వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి. అన్వేష్ డిమాండ్
కలసపాడు:కడప జిల్లాలోని పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లె కృపానగర్ గ్రామాలలో భూమిలేని పేదలందరికీ ప్రభుత్వం భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ డిమాండ్ చేశారుసోమవారం ఉదయం అక్కల్ రెడ్డి పల్లె కృపా నగర్ భూమి లేని పేదలతో భూ పోరాటం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ అక్కల్ రెడ్డి పల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 15 83 15 84 లో ప్రభుత్వ భూములు దాదాపు 500 ఎకరాలు ఉన్నాయి ఆ భూములు భూమిలేని పేదలందరికీ మూడు ఎకరాలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికే జిల్లా కలెక్టరు బద్వేలు ఆర్డిఓ కు స్థానిక పోరుమామిళ్ల ఎమ్మార్వో కు భూమిలేని పేదలందరూ అర్జీలు ఇప్పటికే పెట్టించడం జరిగిందన్నారు కానీ ప్రభుత్వం రెవెన్యూ ఉన్నతాధికారులు భూ పంపిణీ చేపట్టకపోవడం భూమిలేని నిరుపేదలందరికీ నిర్లక్ష్యం చేయటం సమంజసం కాదన్నారు ఇప్పటికైనా భూమిలేని నిరుపేదలందరికీ ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు చొప్పున భూ పంపిణీ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రభుత్వ భూములు అక్రమంగా దౌర్జన్యంగా అనర్హుల వందల ఎకరాలు సాగు చేస్తున్న రెవెన్యూ అధికారులు వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నారు గత పది సంవత్సరాల నుంచి పేదలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా భూ పంపిణీ చేయకుండా టిడిపి వైసిపి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి అన్నార ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ నాయకులు ఆరోగ్యం రామయ్య రాజు తదితరులు పాల్గొన్నారు