రూ 80 లక్షలకు వాళ్ళ బాపూజీ రెడ్డి కైవసం
కూనవరం:కూనవరం నుంచి రుద్రoకోట గోదావరి రేవు వేలం పాట గతంలో ఎన్నడూ లేని విధంగా రూ 80 లక్షలకు చేరుకొని రికార్డు సృష్టించింది. కూనవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంలో 16 మంది గిరిజన అభ్యర్థులు పాల్గొనగా విఆర్ పురం మండలం పోచవరం గ్రామానికి చెందిన వాళ్ల బాపూజీ రెడ్డి గరిష్ట ధర చెల్లించి రేవు పాట కైవసం చేసుకున్నారు. గత ఏడాది రూ 36.03 లక్షల పలికిన రేవు పాట అనూహ్యంగా గరిష్ట స్థాయికి చేరుకుంది. వేలంపాట నిర్వహణకు ముందు అధికారులు నియమ నిబంధనలను చదివి వినిపిస్తుండగా ప్రతి వ్యక్తికి రూ 40, మోటార్ సైకిల్ రూ 50 వసూలు చేయాలని చదవగా అధికంగా ధరలు వసూలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని రుద్రంకోట గ్రామస్తులు అధికారులు నిలదీశారు. నియమ నిబంధనల ప్రకారం ధరలను వసూలు చెయ్యాలని,ఏడాది అలా జరగకుండా చూసుకుంటామని అధికారులు సర్ది చెప్పడంతో వేలంపాట ప్రారంభించారు.ఈ వేలం పాటలో కూనవరం,రుద్రంకోట సర్పంచ్ లు మల్లంపల్లి హేమంత్ కుమార్, నాగంపల్లి స్వర్ణలత, ఎంపీటీసీలు కొమ్మని అనంతలక్ష్మి,బండారు సాంబశివరావు,కోమరరాజు రాంబాబు,ఎంపీపీ పాయం రంగమ్మ,కూనవరం, వేలేరుపాడు ఎంపీడీవో లు ప్రేమ్ సాగర్, శ్రీహరి,ఈఓఆర్డి రామాంజనేయ ప్రసాద్, ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వో వెంకన్న, పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.