Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుమీ సమస్యల పరిష్కారానికి నాది హామీ

మీ సమస్యల పరిష్కారానికి నాది హామీ

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ వెల్లడి

గాజువాక:నేను గాజువాకకు స్థానికుడినే. మా తండ్రి, మా తాత ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్లాను తప్ప, అనకాపల్లి నుంచి ఇక్కడికి రాలేదు. నేను మీ కుటుంబ సభ్యుడిని. ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించే బాధ్యత మీదే” అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. స్థానిక 73 వ వార్డులోని సమతా నగర్ లో కార్పొరేటర్ భూపతి రాజు సుజాత శ్రీనివాస్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అమర్నాథ్ మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి గాజువాక ప్రజలతో కలిసిమెలిసి తిరిగానని, ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని, తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నియోజకవర్గం లో అపరిస్కృతంగా ఉన్న అనే క సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారని చెప్పారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 2000 కోట్ల తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, గతంలో ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదని అని చెప్పారు. ముఖ్యంగా గాజువాకలోని పలు కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించి నాగిరెడ్డి ప్రజలకు ఎంతో మేలు చేశారని చెప్పారు. తన తండ్రి గుర్నాథరావు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు కొండవాలు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు అని చెప్పారు. గుడివాడ వారసుడిగా, మీ కుటుంబాల్లో ఒక సభ్యునిగా తనను భావించి ఈ ఎన్నికల్లో తనకు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ కి ఓటు వేయాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.
ఇదిగో చంద్రబాబు ట్రైలర్ చంద్రబాబు అధికారంలోకి వస్తే వృద్ధులకు, వికలాంగులకు అందాల్సిన పింఛన్ అందకుండా చేసి వారిని ఏ విధంగా ఇబ్బంది పెడతాడో ట్రైలర్ చూపిస్తున్నాడని, రాష్ట్రంలో వాలంటీర్లు వ్యవస్థ ద్వారా అర్హులైన వారికి పింఛన్ అందకుండా కుట్ర పన్నుతున్నాడని, వృద్ధులను రోడ్డున పడేసాడని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో క్రమం తప్పకుండా వాలంటీర్లు వ్యవస్థ ద్వారా పింఛన్లను ఇళ్ళకే అందిస్తే, చంద్రబాబు ఆ వ్యవస్థ చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని చెబుతున్న చంద్రబాబు ఆయన అధికారులకు వస్తే ఈ వ్యవస్థను రద్దు చేయడానికి కూడా వెనకాడని అమర్నాథ్ అన్నారు.


జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేసి వారి వారికి పునర్జన్మ ఇచ్చి, గ్రూపులు కొనసాగే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరని నిలబడతారని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం 99 శాతం హామీలను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవడానికి పేదలు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ గాజువాకను ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి చేశామని భవిష్యత్తులో గాజువాక లోని మరిన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 25 వేల కుటుంబాలకు ఇక్కడ ఇల్లు మంజూరు చేశామని చెప్పారు. ఇది పేదల ప్రభుత్వమని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ భూపతి రాజు సుజాత మాట్లాడుతూ గాజువాక అభివృద్ధి విషయంలో నాగిరెడ్డి చూపిన చొరవ అభినందనీయమని అన్నారు. గురునాథరావు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతంలో ఇళ్లు కాలిపోతే తక్షణం పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని చెప్పారు. ఈ వార్డులో వైసిపికి భారీ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని సుజాత హామీ ఇచ్చారు. భూపతి రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి అందరం కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థులను గెలిపించుకోవాలని, అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వైసిపి ప్రభుత్వం వస్తేనే ప్రజలకు గౌరవం పెరుగుతుందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో పల్లా చినతల్లి, రాజన వెంకటరావు, కులుకూరు మంగరాజు మొల్లి చిన్న,మొహమ్మద్ గౌస్, షౌకత్ అలీ, ఆళ్ల శివ గణేష్, ఈగల పార్టీ యువశ్రీ, గొందేసి రమణారెడ్డి, కంది పైడినాయుడు, కరణం వేణుగోపాల్, వి.రామకృష్ణరాజు, గొరుసు సత్యం రెడ్డి, బొట్ట సత్తిబాబు, ప్రభ, కే.వరలక్ష్మి ,వార్డ్ బూత్ లెవెల్ కన్వీనర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article