…
గ్రౌండ్ ఫ్లోర్ లో షెట్టర్ వేస్తే గృహము అంటారా…
ఐరన్ షాపులో కాపురాలు ఉంటారా…
ఏమయ్యా గంధం ప్రసాద్ గారు ..
ఎంత గాడితప్పిన పాలన అయితే ఇంత అవినీతి ..
ఫిర్యాదు వస్తే అదనంగా చలనా కట్టిస్తావా…
మీ అవినీతికి అడ్డుకట్టవేసేవారు లేరనే కదా…
ఇంకో షెడ్ కు చలానా కట్టిస్తే సరిపోతుందా…
సిటీ ప్లానర్ చల్లగా దాచుకుంటున్నారా…
ఓహో మీ అవినీతి లో వాటాలు ఎవరెవరికి ఇస్తున్నారో ..
కమిషనర్ కూడా మీకు దాసోహం అంటున్నాడా…
మీ కాసుల సవ్వడికి కార్పొరేషన్ కాగడాల హారతి పడుతుంది గా..
మంత్రి గారు నిధుల్లేవ్ అన్నారుగా ..తిమింగాళాలు తింటుంటే ఎక్కడ వస్తాయ్…
మీరేమో 95 సీఎం అంటున్నారు…వీరేమో నేరుగా దోచుకుంటున్నారుగా…
చిన్న తప్పుకు డిడి సదరావుపై చిర్రెత్తి పోయారు గా.సీయం గారు..
ఇన్ని అక్రమాలు చేసినా కనపడలేదా..
విరమణ చెందుతున్నాడంట …విశ్రాంతి కావాలంట…
దోచుకున్నది దాచుకుంటే సరిపోతుంది గా…
ప్రజలే బలి పశువులు మరి…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
బెజవాడ కార్పొరేషన్ కథలు వింటుంటే ప్రజలు వాంతులు చేసుకుంటున్నారు ఈ అవినీతి కంపు భరించలేక.విరమణ దగ్గర పడి నా కూడా దోచుకోవడానికి ఏ మాత్రం వెనుకాడని టీపీఓ గంధం ప్రసాద్ చిత్రాలు చూస్తే హాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్ ను మించి ఉన్నాయి.అసలు రాజ్యాంగ సృష్టికర్త డా బీఆర్ అంబెడ్కర్ అయితే కార్పొరేషన్ చట్టాలు మాత్రం గంధం ప్రసాద్ రూపొందించారు.ఇప్పటికే నాలుగవ సారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు కూడా నా అనుభవం 40 ఏళ్ళు అంటారు కానీ ఆయనకి కూడా తెలియని అనుభవం ఈ గంధం ప్రసాద్ కి ఉందని ఒప్పుకోవాల్సిందే. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుందని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అన్నారు.సంపద ఎలా సృష్టించాలో ఆయన అంత మేధోమదనం చేయడం ఎందుకో ఈ గంధం ప్రసాద్ ఆయనకు సపోర్ట్ గా ఉన్న ఏసీపీ,డీసీపీ,సిటీ ప్లానర్ లను సలహాదారులుగా ఉంచుకుంటే ఖజానా ఎలా నింపుకోవాలో తెలియక పోయిన సొంత ఖజానా ఎలా నింపుకోవాలో చెబుతారని చెప్పాలనిపిస్తుంది.
ఇటీవల పురపాలక మంత్రి నారాయణ ప్రెస్ మీట్ లో కార్పొరేషన్లో స్లిట్ తీయడానికి నిధులు లేవంటే ఆ నిదులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఎందుకు ఇలాంటి అవినీతి అధికారులు సక్రమంగా కార్పొరేషన్ కు రావాల్సిన నిధులు వీరి కక్కుర్తి తో కాజేస్తున్నారు.ఇలా ఈ అవినీతి తిమింగాళాల కథలు ఒక్కొక్కటిగా చూస్తే కళ్ళు చేదిరి పోతాయి భవానిపురం 43 డివిజన్ లో ఐరన్ యార్డ్ ఉంది. వందల కోట్ల రూపాయల వ్యాపారులు జరుగుతుంటాయి.అయితే ఈ యార్డ్ లో కమర్ల పూడి కాంతి రేఖ అనే యజమాని నిర్మాణం చేపట్టారు. జనవరి 2024 సంవత్సరంలో అనుమతి కోసం దరకాస్తూ చేస్తే ఏప్రిల్ లో అనుమతులు ఇచ్చారు.అయితే అక్కడ నిర్మాణం పూర్తి దశకు చేరింది.రెసిడెన్షియల్ కోసం మాత్రమే అని కమర్షియల్ అని ఎక్కడ లేదు. కానీ అక్కడ జరుగుతున్న తీరు చూస్తే ఆచ్చర్యము కలిగిస్తుంది. ఇప్పుడేమో ఆ విషయం బైటికి రావడంతో చలానా కట్టిస్తామంటూ బుకాయింపు మాటలు చెప్పుకు వస్తున్నారు.అదే నిర్మాణం ఇంకొంచెం వెనుకకు వస్తే అక్కడ పరిశీలన చేస్తే ఈ అవినీతి అధికారుల తీరు అర్ధమవుతుంది. మరి ఇలాంటి అవినీతి తిమింగాళాలు ఉంటే కార్పొరేషన్ లో స్లిట్ కాదు చీపురులు కొనడానికి కూడా నిధులు లేక ప్రజలపై పన్నుల భారం వేయక తప్పదు మరి.చూద్దాం ఏమి చేస్తారో మరి.