దర్గా స్థలాల్లో దర్జాగా నిర్మాణాలకు అనుమతులు
రిటైర్డ్ కాబోతున్నాడట ఐటమ్స్ వద్దట..
తప్పులు చేసి నా పని అయిపోయిందంటే సరిపోతుందా
ఈ గంధం ప్రసాద్ కు దందాల రాయుడు సపోర్ట్…
ఆ సపొర్ట్ ఎందుకో లోగుట్టు పెరుమాళ్లకెరుక…
రాష్ట్ర ప్రభుత్వమే అక్రమాలు జరిగాయని నిర్థారిస్తే ..
ఈ కేసుల వీరుడు నకిలీ రాతలు రాయడం…
ప్రజల సొమ్ము ప్రత్యక్షంగా పరోక్షంగా దోచుకోవచ్చా..
అటు జీతాలు ఇటు లంచాలు తీసుకున్నా నేరం కాదుగా…
నీ అవినీతి రాతల వలే అక్రమ కట్టడాలు కట్టుకోవచ్చా…
గంధం ప్రసాద్ అవినీతిలో వాటా ఉందేమో ..ఉండచ్చు కూడా ..
ఓ వైపు కార్పోరేటర్లతో కుమ్మక్కై కార్పొరేషన్ కు గండి కొట్టినా
కానరాకపోయా ఈ నకిలీ రాత గాడికి…
అక్రమ కట్టడాలుకు అనుమతులు ఇచ్చింది తప్పుకాకపోయే..
అవినీతి అధికారి అక్రమాలు వెల్లడి చేస్తే తప్పాయే..
ఎలా రా నాయనా నీ జర్నలిజం… యర్నలిజం ..
కుక్క బిస్కెట్ తిని విశ్వాసం చూపిస్తున్నావు…
నీకింద ఉన్న నలుపు చూసుకో రా అయ్యా…
గంధం ప్రసాద్ గతమంతా అవినీతే అని ఆ అధికారులే తేలుస్తారు…
నీ గతమేమిటో ఆలోచించు …
నీవు గంధం ప్రసాద్ ను కాపాడలేవు కానీ…
నీ పై నమోదు అవుతున్న కేసులు చూసుకో….
నీది జర్నలిజం ..నీవు జర్నలిస్టువు…హా హత విధి….
ఇందుకే గా ప్రజాస్వామ్యం ఇలా అవుతోంది….
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
కాసులకోసం కక్కుర్తి పడి కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టి తన ఆదాయాన్ని పెంచుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిన మహాఘనుడు టీపీఓ గంధం ప్రసాద్ అని చెప్పాలా వద్దా అంటే ఖచ్చితంగా నొక్కి మరి చెప్పిన తపు లేదంటున్నారు పురపాలక ప్రజలు. ప్రభుత్వాలు మారిన కార్పొరేషన్ లు మారిన ఈ అధికారి తీరు మాత్రం ఒకటే తీరు అదే అక్రమము.రాష్ట్రంలో మేజర్ కార్పొరేషన్ విశాఖ లో అక్రమాలు బోలెడు చేసి బుట్ట నింపుకుని ఉంటే విజిలెన్స్ వారి విచారణ లో అయన ఉద్యోగ కాలం మంతా అక్రమ కట్టడాలను ప్రోత్సహించి కార్పొరేసన్ కు చిల్లు వేయడమే అన్నది తేట తెల్లమై నోటీసులు ఇచ్చారు.సంజాయిషీ ఇచ్చిన ఇంకా శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది.
