లేపాక్షి: మండల పరిధిలోని తిమ్మ గాని పల్లి ఎస్సీ కాలనీలో గంగమ్మ దేవాలయ పునర్నిర్మాణానికి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర, హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వ్యక్తి సహాయకులు బాలాజీ, లేపాక్షి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ జయప్ప, మాజీ ఎంపీపీ ఆనంద్ కుమార్లు భూమి పూజ చేశారు. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీనికి తోడు ఆలయము కూడా చిన్నదిగా ఉండడంతో గ్రామస్తుల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని పునర్నిర్మించాలని నిశ్చయించారు. దీంతో బుధవారం గంగమ్మ దేవి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గం లో ధార్మిక కార్యక్రమాలకు, ఆలయాల నిర్మాణాలకు శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే తిమ్మ గాని పల్లి గంగమ్మ ఆలయానికి కూడా శాసనసభ్యులు సహకారం అందిస్తారని పేర్కొన్నారు. టిడిపి కన్వీనర్ జయప్ప మాట్లాడుతూ, తన సొంత పంచాయతీ కొండూరు పరిధిలోని తిమ్మగానిపల్లిలో నిర్మిస్తున్న గంగమ్మ దేవి ఆలయానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధార్థ, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు రామాంజినమ్మ, వెంకటేష్, శివప్ప, శ్రీరామప్ప, నాగరాజు, అశ్వర్థ, నరసప్ప, మల్లి, శివ, ఆదినారాయణ, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీ నరసప్ప, నరసప్ప, వెంకటరమణప్ప, కొండప్ప, కదిరప్ప లతోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.