వేలేరుపాడు
జూన్ జూలై నెలలో సంభవించిన వరదల్లో నష్టపోయిన గ్రామాలను ఆదుకుంటామని ఇచ్చిన ప్రభుత్వ హామీలు ప్రకటనలకే పరిమిత మై అయ్యాయని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్ ఆరోపించారు.
వేలేరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో, కోయ మాధవరం, మేడిపల్లి, అల్లూరి నగర్ గ్రామాలలో పార్టీ గ్రామ కమిటీల, శాఖల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న, ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ, జూలై నెలలోవచ్చిన పెదవాగు వరదలకు నష్ట పోయిన ప్రజలను, రైతులనుఅన్ని రకాలుగా ఆదుకుంటామని, చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హామీ నెరవేరలేదని, అనేక గ్రామాలలోఏర్పడ్డ త్రాగు నీటి సమస్య పరిష్కారంకాలేదని , పెదవాగు ప్రాజెక్టు కు పడిన గండి ని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మాణం చేయాలని కోరారు, ప్రధానకుడి , ఎడమ కాలువలు మరమ్మతులు చేయాలని, ఏండ్ల తరబడి సాగు చేస్తున్న స్థానిక, వలస గిరిజనులకు, పోడు భూముల కు పట్టా హక్కులు ఇవ్వాలనికోరుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, జనవరి 6వ తేదీన వందలాది మందితో కోట రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అదే విధంగా జనవరి 2వ వారం లో పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, నిర్వాసితులవందల ఎకరాల భూములను, పెత్తందార్లు, పైరవీ కార్లు ఆక్రమించు కొన్న వాటినితిరిగి ఇప్పించాలని, జీలుగు మిల్లి లోజరిగే జిల్లా స్థాయి సదస్సును జయప్రదం చేయాలని, పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో, పార్టీ జిల్లా నాయకులు, సిరికొండ రామారావు , గడ్డల ముత్యాల రావు, పోలవరం డివిజన్ పార్టీ కార్యదర్శి, కట్టం ముత్యాలరావు, మేడిపల్లి సర్పంచ్, వేలేరుపాడు పార్టీ మండల కార్యదర్శి కట్టం రాంబాబు, , తుర్రం తమ్మయ్య, మండల నాయకులు కారం భాస్కర్, కొర్రి కృష్ణ,బొంజయ్య, ధర్మయ్య, రాజారావు,పోత య్య తదితరులు పాల్గొన్నారు.