లంచం అడిగితే జైల్లో కూడా వేయడానికి సిద్ధం,లంచాలు అడగాలంటే బయపడాలని పదే పదే ఇలాంటి అవినీతి అధికారులను మార్చాలి, ప్రజలకు మంచిచేస్తున్నా అని పగలు రాత్రి కలలు కన్న అనాటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 2021 లో ఈ అవినీతి అధికారికి విజిలెన్స్ నోటీసులు ఇచ్చింది.లంచాలకు తావివ్వని చెప్పిన జగన్ కూడా ఇలాంటి అవినీతి అధికారులను ఏమి పీకలేక పోయారు.సీన్ కట్ చేస్తే విశాఖ పూర్తిగా దోచుకుని కొత్తకొడలు అత్తగారింటికి వెళ్లి వచ్చినంత స్పీడుగా విజయవాడ కార్పొరేషన్ కు బదిలీ పై వచ్చారు. మరి ఇక్కడి నగర పాలక సంస్థ అధికారులకు ఇంత కంటే మంచి అధికారి దొరకలేదో లేక ఈయన గారి అవినీతి లో ఉన్నతాధికారులు కూడా వాటాలు ఉన్నాయో తెలియదు ఈయనకు బెజవాడ కార్పొరేషన్ లో అత్యదిక వార్డులు 23 మాత్రమే అప్పగించారు.ఇంకా అప్పగించి న బాధ్యతలు తీసుకోవడానికి గంధం ప్రసాద్ అయితే వెనుకడుగు వేసే వారు కాదు సుమా ఎందుకంటే ఆయనకు బెజవాడ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాదారులంటే అంత ప్రేమ జాలి దయ కలిగిన వాడు కాబట్టి. కార్పొరేషన్ కు చలానాలు కట్టిన ఏమి ఉపయోగం ప్రజలు పిచ్చివారు ఏది చేసినా బరిస్తారు వారే టాక్స్ లు కట్టి అభివృద్ధి కి పాటు పడి చస్తారు.అది సరిపోతుంది లేదంటే వారి చావు వారే చస్తారు.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుని నాలుగు కోట్లు వెనుకేసుకుంటే పోయేదేముంది అనుకున్నా డెమో అక్రమ నిర్మాణాలు కు నేనున్నాను నేను విన్నాను,నేను చూసాను అని నన్ను చూడండి అని లెక్కలు సరిచేసుకున్నాడు చక్కగా. ఈ లెక్కల్లో కొన్ని కుక్క బిస్కెట్లు జర్నలిజం లోకి వచ్చిన కొత్త బిక్షగాల్లకు వేసి ఈయన వెనుక కాపలాగా ఉంచుకున్నాడు.
అందుకే కాబోలు గంధం ప్రసాద్ విసిరిన కుక్క బిస్కెట్లు రుచిమరిగి ఆయన రిటైర్డ్ అవుతున్నాడట,ఆయనది అది ఇది,నాది కూడా అది ఇది అని రాత రాయడం రాదు రాసిన రాతల్లో బండ భూతులతో ఒక కర పత్రం వదిలాడు గ్రూప్ లలో.త్వరలో అన్నీ అని.ఇలా త్వరలో త్వరలో అనే భవాని పురం పోలీసు స్టేషన్ లో అనేక కేసులు రిజిస్టర్ అయ్యాయి…అవుతూనే ఉన్నాయి.ఇతగాడు గంధం మీద ప్రేమ అభిమానం పొంగి పశ్చిమ నియోజకవర్గ మంతా ఏరులై పారించి అక్రమ కట్టడాలలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన గంధంను శుద్ధి చేయాలని చూస్తున్న ఇతగాడు సంచిక ఏ స్థితిలో ఉందంటే గురివింద సామెత లాగా ఉంది.మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో చచ్చిన శవానికి వైద్యం చేసిన చందానా అసలే సచిపోయింది ఫంక్షనింగ్ లో లేదు ఈయన ఇతరులకు నీతి మాటలు చెప్పడంచూస్తే మొదటి దేవుడికి లేక మొత్తుకుంటుంటే ఆఖరి దేవుడు వచ్చి ఆకుపూజ అడిగిన చందానా ఉంది.ముందు నీగతమేమిటీ,నీ ….కింద ఉన్న కేసులు పరిస్థితి ఏమిటీ,నీ నేర చరిత్ర ఎలాంటిది నీ ..కింద ఉన్న వాసన ఏమిటో చూసు కోకుండా ఎందుకు రా అయ్యా ఈ కపట వేషాలు.ప్రభుత్వ ఉద్యోగి అన్న తరువాత రిటైర్డ్ అవ్వక తప్పదు…కానీ అతను ఆ ఉద్యోగ ధర్మము లో ఏది చేశాడో అది అనుభవించక తప్పదు మరి.ఇది చరిత్ర చెప్పిన సత్యం.చరిత్ర ను మార్చగలం అనుకుంటే అదే తప్పే అవుతుంది. మేలుకో సరి చేసుకో…సత్ప్రవర్తన తో అలవరుచుకో ఆరోగ్యంగా జీవించు ..అంటే కానీ అవినీతి అధికారులను అందలం ఎక్కిస్తే అధః పాతాళానికి దారి తీస్తుంది.ఇది సృష్టి ధర్మం.