హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇష్టారాజ్యం నడుస్తోంది. ఏళ్లుగా పాతుకుపోయిన ఓ అధికారి చేతివాటంతో మొత్తం సంస్థకు చెడ్డపేరు వస్తోంది. ముఖ్యంగా ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఇష్టారాజ్యం నడుస్తోంది. రిలేషన్ షిప్ ఆఫీసర్ గా ఉన్న ఐశ్వర్య అధికారిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నారని తోటి ఉద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కిందిస్థాయిలో ఏం జరుగుతుందో పై అధికారులకు తెలియనీయడం లేదని చెప్తున్నారు. ఇక ఆమె అవినీతికి అడ్డూ అదుపూ లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చేయి తడపనిదే చిన్న కాగితం ముక్క కూడా ఆమె టేబుల్ దాటి వెళ్లదనే టాక్ ఉంది. చేసేది చీఫ్ రిలేషన్ షిప్ ఆఫీసర్ పని కానీ…పెద్ద స్థాయిలో ఉన్న అధికారులను కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని చాలా మంది ఉద్యోగులంటున్నారు. రూల్స్ ప్రకారం పని జరగాలని ఎవరైనా వాదిస్తే దురుసుగా మాట్లాడమే కాకుండా…తనకున్న మేనేజ్ మెంట్ స్కిల్స్ తో వారి కాకుండా నిలిపివేయిస్తారని, తనకు ఎదురు చెప్పినవారిపై కక్ష గడుతారని చెప్తున్నారు. అంతేకాదు చాలామంది పైస్థాయి అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ తన పనులు చేయించుకుంటోంది. 2019లో హెచ్ఎండీఏలో అడుగు పెట్టిన ఐశ్వర్య వల్ల ఇబ్బందులు పడని సహోద్యుగులు ఎవరూ ఉండరంటే ఆశ్యర్యపోక మానరు. ఆమె పేరు చెబితే గుర్తుపట్టేవారికంటే… ఆమ్యామ్యాల ఐశ్వర్య అంటే గుర్తుపట్టేవారి సంఖ్యనే ఎక్కువ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమెను హెచ్ఎండీఏలో నియమించగా…అప్పటి నుంచి తన మేనేజ్ మెంట్ స్కిల్స్ తో నెట్టుకొస్తున్నారు. ఫైల్స్ ముందుకు కదలాలంటే…బ్యాగు బరువుగా ఉండాలన్నది ఆమె రూల్. అంతేకాదు తోటి ఉద్యోగులను కూడా తన రూట్ లోకి మళ్లించేందుకు వారికి కూడా అవినీతి మరకలు అంటించారని ఐశ్వర్యపై ఆరోపణలు ఉన్నాయి. వారిని అనేక రూపాల్లో ప్రలోభపెట్టి పనులు చేయిస్తారని హెచ్ఎండీఏలో ఏ ఉద్యోగిని అడిగినా కథలు కథలుగా చెప్తారు.
ఇక కీలకమైన ఐటీ విభాగాన్ని రహమత్ అనే ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి అప్పగించారు. నిజానికి సీఐవోగా పనిచేయాలంటే కావాల్సిన అర్హతలేవీ లేకపోయినా..కేవలం రికమండేషన్ మీద వచ్చిన ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. ఐటీ విభాగాన్ని నడిపే సామర్ధ్యం, అవగాహన లేకపోవడంతో పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పైగా పెండింగ్ పనుల గురించి ఆయన్ను ప్రశ్నించేందుకు అధికారులు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి అధికారుల్లో అసహనం పెరిగిపోతోంది.
ఇలా హెచ్ఎండీఏలో పాతకుపోయిన అవినీతి అధికారులతో ఆ సంస్థకు చెడ్డపేరు వస్తోంది. రహమత్, ఐశ్వర్య చేస్తున్న అవినీతిపై అంతర్గతంగా చాలా మంది అధికారులు అనధికారికంగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. కానీ ఏవో అదృశ్య శక్తులు వారిని కాపాడుతున్నాయని అంటున్నారు సగటు ఉద్యోగులు.