తెలుపు రంగు గుగ్గిలంను వాడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం, మంగళవారం, శుభదినాలు, పండుగల సమయంలో తెలుపు గుగ్గిలాన్ని వాడటం ఎంతో మేలు చేస్తుంది. తెల్ల గుగ్గిలం అనేది చిన్న క్రిస్టల్, పొడి రూపంలో ఉంది. పూజా దుకాణంలో ఇది లభిస్తుంది. దీనిని సాంబ్రాణి పొడితో కలిపి సాధారణ ధూపంలా వాడితే ఇంట్లో శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తొలగించే శక్తి గుగ్గిలానికి వుంది.గుగ్గిలం అనేది సాంబ్రాణి మాదిరిగానే చెట్ల నుండి సేకరించే సుగంధ వస్తువు. గుగ్గిలంలో రెండు రకాలున్నాయి. ఒకటి తెలుపు రంగులో వుంటుంది. రెండోది నలుపు రంగులో వుంటుంది. శతాబ్దాలుగా తెల్లని గుగ్గిలాన్ని ధూపంలా వాడుతున్నారు. తెలుపు గుగ్గిలాన్ని వాడటం ద్వారా ఇంటి నుండి ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూలత ఏర్పడుతుందని విశ్వాసం. దేవతలతో పాటు ఇంట్లోని అన్నీ ప్రాంతాల్లో గుగ్గిలంతో సాంబ్రాణి వేయవచ్చు. ముందుగా దేవుడికి ధూపం వేసి.. ఆపై బాల్కనీలతో సహా ఇంటిలోని అన్ని గదులకు, మంచాల క్రింద, తలుపుల వెనుకకు తీసుకెళ్లవచ్చు. అల్మారా లోపల కూడా చూపించవచ్చు. గృహాలు, కార్యాలయ స్థలాల నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి దీన్ని వాడవచ్చు. కనీసం నెలకు ఒకసారి ఇంట్లో తులసి పూజ చేయడం ద్వారా దృష్టిలోపాలను తొలగించవచ్చు. మాంత్రిక ప్రభావాన్ని ఈ గుగ్గిలం దూరం చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు