పుట్లూరు:
పుట్లూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలను వామపక్ష పార్టీల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ బందును ఈ సందర్భంగా పుట్లూరు మండల సిపిఐ కార్యదర్శి డి, పెద్దయ్య , సిపిఎం కార్యదర్శి సూరి ఇరువురు మాట్లాడుతూ
కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపకుండా మోసగిస్తూ ఉన్నదని వ్యవసాయం, పరిశ్రమలు, గనులను, విద్యుత్ ,అటవీ సంపదను, రవాణా, బ్యాంకులు తదితర ప్రభుత్వ సంస్థలన్నిటిని మోడీ బినామీ అయినా ఆదాని కార్పొరేట్ కంపెనీలకు అప్పజ ప్పడానికి చూస్తున్నదని అలాగే కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నది.
కార్పొరేట్ కంపెనీలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్ లను తెచ్చి రైతుల ఉద్యమానికి తల వంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినా మరో రూపంలో వాటిని అమలు పరచాలని చూస్తున్నది. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజల నిత్యవసర వస్తువులన్నిటిపై జిఎస్టి పేరుతో పన్నులు పెంచింది. గత పది సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మోడీ గారి బినామీలైన ఆదాన్ని, అంబానిలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరగా పేద రైతులు,కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా 1,50,000 మంది బలవన్మరణం పాలయ్యారు. కావున వెంటనే స్వామినాథ కమిటీ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు2:50℅ ప్రకారం మద్దతు ధర చట్టం చెయ్యాలి, ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో రూ 2 లక్షల కోట్లు కేటాయించి 200 రోజుల పని దినాలు పెంచాలి .రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. ఆహార భద్రతా చట్టాన్ని ప్రతిష్టపరచాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి. కడప ఉక్కును నిర్మించాలి. భూ హక్క చట్టం 27/23ను ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడాన్నినిలుపుదల చేయాలి. ఇన్ఫుట్ సబ్సిడీ పంట బీమా వెంటనే చెల్లించి ఈ డిమాండ్లు పరిష్కరించాలి.
బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసులో బ్యాంకులు బంద్ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పెద్దిరాజు,చౌదరి,రమేష్,ఓబులపతి. పెద్దయ్య,పెద్దన్న,పెద్దకొండయ్య,భాస్కర్ రెడ్డి,D.సూరి, దేవరాజు,నాగభూషణం,నారాయణ,బలకొండయ్య,శేఖర్,తదితరులు పాల్గొన్నారు.