పుస్తకావిష్కరణ పేరుతో ఎవరు పుస్తులు తెంచాలన్నారు..
వాడి ముష్టి కోసం ఎగబాకిందెవరు..
ఆ పన్నెండు మంది అతగాడిని ఎందుకు టార్గెట్ చేశారు..
గ్రంధాలయంలో కూసిన కూతలు నిజం కాదా..
ఆ కూతలు నిజమైతే ఎలా..కాకుంటే ఏమిటీ.. ?
అన్నీ అబద్ధాలే అయితే అబద్ధాల వెనుక ఉన్న ఆంతర్యం మేమిటీ…?
ఆహ్లాదకరమైన వాతావరణం లో అలజడులు దేనికోసం..?
అంత మొనగాడైతే అక్కడనుంచి ఉడాయించడం దేనికీ ..
అతగాడిలో ఉన్న ఆంతర్యమేమిటి..
ఈ తప్పులకు జీడిమెట్ల రౌడీ అండగా ఉంటాడా..
కళారంగం లో ఈ అల్లకల్లోలం దేనికి..
ఎవరి స్వార్థం కోసం ఇదంతా జరుగుతుంది..
పాయకాపురం పూర్తికథ ఏమిటీ..?
(కృష్ణసింధు,ప్రజాభూమి ప్రతినిధి,క్రైం)
పుస్తకం ఒక మస్తకం…ఆ పుస్తక పరిచయం ఒక అనుభూతి. ఒక పుస్తకావిష్కరణ జరిగితే ఎన్నో మస్తిష్కాలలో మేధస్సు పెరుగుతుంది. అసలు పుస్తకావిష్కరణే ఒక నాటకం అయితే ఆ పుస్తకకావిష్కరణ పేరుతో ఎవరి కొంపల్లో చిచ్చు పెట్టి తన కొంపను కాపాడుకొవాలని కుయుక్తులు చేస్తే అటువాటివాడిని ఏం చేసినా పాపం కాదని మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఒకడు కొంత కాలంగా తానొక అపర బ్రహ్మానని తాను తలుచుకుంటే నాటి విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం సృష్టించి నట్లు ఇతగాడు కూడా ఇంకో పెంకుల స్వర్గం సృష్టిస్తానని చెప్పుకుంటూ చెల్లుబాటు అవుతూ వస్తున్నాడు. ఇతగాడి దగ్గర అపార సంపద గుట్టలు గుట్టలు బంగారం ఉందని చెప్పడమే ఉందొ లేదో అంతా ఆ పరమేశ్వరుడికెరుక. అలా ఆర్భాటాలు చేస్తూ ఐదు వేలు పది వేలు ఇస్తూ తానొక శ్రీపతి పండితారాద్యులనని ,మరో ఘంటసాల అని ఇంకా ఏదో బ్రమల్లో ఉంటూ బీరాలు పోతు పలానా వారితోనే పది పాటలు అంటూ పెద్ద పెద్ద ఫోటోలు వేయాలని లోన చెబుతూ అబ్బే తనకు తీరికే లేకుంటే తన రాక కోసం ఎంతో తపన పడుతున్నారని తప్పుడు మాటలు చెబుతూ తూతూ అంటూ తాళం పల్లవి అనుపల్లవి లేక పోయినా తన స్థాయికి తగని పాటలు పాడుతూ పాటక లోకాన్ని మెప్పిస్తున్నానే భ్రమలో ఉంటూ అందరిని భ్రమిస్తూ ఉన్నాడు ఇతగాడు. అయితే ఇటీవల కళారంగలో ఇటువంటి వారి వల్ల అనుకోని దుస్సంఘటనలు జరిగాయి.అవి ఏ గ్రహాపాటో జరిగితే అందుకు కొంతమంది పెద్దలు కొంత సమయం కేటాయించి కళారంగంకు కీడు జరగకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇతగాడు గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తన వాలిపోతున్న వయస్సు ను ఏమాత్రం పట్టించుకోకుండా ఏదో ఒక కొంపలో చిచ్చు పెడితే ఇతగాడి అక్కడ తన ఏలుబడి సాగించాలనే కుయుక్తి పన్ని అసలు పాయకాపురం లో పుస్తకావిష్కరణ జరగక పోయిన అసలు సంబంధం లేని వారిని ఇందులోకి లాగి అక్కడ మహిళల దుస్తులు హవా భావాలపై అసభ్యంగా మాట్లాడినట్లు అందుకు ఈ మేధావి ఆవేదన చెందినట్లు అక్కడ ఇతగాడి సలహాలు సూచనలు కావాలని కోరినట్లు కోతలు కోసి చివరికి అవన్నీ కారుకూతలు కూసినట్లు కథలు అల్లి కొంపలు కూల్చే కార్యక్రమంకు కంకణం కట్టుకున్నారు.అయితే పూర్తి స్థాయి లో చర్చించగా అదంతా ఒక బుర్రకథ అని తేలింది. కళాకారులు అంటే ఒక రూపాయి వస్తే తమ కుటుంబ ము బాగుంటుందనే కోరికతో కంఠం లేక పోయినా ఆ కళా సంస్థ ఇచ్చే మర్యాద గౌరవం బట్టి కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ కొన్ని సంస్థల బలహీనత చూసి తాను లేకపోతే ఆ సంస్థలు ముందుకు సాగవన్న ధోరణిలో అనేక కండిషన్స్ పెట్టి కళారంగం లో చిచ్చు పెట్టి కళారంగంకు మాయని మచ్చ తెచ్చేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇతగాడే అన్నది తెలిసిన కేవలం రూపాయి చూసి రూపాన్ని భరించి ఆ రూటు లోకి కొన్ని కళా సంస్థలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. రూపాయి ఇవ్వకుండా అదే పది పాటలు పెద్ద ఫోటోలు వేస్తే అటువంటి కలసంస్థల అధినేత ల కాళ్ళు మ్రొక్కిన తప్పు లేదన్నది కొంతమంది పేద కళాకారుల వాదన. చూడాలి ఈ కళారంగానికి పట్టిన గ్రహణం ఎన్నడూ వీడుతుందా అని.